Breaking News

Daily Archives: January 25, 2019

ఫిబ్రవరి 2న కామారెడ్డిలో జాబ్‌మేళా

కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుద్యోగ యువతీ యువకులకు ప్రయివేటు రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఫిబ్రవరి 2వ తేదీన కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎస్‌.షబ్న ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల ప్రముఖ కంపెనీలు జాబ్‌మేళ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. 10వ తరగతి, ఇంటర్‌, ఐటిఐ, డిప్లమా, బిటెక్‌, పిజి ఫార్మసి చేసిన నిరుద్యోగులకు నెలకు రూ. 10 వేల నుంచి 25 వేల వరకు వేతనాలు ఉంటాయని చెప్పారు. ...

Read More »

ప్రశాంతంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు

కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని ఆరు గ్రామ పంచాయతీలకు శుక్రవారం నిర్వహించిన రెండోవిడత పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. గాంధారి మండల కేంద్రంలోని పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియను జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ స్వయంగా పరిశీలించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించారు. నిజాంసాగర్‌లో 92.51 శాతం, పిట్లం 88.40 శాతం, గాంధారి 84.90 శాతం, లింగంపేట్‌ 89.88 శాతం, నాగిరెడ్డిపేట్‌ 93.41 శాతం, ఎల్లారెడ్డి 93.66 ...

Read More »

వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ఎన్నికల పరిశీలన

కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలోని వెబ్‌కాస్టింగ్‌ కేంద్రం ద్వారా జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఎన్నికల తీరును పరిశీలించారు. ఆయనతోపాటు అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకటేశ్‌ గోత్రె, జిల్లా పంచాయతీ అదికారి ఇన్‌చార్జి సాయన్న, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకొని అందరు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. కామారెడ్డి ప్రబుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించారు. దీనికి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధ్యక్షత వహించగా ప్రముఖ కవి, రచయిత డాక్టర్‌ నటేశ్వర శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అందరిచేత ఓటరు ప్రతిజ్ఞ చేయించిన అనంతరం స్క్రీన్‌ ...

Read More »

ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 15 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ కోరారు. జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా స్థానిక మునిసిపల్‌ కార్యాలయం నుంచి శుక్రవారం 2కె రన్‌ ను కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనవరి 1, 2019 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కుకు అర్హులని, ఫిబ్రవరి 4వ తేదీ వరకు ఓటరు ...

Read More »

ఓటర్‌ నమోదు కు ఫిబ్రవరి 4 వరకు అవకాశం

నందిపేట్‌, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసెంబ్లీ ఎన్నికల తరువాత ఓటర్ల జాబితాలో తప్పులను సవరించి సరి చేయడానికి ఎన్నికల కమిషన్‌ మరోమారు చర్యలకు ఉపక్రమించింది. తప్పు లేని ఓటర్ల జాబితా తయారు చేసి పార్లమెంట్‌ ఎన్నికల నాటికి సిద్ధం చేసి ఉంచాలని ఉద్దేశంతో నోటిఫికేషన్‌ను ఇటీవల జారీ చేశారు. పాత ఓటర్ల జాబితాలో మార్పులతో పాటు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించిన ఎన్నికల కమిషన్‌ ఫిబ్రవరి 4వ తేదీ వరకు గడువు పొడిగించింది. నమోదుకు జిల్లా వ్యాప్తంగా ...

Read More »

జాతీయ ఓటరు దినోత్సవం

నందిపేట్‌, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ మండల కేంద్రంలో తహసీల్దార్‌ ఎలావెలు ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం ఏర్పాటుచేశారు. విద్యార్థులతో, ప్రజలతో, యువకులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ వినోద రెవెన్యూ సిబ్బంది విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Read More »

ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

నిజామాబాద్‌, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం వంటిదని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. శుక్రవారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా కలెక్టరేట్‌ మైదానంలో జెండా ఊపి కలెక్టర్‌ ర్యాలీని ప్రారంభించారు. జిల్లా యంత్రాంగం, మునిసిపాలిటి, మెప్మా, రెవెన్యూ సంఘం, ఎన్‌సిసి తదితర సంస్థల ఆద్వర్యంలో ఈ ర్యాలీ రాజీవ్‌గాంధీ ఆడిటోరియం వరకు వెళ్ళింది. తిలక్‌ గార్డెన్‌ చౌరస్తా వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం రాజీవ్‌గాంధీ ...

Read More »

ప్రశాంతంగా రెండవ విడత పోలింగ్‌

ిజామాబాద్‌, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండవ విడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ శుక్రవారం బోధన్‌ డివిజన్‌లోని పోలింగ్‌ కేంద్రాలలో పర్యటించి పోలింగ్‌ సరళిని పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు సేకరించడంతోపాటు అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీచేశారు. ముందుగా ఎడపల్లి మండలం నెహ్రూనగర్‌కు వెళ్లారు. అక్కడే ఉన్న పోలీసు కమీషనర్‌ కార్తికేయతో మాట్లాడారు. అనంతరం ఎడపల్లి మండలం జానకంపేట్‌, బోదన్‌ మండలం ఎరాజ్‌పల్లి గ్రామాల్లో పర్యటించి ...

Read More »