Breaking News

ప్రజలు అభివృద్దికే పట్టం కడతారు

కామారెడ్డి, డిసెంబరు 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాలుగున్నరేల్ల పాటు ప్రజలకు సంక్షేమ పాలన అందించిన తెరాసకే తిరిగి పట్టం కడతారని కామారెడ్డి తెరాస అభ్యర్థి గంప గోవర్దన్‌ అన్నారు. ఎన్నికల అనంతరం శనివారం ఆయన పార్టీ శ్రేణులతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల అనంతరం అన్ని ఛానెళ్లు, పత్రికలు విడుదల చేసిన ఎగ్జిట్‌ పోల్స్‌లో ఇదేవిషయం స్పష్టమైందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కెసిఆర్‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందారని అన్నారు. మహాకూటమి నాయకుడు ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలు నమ్మలేరని పేర్కొన్నారు. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు గోపీగౌడ్‌, పిప్పిరి వెంకటి, బల్వంత్‌రావు, నందరమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

చిన్నమల్లారెడ్డిలో పోలీసుల కవాతు

కామారెడ్డి, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక, పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *