Breaking News

Daily Archives: December 4, 2018

ఓటమి భయంతోనే రేవంత్‌రెడ్డి అరెస్టు

కామారెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కెసిఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని అందుకోసమే రేవంత్‌రెడ్డిని అర్దరాత్రి అరెస్టు చేయించారని కామరెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ అన్నారు. మంగళవారం ఆయన మాచారెడ్డి మండలం మాచారెడ్డి, సీతాయిపేట్‌, అన్నారం, రెడ్డిపేట్‌ గ్రామాల్లో పర్యటించారు. వరంగల్‌లో నిర్వహించిన కెసిఆర్‌ సభ జరగదేమోనని భయంతో ముందస్తు అరెస్టు చేయించారని రాష్ట్రంలో మహాకూటమి గెలుపును అరెస్టులతో ఆపలేరని పేర్కొన్నారు. నాలుగున్నరేళ్ల కెసిఆర్‌ పాలనపై ప్రజలు విసుగుచెందారని, గజ్వేల్‌లో తన ఓటమిని తానే ఒప్పుకున్నారని అన్నారు. రాష్ట్రంలో ...

Read More »

మద్యం పట్టివేత

కామారెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం ఇస్రోజివాడి గ్రామంలో ఆబ్కార్‌ ఆధికారులు దాడులు నిర్వహించి మద్యం పట్టుకున్నారు. సుదర్శన్‌రావు అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా దాచి ఉంచిన 140 క్వాటర్‌ సీసాలతో పాటు పది ఎంసి ఫుల్‌బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. సుదర్శన్‌ను అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

Read More »

బుధవారం కవి సమ్మేళనం

కామారెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరసం కామారెడ్డి ఆద్వర్యంలో బుధవారం కవిసమ్మేళనం నిర్వహించనున్నట్టు తెరసం ప్రతినిదులు నర్సింహారెడ్డి, చలపతి విశ్వకర్మలు తెలిపారు. భీమేశ్వరాలయ ప్రాంగణంలో బుధవారం ఉదయం 10 గంటలకు కవిసమ్మేళనం ఉంటుందన్నారు. దీనికి ముఖ్య అతిథిగా తెరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ శంకర్‌ హాజరుకానున్నట్టు పేర్కొన్నారు.

Read More »

రామలక్ష్మణులను గెలిపించుకొని సంక్షేమానికి బాటలు వేయండి

కామారెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గ బిజెపి అభ్యర్థి రమణరెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గ అభ్యర్థి లక్ష్మారెడ్డి ఇద్దరు రామలక్ష్మణులని వారిని గెలిపించుకొని రామరాజ్య స్థాపనకు సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టాలని స్వామి పరిపూర్ణానంద పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ తెరాస అధినేత కెసిఆర్‌ నోటికొచ్చిన వాగ్దానాలిచ్చి ముందే దిగిపోయి ప్రజల ఆశలను నట్టేట ముంచారని విమర్శించారు. ఇళ్లేమయ్యాయి, నీళ్లేమయ్యాయి, ఉద్యోగాలేమయ్యాయని నిలదీశారు. తెరాస లాగా బిజెపికి ...

Read More »

ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి

కామారెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది విధులను పకడ్బందీగా నిర్వహించాలని నిర్లిప్తతకు తావివ్వద్దని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం కామరెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాలపై పూర్తిస్తాయి అవగాహన కలిగి ఉండాలని, ముందే సందేహాలు నివృత్తిచేసుకోవాలని సూచించారు. పోలింగ్‌రోజున ప్రతి రెండు గంటలకు పోలింగ్‌ శాతాన్ని తెలియజేయాలని చెప్పారు. మాక్‌పోల్‌, క్లియరెన్సుపై శ్రద్ద ...

Read More »

ఎన్నికల ఉల్లంఘన జరిగితే వెంటనే చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలింగ్‌ తేదికి ముందు రోజుల్లో ఎటువంటి సంఘటనలు, ఎన్నికల ఉల్లంఘనలు జరిగినా వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అదికారి సత్యనారాయణ అధికారులకు సూచించారు. కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం నుంచి మంగళవారం ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, రిటర్నింగ్‌ అధికారులు, పోలీసుశాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. మాడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్టులో భాగంగా పోలింగ్‌కు 72 గంటల ముందు ఎటువంటి డబ్బులను ఆన్‌లైన్‌లో ...

Read More »

ఎన్నికల వరకు చెక్‌పోస్టుల వద్ద పకడ్బందీ తనిఖీలు చేపట్టాలి

రెంజల్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల రోజు వరకు చెక్‌పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనికీలు చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. మంగళవారం మండలంలోని కందకుర్తి అంతరాష్ట్ర చెక్‌పోస్టును పరిశీలించి తనిఖీల వివరాలు సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అనుమానిత నగదు, మద్యంతోపాటు పెద్ద సంఖ్యలో బహుమతులు దొరికినా సీజ్‌ చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను ...

Read More »

జక్రాన్‌పల్లిలో బాజిరెడ్డి విస్తృత ప్రచారం

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస రూరల్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ జక్రాన్‌పల్లి మండలంలో మంగళవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోడ్‌షో ద్వారా ప్రసంగిస్తు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తు ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని, ముఖ్యమంత్రి కెసిఆర్‌ బంగారు తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ...

