ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా బుధవారం జరిగిన శాసనసభ ఎన్నికలు చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం వరకు ఊపందుకుంది. ఎన్నికల ఓటింగ్‌పై ప్రజలకు కేంద్ర ఎన్నికల సంఘం, జిల్లా యంత్రాంగం చైతన్యం కలిగించినా ప్రజల నుంచి అంతగా స్పందన రాలేదని చెప్పాలి. గతంతో పోల్చుకుంటే ఈసారి పోలింగ్‌ శాతం తగ్గింది. నిజామాబాద్‌ అర్బన్‌తోపాటు రూరల్‌ నియోజకవర్గాల్లో, బోధన్‌, ఆర్మూర్‌, బాల్కొండ నియోజకవర్గాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులు బిగాల గణేశ్‌ గుప్త, యెండల లక్ష్మినారాయణ, తాహెర్‌బిన్‌ హందాన్‌, రూరల్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ అబ్యర్థి భూపతిరెడ్డి, తెరాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్‌, బోధన్‌ నుంచి తెరాస అభ్యర్థి షకీల్‌ అహ్మద్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి, ఆర్మూర్‌ నుంచి తెరాస అభ్యర్థి జీవన్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్తి ఆకుల లలిత, బాల్కొండ తెరాస అబ్యర్థి ప్రశాంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి అనిల్‌ బరిలో ఉన్నారు. ఎన్నికల పలితాలు ఈనెల 11న తేలనున్నాయి. మొత్తంమీద ఎన్నికల సరళిని పరిశీలిస్తే ఎవరికి స్పష్టమైన మెజార్టీ రాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Check Also

వార్‌ వన్‌ సైడే : ఎంపీ కవిత

నిజామాబాద్‌ ప్రతినిధి, మార్చ్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంట్‌ ఎన్నికల్లో వార్‌ వన్‌ సైడే అని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *