Breaking News

అర్బన్‌ నియోజకవర్గంలో భారీ సంఖ్యలో ఓట్ల గల్లంతు

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో భారీ సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయి. ఒక్క అర్బన్‌ నియోజకవర్గంలో 25 వేల మందికి ఓటరు జాబితాలో పేరు రాలేదు. దీంతో ఓటర్లందరు నిజామాబాద్‌ అర్బన్‌ రిటర్నింగ్‌ అధికారి, మునిసిపల్‌ కమీషనర్‌ జాన్సన్‌ను కలిసి నిలదీశారు. పూర్వాపరాలు పరిశీలించి సంబంధిత అధికారులను పిలిచి ఓటు రానివారి ఆధార్‌కార్డుతో పరిశీలించి వారికి న్యాయం చేయాలని ఆదేశించారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న బిజెపి కేంద్ర కార్యవర్గ సభ్యులు హన్మంత్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ సర్వేల నిర్లక్ష్యమేనని ఆరోపించారు. పరిస్తితి గమనించిన పోలీసులు బాధితులకు నచ్చజెప్పారు. 4వ టౌన్‌ ఎస్‌ఐ అశోక్‌రెడ్డి అక్కడికి చేరుకొని ఓటర్లను సముదాయించారు. రూరల్‌ నియోజకవర్గంలో కూడా ఓట్లు గల్లంతయ్యాయని ఫిర్యాదులు అందాయి.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *