Breaking News

ఎన్నికల విధులపై పూర్తి అవగాహన అవసరం

కామారెడ్డి, నవంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులకు పోలింగ్‌ నిర్వహణ పట్ల, విదుల పట్ల పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సత్యనారాయణ తెలిపారు. గురువారం జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబందించి బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలింగ్‌ విధులపై నిర్వహిస్తున్న రెండో విడత శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాలపై సిబ్బందికి పూర్తిస్థాయి అవగాహన ఉండాలన్నారు. ఎలాంటి సందేహాలున్నా శిక్షణలోనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. యంత్రాలపై అవగాహన కల్పించారు. పోలింగ్‌, పోలింగ్‌ సరళి, విధులపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గ సాధారణ పరిశీలకుడు బ్రిజ్‌రాజ్‌ రాయ్‌, జుక్కల్‌ రిటర్నింగ్‌ అదికారి రాజేశ్వర్‌, డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి, నోడల్‌ అధికారి డాక్టర్‌ రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article