Breaking News

కామరెడ్డి జిల్లాలో 83.05 శాతం పోలింగ్‌

కామారెడ్డి, డిసెంబరు 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో శుక్రవారం జరిగిన పోలింగ్‌లో 83.05 శాతం పోలింగ్‌ నమోదైనట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. శనివారం స్థానిక ఏఎంసి గోదాములో కామరెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలు ముగిసిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఓటింగ్‌లో పెద్ద ఎత్తున పాల్గొన్న ఓటర్లకు, సహకరించిన మీడియా, ఎన్నికల సిబ్బంది, పోలీసులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. మూడు నియోజకవర్గాలు కలిపి 5 లక్షల 78 వేల మంది ఓటర్లు ఉండగా 83.05 శాతం పోలింగ్‌లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. 2014లో 75.48 శాతం ఉండగా, ప్రస్తుతం 8 శాతం పెరిగి 83.05 శాతం పోలింగ్‌ నమోదు కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాలు భద్రపరచామని, 11న కౌంటింగ్‌కు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. గెలుపొందిన అభ్యర్థికి ఫాం-22 ద్వారా దృవీకరణ పత్రాన్ని అదేరోజు అందిస్తామని తెలిపారు. జిల్లా ఎస్‌పి శ్వేత మాట్లాడుతూ ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించడం, విస్తృత ప్రచారం జరపడంతో పోలింగ్‌ శాతం పెరిగిందన్నారు. ఎన్నికలను ప్రభావంచేసే అన్ని కార్యకలాపాలపై నిఘా ఉంచడంపట్ల పోలీసు ప్రశాంతంగా జరిగిందన్నారు. దీనికోసం సహకరించిన పోలీసు, వివిద బలగాలను అభినందించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకటేశ్‌ గోత్రె, రిటర్నింగ్‌ అధికారులు రాజేంద్రకుమార్‌, రాజేశ్వర్‌, దేవేందర్‌రెడ్డి, నోడల్‌ అధికారులు శ్రీనివాస్‌, రఘునాథ్‌, నాగేంద్రయ్య, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article