Breaking News

Daily Archives: January 24, 2019

మానసిక ఉల్లాసానికి క్రీడలు

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయవాదులు క్రీడాపోటీలను గురువారం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు సెషన్స్‌ జడ్జి గౌతం ప్రసాద్‌ హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది తమ రోజువారి విధులు, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు స్నేహపూర్వక పోటీల్లో పాల్గొనడం ద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. అనంతరం అసోసియేషన్‌ అధ్యక్షుడు ...

Read More »

బస్సు ఢీకొని వివాహిత మృతి

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మండలం కాలూర్‌ గ్రామ శివారులో బస్సు ఢీకొని గ్రామానికి చెందిన మారెమ్మ అనే వివాహిత మృతి చెందింది. నిజామాబాద్‌ నుంచి జన్నేపల్లి వెళుతున్న బస్సు ఏపి 28 జెడ్‌ 1930 డిపో 2, అతివేగంగా వచ్చి మోటారుసైకిల్‌పై వెళుతున్న దంపతులను ఢీకొనడంతో మారెమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. కాగా బస్సు డ్రైవర్‌ వేణుగౌడ్‌పై కేసు నమోదుచేసినట్టు రూరల్‌ పోలీసులు తెలిపారు.

Read More »

విద్యార్థిని అదృశ్యం

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న పల్లవి అనే విద్యార్థిని అదృశ్యమైనట్లు మూడవ టౌన్‌ ఎస్‌ఐ కృష్ణ తెలిపారు. విద్యార్థిని తండ్రి మంగలి నరేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. నవీపేట మండలం ఫక్రాబాద్‌కు చెందిన నరేశ్‌ కుటుంబ పోషణకై నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో మంగలి వృత్తి చేస్తు జీవనం కొనసాగిస్తున్నాడని, అదేక్రమంలో తమ పిల్లల్ని దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారని, అయితే ...

Read More »

బోధన్‌ ఎన్నికలకు భారీ బందోబస్తు

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ రెవెన్యూ డివిజన్‌లో ఈనెల 25న జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలందరు ప్రశాంతంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని కమీషనర్‌ హెచ్చరించారు. గొడవలు సృష్టించే వ్యక్తులపై నిఘా ఉంచామని, ప్రజలు పోలీసుశాఖపట్ల ఎంతో స్నేహభావంతో, నమ్మకంతో ఉంటారని, ఎవరికైనా శాంతిభద్రతల సమస్య ఏర్పడితే స్థానిక పోలీసులకు, డయల్‌ 100కు ...

Read More »

బోధన్‌ ఎన్నికలకు భారీ బందోబస్తు

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ రెవెన్యూ డివిజన్‌లో ఈనెల 25న జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలందరు ప్రశాంతంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని కమీషనర్‌ హెచ్చరించారు. గొడవలు సృష్టించే వ్యక్తులపై నిఘా ఉంచామని, ప్రజలు పోలీసుశాఖపట్ల ఎంతో స్నేహభావంతో, నమ్మకంతో ఉంటారని, ఎవరికైనా శాంతిభద్రతల సమస్య ఏర్పడితే స్థానిక పోలీసులకు, డయల్‌ 100కు ...

Read More »

సాధారణ పరిశీలకులను కలిసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీ ఎన్నికలకు సాధారణ పరిశీలకులుగా నియమితులైన ఎం.వీరబ్రహ్మయ్యను జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు గురువారం కలిశారు. సాధారణ పరిశీలకులు జిల్లా పర్యటనలో భాగంగా స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో బసచేశారు. కలెక్టర్‌ ఆయనకు పుష్పగుచ్చం అందజేసి అనంతరం జిల్లాలో మూడు విడతల ఎన్నికల నిర్వహణ, ఆర్మూర్‌ డివిజన్‌లో 21వ తేదీన ప్రశాంత ఎన్నికల నిర్వహణకు తీసుకున్న చర్యలను వివరించారు. ఈనెల 25న బోదన్‌ డివిజన్‌లో, 30న నిజామాబాద్‌ డివిజన్‌లో జరిగే ఎన్నికలపై తీసుకుంటున్న ...

