Breaking News
Advocates NZB

మానసిక ఉల్లాసానికి క్రీడలు

నిజామాబాద్‌, జనవరి 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయవాదులు క్రీడాపోటీలను గురువారం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు సెషన్స్‌ జడ్జి గౌతం ప్రసాద్‌ హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది తమ రోజువారి విధులు, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు స్నేహపూర్వక పోటీల్లో పాల్గొనడం ద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు.

అనంతరం అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీహరిఆచార్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం న్యాయవాదులకు క్రీడలు నిర్వహించడం జరుగుతుందని, ఉత్సాహంగా న్యాయవాదులు పాల్గొంటున్నట్టు పేర్కొన్నారు.

కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రదాన కార్యదర్శి జగన్‌మోహన్‌గౌడ్‌, బార్‌ కౌన్సిల్‌ సభ్యులు రాజేందర్‌రెడ్డి, క్రీడల కార్యదర్శి ఆర్‌.సురేశ్‌, ఉదయ్‌కృష్ణ, ఎర్రం విఘ్నేశ్‌, గంగారత్నం, కేశవ్‌, రాజు, వసంత్‌, మోబిన్‌, మేజిస్ట్రేట్‌ రామలింగం, న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

నా కష్టార్జితం ఇప్పించండి

నిజామాబాద్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యుఏఇ రాజధాని అబుదాబి లోని తన యాజమాన్య కంపెనీ ...

Comment on the article