Breaking News

ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి

కామారెడ్డి, జనవరి 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ప్రజలను కోరారు. ఆదివారం గాంధారి గ్రామపంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. పలు రికార్డులు రిజిస్టర్లకు పరిశీలించారు. జిల్లా పరిషత్‌ హై స్కూల్‌లోని పోలింగ్‌ స్టేషన్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలందరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. రెండవ విడత నామినేషన్లలో భాగంగా రెండవ రోజు వరకు 192 గ్రామ పంచాయతీలకు సంబంధించి 472 సర్పంచ్‌ నామినేషన్‌లు, 1622 సభ్యులకు గాను 1527 నామినేషన్‌లు దాఖలు కాబడ్టినట్టు, మూడు విడతలలో మొత్తం 526 గ్రామ పంచాయతీలకు, 4642 వార్డులకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మొదటి విడతలో 164 గ్రామపంచాయతీ సర్పంచ్‌లకు 976 నామినేషన్లు, 1508 వార్డు మెంబర్లకు 3769 నామినేషన్లు పరిశీలనలో అర్హత పొందాయని, 17 గ్రామ పంచాయతీలకు సింగిల్‌ నామినేషన్‌ దాఖలు కాబడినట్లు తెలిపారు.

అనంతరం జిల్లా పరిషత్‌ హై స్కూల్‌లో నడుస్తున్న ఓపెన్‌ పదవ తరగతి విద్యార్థులను క్లాసును పరిశీలించారు. కార్యక్రమంలో గాంధారి మండల అభివద్ధి అధికారి సాయాగౌడ్‌, తహసీల్దార్‌ లత, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

లాక్‌డౌన్ ప‌రిశీలించిన ఎస్‌పి శ్వేత‌

కామారెడ్డి, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కరోనా విజృంభణ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ...

Comment on the article