Breaking News

స్వచ్ఛ సుందర్‌ శౌచాలయ్‌ పోటీలు

కామారెడ్డి, జనవరి 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో స్వచ్ఛ సుందర్‌ శౌచాలయ్‌ పోటీలకు సంబంధించి ఈ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు శౌచాలయ్‌ ఫోటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వ డ్రింకింగ్‌ వాటర్‌ శానిటేషన్‌ మంత్రిత్వశాఖ డిప్యూటీ సెక్రటరీ మహేష్‌ ఠాకూర్‌ తెలంగాణ రాష్ట్ర జిల్లా కలెక్టర్లకు సూచించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తెలంగాణ, మధ్యప్రదేశ్‌ రాష్ట్ర జిల్లా కలెక్టర్లతో ఆయన స్వచ్చసుందర్‌ శౌచాలయ్‌ పోటీలకు సంబంధించి సమీక్ష నిర్వహించారు.

సమీక్షలో జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, జిల్లా గ్రామీణ అభివద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ చంద్రమోహన్‌ రెడ్డి, స్వచ్చభారత్‌ సిబ్బంది శంకర్‌, నారాయణ పాల్గొన్నారు. స్వచ్ఛ సుందర్‌ శౌచాలయ్‌ పోటీలు జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిలో జరగనున్నాయి. టాయ్‌లెట్స్‌ శుభ్రంగా ఉంచుకుని, గోడలకు సుందరంగా రంగులు వేయడం పోటీ ఉద్దేశం.

పోటీలో గెలుపొందిన వారికి ప్రధమ, ద్వితీయ, తతీయ బహుమతులు అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ వివరిస్తు , కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు 106 ఫోటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడం జరిగిందని ప్రతి గ్రామ పంచాయతీ నుంచి 5 ఫోటోలను సేకరించి అప్‌లోడ్‌ చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 1 లక్ష 61 వేల 244 వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తిచేసుకొని వందశాతం ఓడిఎఫ్‌ సాధించడం జరిగిందని అన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article