Breaking News

Daily Archives: January 27, 2019

వార్డుసమస్యల పరిష్కారానికి మారు పేరు మాన్పుర్‌ భూమేష్‌.

నందిపేట్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని 3వ వార్డు సభ్యుడు మాన్పుర్‌ భూమేష్‌ వార్డు సమస్యల పరిష్కారానికి మారు పేరుగా మారుతున్నాడు. గత వారం రోజుల క్రితం జరిగిన పంచాయతి ఎన్నికలలో గెలిచిన వెంటనే స్వంత ఖర్చుతో వార్డు అభివద్ధికి క షి చేస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం ప్రకారం గెలిచిన ఉదయం నుండే మురికి కాలువల శుభ్రం చేయడమే కాకుండా అవసరమున్న చోట పైపులు తీసుకొచ్చి కాలోనిలో మురికి నీరు ఆగకుండ చేస్తున్నాడు. ...

Read More »

ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు అందజేత

నిజామాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధానమంత్రి ఉజ్వల పథకం ద్వారా ఆదివారం నగరంలోని పాముల బస్తీలో బిజెపి నగర అధ్యక్షుడు, కార్యదర్శులు యెండల సుధాకర్‌, స్వామి యాదవ్‌ ఆద్వర్యంలో ఉచిత కనెక్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా యెండల సుధాకర్‌ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 5 కోట్ల ప్రజలకు ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు అందజేయాలని దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్రమోడి ఉజ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు అందజేస్తున్నారని, అందులో భాగంగా నగరంలోని 49వ డివిజన్‌లోగల పాముల బస్తీలోని ...

Read More »

అటవీశాఖ, పోలీసుశాఖలు సమన్వయంతో పనిచేయాలి

నిజామాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అటవీశాఖ, పోలీసుశాఖాధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు సూచించారు. ఆదివారం తన చాంబరులో అటవీశాఖ డిఎఫ్‌వో ప్రసాద్‌, నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అటవీప్రాంతాల్లో చెట్లను పెద్దసంఖ్యలో పెంచడానికి ఆకుపచ్చ నిజామాబాద్‌ జిల్లాగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. అక్రమ కలప రవాణా కాకుండా, చెట్లను నరకకుండా పోలీసుల సహకారంతో పెట్రోలింగ్‌ చేపట్టాలన్నారు. సామిల్‌లు ఉన్న ప్రాంతాల్లో సరైన నిఘా, ...

Read More »

డయల్‌ యువర్‌ సిపిని సద్వినియోగం చేసుకోండి

నిజామాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ నిర్వహించే డయల్‌ యువర్‌ సిపి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమీషనర్‌ కార్తికేయ జిల్లా ప్రజలకు సూచించారు. నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్‌లకు చెందిన ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను 08462-228433 నెంబరుకు ఫోన్‌ చేసి సమస్యలు వివరించాలని కమీషనర్‌ తెలిపారు. ఫోన్‌ చేసే సమయంలో ఎలాంటి శబ్దం రాకుండా సమయ పాలన పాటిస్తు ఇతరులకు అవకాశం కల్పించాలని కమీషనర్‌ సూచించారు. సమస్యల పరిష్కారానికై ఆయా పోలీసు స్టేషన్లకు ...

Read More »