ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం జరిగిన తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో నిజామాబాద్‌ ఎంపి కవిత తన భర్త అనిల్‌రావుతో నవీపేట్‌ మండలం పోతంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌, అర్బన్‌ తెరాస అభ్యర్తి బిగాల గణేశ్‌ గుప్త దంపతులు, వీరితోపాటు అర్బన్‌ బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మి నారాయణ కుటుంబీకులు, రూరల్‌ తెరాస అభ్యర్తి బాజిరెడ్డి గోవర్ధన్‌ కుటుంబ సభ్యులు, ఆర్మూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆకుల లలిత, తెరాస అబ్యర్థి జీవన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిజామాబాద్‌ మాజీ ఎంపి మధుయాష్కీగౌడ్‌, బిజెపి నాయకులు అర్వింద్‌ ధర్మపురి దంపతులు, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి దంపతులు తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Check Also

వార్‌ వన్‌ సైడే : ఎంపీ కవిత

నిజామాబాద్‌ ప్రతినిధి, మార్చ్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంట్‌ ఎన్నికల్లో వార్‌ వన్‌ సైడే అని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *