Breaking News

అటవీశాఖ, పోలీసుశాఖలు సమన్వయంతో పనిచేయాలి

నిజామాబాద్‌, జనవరి 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అటవీశాఖ, పోలీసుశాఖాధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు సూచించారు. ఆదివారం తన చాంబరులో అటవీశాఖ డిఎఫ్‌వో ప్రసాద్‌, నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అటవీప్రాంతాల్లో చెట్లను పెద్దసంఖ్యలో పెంచడానికి ఆకుపచ్చ నిజామాబాద్‌ జిల్లాగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు.

అక్రమ కలప రవాణా కాకుండా, చెట్లను నరకకుండా పోలీసుల సహకారంతో పెట్రోలింగ్‌ చేపట్టాలన్నారు. సామిల్‌లు ఉన్న ప్రాంతాల్లో సరైన నిఘా, అక్రమ కలప వ్యాపారం జరగకుండా సిసి టివిలను మరిన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఇరు శాఖల అధికారులను ఆదేశించారు. రెండు శాఖల అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షణతో కలప అక్రమాలకు వీలు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

అదేవిధంగా సాలూర, యంచ, పతేపూర్‌ క్రాస్‌రోడ్డు వద్ద అటవీచెక్‌పోస్టులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. వన్యప్రాణులను రక్షించడానికి వేటగాళ్ళ కదలికలను గమనించడానికి అవసరమైన చర్యలు కూడా తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. సమావేశంలో నిజామాబాద్‌ ఏసిపి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article