Breaking News

ప్రశాంతంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు

కామారెడ్డి, జనవరి 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని ఆరు గ్రామ పంచాయతీలకు శుక్రవారం నిర్వహించిన రెండోవిడత పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. గాంధారి మండల కేంద్రంలోని పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియను జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ స్వయంగా పరిశీలించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించారు.

నిజాంసాగర్‌లో 92.51 శాతం, పిట్లం 88.40 శాతం, గాంధారి 84.90 శాతం, లింగంపేట్‌ 89.88 శాతం, నాగిరెడ్డిపేట్‌ 93.41 శాతం, ఎల్లారెడ్డి 93.66 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 90.04 శాతం ఓటింగ్‌ నమోదైనట్టు జిల్లా అధికారులు తెలిపారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article