Breaking News

పోచారం విస్తృత ప్రచారం

బాన్సువాడ, నవంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల గడువు సమీపిస్తున్న తరుణంలో అదికార పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. గురువారం బాన్సువాడ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆయన సుడిగాలి ప్రచారం కొనసాగించారు. బుధవారం బాన్సువాడలో నిర్వహించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రచార సభ విజయవంతం కావడంతో మంచి ఊపుమీద ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం వర్ని మండలం సత్యనారాయణ పురం, తగిలేపల్లి, నాయక్‌ తాండా, కోటగిరి మండలం కొడిచెర, హంగర్గ, కారేగాం, టాక్లీ, వల్లభాపూర్‌ తదితర గ్రామాల్లో ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కనివిని ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి సభ విజయవంతం కావడం హర్షణీయమన్నారు. ప్రజలు, పార్టీ శ్రేణులు ఎంతో ఉత్సాహంతో సభ విజయవంతం చేశారని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల కొరకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని వివరించారు. కళ్యాణలక్ష్మి, రైతుబంధు పథకం, కెసిఆర్‌ కిట్‌, రైతుబీమా పథకాలు విజయవంతమై ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు చివరి ఆయకట్టు వరకు నీరందించడానికి కోట్ల రూపాయలు వెచ్చించి కాలవలు ఆధునీకరించనున్నట్టు తెలిపారు. వృద్దులకు, వికలాంగులకు పింఛన్‌ ఇప్పించడం వారికి ఆర్థికంగా లబ్దిచేకూరిందని వివరించారు. ఎన్నికల్లో గెలిస్తే లబ్దిదారులకు పించన్లు రెట్టింపు చేస్తున్నామన్నారు. సొంత ఇంటి స్థలాలుగల పేదవర్గాలకు రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు బాన్సువాడలో తెరాస కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు తమ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article