Read More »

ఆశీర్వదించండి, అండగా ఉంటా

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న శాసనసభ ఎన్నికల్లో నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్‌ నిజామాబాద్‌ అర్బన్‌ అభ్యర్థి తాహెర్‌బిన్‌ హందాన్‌ కోరారు. మంగళవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని, అర్బన్‌ ప్రజలు కూడా తనను ఆప్యాయంగా ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలన్ని నెరవేరుస్తుందని, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ...

Read More »

ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో తెరాస విఫలం

రెంజల్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చమని గొప్పలు చెప్పడమే తప్ప ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో తెరాస పార్టీ విపలమైందని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని బాగేపల్లి గ్రామంలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత ఒక్క కాంగ్రెస్‌ పార్టీదేనన్నారు. ఎన్నికలకు ముందు అది చేస్తాం ఇది చేస్తాం అని గొప్పలు చెప్పిన కెసిఆర్‌ ...

Read More »

ఎన్నికల ప్రచారంలో బిగాల కుటుంబీకులు

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ తెరాస అభ్యర్థి బిగాల కుటుంబ సభ్యులు మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా శ్రీవాణి, శ్రీరాణి, ఎల్లమ్మగుట్ట, 5వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రభుత్వ పెన్షన్‌ లబ్దిదారులుండడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. బిగాల లత మాట్లాడుతూ తెరాస అభ్యర్థి గణేష్‌ గుప్తను గెలిపించి నిజామాబాద్‌ నగరాన్ని మరింత అభివృద్ది ...

Read More »

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆకుల లలిత

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్తి ఆకుల లలిత మంగళవారం గడప గడపకు కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమంలో భాగంగా మాదాపూర్‌ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు లలితను ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గంగరమంద, కొండూరు, మామిడిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లలిత మాట్లాడుతూ తన ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది మహాకూటమి అని తనను ఆర్మూర్‌ ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.

Read More »

తెరాసలో చేరిన రాజారాం యాదవ్‌

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు తెలంగాణ పోరాటంలో చురుకైన పాత్ర వహించిన రాజారాం యాదవ్‌ మంగళవారం ఎంపి కవిత, ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో తెరాసలో చేరారు. గత ఎన్నికల్లో బిజెపి, టిడిపి కూటమిలో ఆర్మూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన రాజారాం యాదవ్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడి తెరాసలో చేరారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నపుడు రేవంత్‌రెడ్డి అనుచరుడిగా ఉన్న రాజారాం యాదవ్‌, ఆయనతోపాటు కాంగ్రెస్‌లో చేరారు. ప్రజాకూటమి పేరుతో అన్ని ...

Read More »

యెండల విస్తృత ప్రచారం

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ అర్బన్‌ అభ్యర్థి యెండల లక్ష్మినారాయణ మంగళవారం 8,11,18వ డివిజన్‌లలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మినారాయణ మాట్లాడుతూ ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని బిజెపిని ప్రజలు ఆదరిస్తు ఘన స్వాగతం పలుకుతున్నారని అన్నారు. బిజెపి గెలుపుపట్ల దీమా వ్యక్తం చేశారు. మార్కెట్‌ను సుందరీకరణ చేస్తామని, డ్రైనేజీ సమస్య పరిష్కరించి నగరాన్ని స్మార్ట్‌ సిటిగా మార్చడమే బిజెపి లక్ష్యమని అన్నారు. యువతకు ముద్ర పథకం ...

Read More »

చెక్‌పోస్టుల వద్ద పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలి

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెక్‌పోస్టుల వద్ద పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం నవీపేట మండలం యంచ, రెంజల్‌, కందకుర్తి వద్ద అంతర్‌జిల్లా చెక్‌పోస్టులను కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల రోజు వరకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. తనిఖీల సమయంలో వివరాలను అడిగి తెలుసుకోవాలని, నమోదు చేసి రిజిస్ట్రేషన్లు, ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్‌ సూచించారు. ...

Read More »

గుడిసెకు నిప్పంటుకొని ఇద్దరు చిన్నారుల మృతి

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని గూపన్‌పల్లి ప్రాంతంలో ఆర్మూర్‌ రోడ్డు పక్కన గుడిసె వేసుకొని బతుకు దెరువుకోసం అంజుమాన్‌ ఫారం నుంచి నిజామాబాద్‌ వచ్చి కూలి పనిచేస్తున్న కుటుంబం అగ్నిప్రమాదంతో చిన్నాభిన్నమైన సంఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… అంజుమన్‌ ఫారానికి చెందిన దేవిదాస్‌, భార్య, ఇద్దరు చిన్నారులతో పాటు గూపన్‌పల్లి పెట్రోల్‌పంపు వద్ద గుడిసెలో ఉంటూ కూలిపనిచేస్తు జీవనం సాగిస్తున్నారు. రోజువారిలాగే పనిపూర్తిచేసుకొని ఇద్దరు చిన్నారులతో కలిసి నిద్రకు ఉపక్రమించారు. నివాసముంటున్న ...

Read More »