Breaking News

Daily Archives: November 20, 2018

కామారెడ్డి అభివృద్ది బిజెపితోనే సాద్యం

  కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ది భారతీయ జనతాపార్టీతోనే సాద్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన పట్టణంలోని 4వ, 5వ, 10వ, 11వ వార్డుల్లో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 30 ఏళ్ళుగా టిడిపి, కాంగ్రెస్‌, తెరాసలు కామారెడ్డిని పాలించినా ఏం అభివృద్ది వెలగబెట్టారని ప్రశ్నించారు. కామారెడ్డి పట్టణంలో కనీస సౌకర్యాలైన తాగునీరు, మురికి కాలువలు, రోడ్లు సైతం లేవని ...

Read More »

హామీలు నెరవేర్చని తెరాస నాయకులకు ఓటు అడిగే హక్కు ఎక్కడిది

  కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చని ముఖ్యమంత్రి కెసిఆర్‌తో సహా తెరాస నాయకులకు ఓటు అడిగే హక్కు ఎక్కడిదని కామారెడ్డి అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ విమర్శించారు. మంగళవారం దోమకొండ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితుని సిఎం చేస్తానని లేకుంటే తల నరుక్కుంటా అని, ఇంటింటికి నల్లా ఇవ్వకపోతే ఓట్లు అడగనన్నాడు, మరి కెసిఆర్‌ ఇచ్చాడా ఆయన ప్రశ్నించారు. ఎంతమందికి రెండు పడక ...

Read More »

దివ్యాంగులు క్రీడల్లో పాల్గొనడం వారి మనోబలానికి నిదర్శనం

  కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగులు క్రీడల్లో పాల్గొనడం వారి మనోబలానికి నిదర్శనమని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. డిసెంబరు 3 అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మంగళవారం ఇందిరాగాంధీ స్టేడియంలో దివ్యాంగుల క్రీడోత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. దివ్యాంగులు చదువు, క్రీడలు తదితర రంగాల్లో ఉన్నతిని సాధించాలని అభిలాషించారు. ఎన్నికల్లో దివ్యాంగులందరితో ఓటు నమోదు చేయిస్తామని అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. అనంతరం ఎన్నికల సిబ్బంది ...

Read More »

స్వచ్చతపై అందరికి అవగాహన కల్పించాలి

  కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్చతపై అందరికి అవగాహన అవసరమని ఆ దిశగా ప్రజాప్రతినిదులు, అధికారులు, విద్యార్థులు కృషి చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. స్వచ్చ సర్వేక్షణ్‌ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కామారెడ్డి మునిసిపాలిటి ఆద్వర్యంలో రాశి వనం నుంచి స్వచ్చ సర్వేక్షణ్‌ ర్యాలీని విద్యార్థులు, ఉద్యోగులతోపాటు నిర్వహించారు. ర్యాలీని కలెక్టర్‌ ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. పరిశుభ్రతపై శ్రద్ద వహించి అనారోగ్యాలకు దూరంగా ఉండాలన్నారు. గ్రామాల్లో నిరక్షరాస్యులకు స్వచ్చత దానికి సంబంధించి అవగాహన కలిగించాలని ...

Read More »

శ్రీనిధి ద్వారా వడ్డిలేని రుణాలు

  రెంజల్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీనిధి ద్వారా వడ్డిలేని రుణాలను పొందవచ్చని ఏపిఎం చిన్నయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య సమావేశాన్ని మండల అధ్యక్షురాలు జమున అధ్యక్షతన నిర్వహించారు. గ్రామాల్లో మహిళా సంఘాలు అభివృద్ది చెందాలంటే ప్రతినెల సంఘాలతో సమావేశాలు ఏర్పరుచుకోవాలన్నారు. శ్రీనిధి రుణాలు పెండింగులో ఉన్నవాటిని వెంటనే పరిష్కరించుకోవాలని తిరిగి మళ్లీ వడ్డిలేని రుణాలు పొందవచ్చని ఏపిఎం చిన్నయ్య అన్నారు. కార్యక్రమంలో సిసిలు శ్యామల, కృష్ణ, రాములు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Read More »

ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత

  రెంజల్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని మొండివాగు నుండి ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకుని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ శంకర్‌ తెలిపారు.

Read More »