Breaking News

ప్రజా వ్యతిరేక సునామిలో తెరాస కొట్టుకుపోవడం ఖాయం

కామారెడ్డి, డిసెంబరు 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా వ్యతిరేకసునామిలో తెరాస కొట్టుకుపోవడం ఖాయమని కామారెడ్డి కాంగ్రెస్‌ అసెంబ్లీ అభ్యర్థి మహ్మద్‌ షబ్బీర్‌ అలీ అన్నారు. శనివారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తొందరపాటు నిర్ణయంతో కెసిఆర్‌ ముందస్తు ఎన్నికల పేరిట రాష్ట్రంపై ఎన్నికల ఖర్చు భారాన్ని రుద్దారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబరు 6న అసెంబ్లీ రద్దుచేసి అదేరోజు అభ్యర్థులను ప్రకటించడం వెనక ఆయన కోట్లాది రూపాయల పార్టీ ఫండ్‌ సమకూర్చుకున్న విషయం స్పష్టమవుతుందన్నారు. 18 పార్టీలతో కలిసి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కెసిఆర్‌ ప్రజల హక్కులను కాలరాసే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని, ధర్నా చౌక్‌ను సైతం ఎత్తివేసిన ఘనత ఆయనకే దక్కిందని విమర్శించారు. ప్రజలను, నాయకులను అధికారులను తెరాస ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేసినా ప్రజలు తమ తీర్పునిచ్చారని పేర్కొన్నారు. 11న వెలువడనున్న ఫలితాల్లో ఉమ్మడి నిజామాబాద్‌లోని అన్ని స్థానాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నల్లమడుగు సురేందర్‌, జనార్దన్‌గౌడ్‌, కాసుల బాలరాజు, కత్తెర గంగాధర్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article