Breaking News

Daily Archives: January 28, 2019

కలప అక్రమ రవాణాపై ఉక్కుపాదం

నిజామాబాద్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెట్లను నరకడం, కలప అక్రమ రవాణా చేయడంపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి జిల్లా స్థాయి అదికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా డిజిపి మహేందర్‌రెడ్డి, పిసిసిఎఫ్‌ పి.కె.ఝాతో కలిసి అడవుల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లు, అటవీ అధికారులు, పోలీసు అదికారులతో మాట్లాడారు. చెట్ల నరికివేత, అక్రమంగా కలప రవాణా అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కఠినంగా వ్యవహరించవలసిందిగా ఆదేశించారని, ...

Read More »

డయల్‌ యువర్‌ సిపిలో 6 ఫిర్యాదులు

నిజామాబాద్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఆధ్వర్యంలో సోమవారం డయల్‌ యువర్‌ సిపి కార్యక్రమం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు కొనసాగింది. ఈ సందర్బంగా నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోదన్‌ డివిజన్‌ల పరిధిలోని ప్రజలు ఆయా రకాల సమస్యలపై 6 ఫిర్యాదులు రావడం జరిగిందన్నారు. ఫిర్యాదుల పట్ల సిపి సానుకూలంగా స్పందిస్తు వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్స్‌పెక్టర్‌ వెంకటేశ్వర్లు హాజరయ్యారు.

Read More »