Read More »

ఆడపిల్లలు సానుకూల దృక్పథం అలవరుచుకోవాలి

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయని, మార్పులకు తోడు మహిళలపై అనేక అత్యాచారాలు, వివక్షలు లాంటివి ఎక్కువయ్యాయని వీటిని ఎదుర్కొవడానికి ఆడపిల్లలు సానుకూల దృక్పథాన్ని ఏర్పరుచుకొని ఉండాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆయన ఆకాంక్షించారు. గురువారం స్థానిక రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ, ఐఎంఎ ఆద్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. సమాజంలో ...

Read More »

శుక్రవారం 2కె రన్‌

కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 9వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓటరు నమోదు కార్యక్రమం అవగాహనలో భాగంగా శుక్రవారం కామారెడ్డిలో 2 కె రన్‌ నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు స్థానిక మునిసిపల్‌ కార్యాలయం నుంచి రన్‌ ప్రారంభం అవుతుందని చెప్పారు. కార్యక్రమంలో అధికారులు, యువత, స్వచ్చంద సంస్థలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 11 గంటలకు ఓటరు దినోత్సవం విశిష్టతపై ...

Read More »

దూరవిద్యా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్‌ దూరవిద్యాకోర్సుల్లో ప్రత్యేక అర్హత పరీక్ష 2019 కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కర్షక్‌ బిఇడి కళాశాల ప్రిన్సిపాల్‌ రషీద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 30 జనవరి 2019 నాటికి 18 సంవత్సరాలు నిండినవారు దూరవిద్య నిర్వహించే ప్రత్యేక అర్హత పరీక్షకు అర్హులని చెప్పారు. ఇంటర్మీడియట్‌ పాసైన వారు నేరుగా ప్రవేశం పొందవచ్చని పేర్కొన్నారు. ఫిబ్రవరి 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని వివరాలకు కర్షక్‌ బిఇడి కళాశాలలో సంప్రదించాలని చెప్పారు.

Read More »

ఇంటర్మీడియట్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. గురువారం కామారెడ్డి జనహిత భవనంలో ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణపై జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్‌, అన్‌ ఎయిడెడ్‌ కెజిబివి, జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ ఒక్క విద్యార్థి పరీక్షకు గైర్హాజరు కాకుండా చూడాలని చెప్పారు. పరీక్షలకు సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని సాఫీగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్‌ బోర్డు జిల్లా ...

Read More »

ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుండాలి

కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆడపిల్లలు అన్నిరంగాల్లో ముందుండాలని పోటీ తత్వాన్ని అలవరుచుకోవాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖాధికారిణి రాధమ్మ అన్నారు. నేషనల్‌ గర్ల్‌ చైల్డ్‌ డే ఉత్సవాల్లో భాగంగా వారంరోజుల పాటు నిర్వహించిన వారోత్సవాలు గురువారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆమె మాట్లాడారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని జీవితంలో రాణించాలని సూచించారు. చదువుపై ప్రత్యేక శ్రద్ద వహించాలని, తల్లిదండ్రులు సైతం ఆడపిల్లల వెన్నుతట్టి వారిని ప్రోత్సహించాలని చెప్పారు. వివిధ పోటీల్లో ...

Read More »

ప్రతి ఒక్కరు ఓటుహక్కు వినియోగించుకోవాలి

కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు తప్పకుండా వినియోగించుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం ఆయన నాగిరెడ్డిపేట మండల అభివృద్ది కార్యాలయంలో డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండోవిడతలో ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట్‌, పిట్లం, నిజాంసాగర్‌, గాంధారి 6 మండలాల్లోని 192 గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు గాను 140 సర్పంచ్‌లకు ఎన్నికలు జరగనున్నట్టు ...

Read More »