నిజామాబాద్ టౌన్, నవంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటర్లు ఎలాంటి ప్రలోబాలకు గురికాకుండా నిష్పక్షపాతంగా ఓటు వేయాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్రావు సూచించారు. ఆదివారం తన చాంబరులో ఎన్నికల నోడల్ అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రముఖుల ఫోటోలతో హోర్డింగ్లు, కళాశాలలో అవగాహన కార్యక్రమాలు, వివిధ వర్గాలతో అవగాహన ర్యాలీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి పోలింగ్రోజు దివ్యాంగులకు ఓటు వేసేందుకు రవాణా సౌకర్యం కల్పించాలని అన్నారు. మండలం, గ్రామాల వారిగా ఆటోల వివరాలు అందజేయాలని రవాణా శాఖాధికారులను ఆదేశించారు. ఎన్నికల సందర్భంగా ఇంకా మిగిలిపోయిన మెటీరియల్ ఉంటే తెప్పించుకొని పోలింగ్ రోజు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. ఓటరు కంపార్టుమెంట్ మిగతా నియోజకవర్గాల కంటే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో రెండు బ్యాలెట్ యూనిట్ల ఏర్పాటు చేసేవిధంగా కాంపార్టుమెంటు టేబుళ్లను ఏర్పాటు చేయాలన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల రోజువారి ఖర్చుల వివరాలు మూడు దఫాలుగా తనిఖీ చేయనున్నందున వ్యయ రిజిష్టర్లు, షాడో రిజిష్టర్లు పంపిణీ చేసేందుకు ఈనెల 26న ఎన్నికల వ్యయ పరిశీలకులు తనికీ చేయనున్నందున పోటీలో ఉన్న అభ్యర్థులు, ఏజెంట్లు తప్పకుండా హాజరయ్యే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డిఆర్వో అంజయ్య, నోడల్ అధికారి రెడ్డి, చతుర్వేది, సింహాచలం, ఉదయ ప్రకాశ్, హరికృష్ణ, మహ్మద్ ముర్తుజ తదితరులున్నారు.
NNewsAdmin
Latest posts by NNewsAdmin (see all)
- ప్రజలు అభివృద్దికే పట్టం కడతారు - December 8, 2018
- బాన్సువాడలో పోచారం ఓటమి ఖాయం - December 8, 2018
- ప్రజా వ్యతిరేక సునామిలో తెరాస కొట్టుకుపోవడం ఖాయం - December 8, 2018