Breaking News

Daily Archives: January 29, 2019

ఎంసిపిఐయు రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలి

కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంసిపిఐయు రాష్ట్ర మహాసభలను భవన నిర్మాణ రంగ కార్మికులు జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సిహెచ్‌.తిరుపతి కోరారు. మంగళవారం కామారెడ్డిలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 31న కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని తెలిపారు. ఫిబ్రవరి 2వ తేదీ వరకు సభలు జరుగుతాయన్నారు. కార్మికుల పక్షాన పోరాటం చేస్తున్న తమకు మద్దతుగా నిలవాలని, కార్మికులందరు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. దీనికి పార్టీ అఖిలభారత నాయకులు, రాష్ట్ర ...

Read More »

అంగన్‌వాడి కేంద్రాలకు రేషన్‌ ద్వారా బియ్యం సరఫరా ఆపాలి

కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగన్‌వాడి కేంద్రాలకు రేషన్‌ దుకాణాల ద్వారా బియ్యం సరఫరాను ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి బాబాయి డిమాండ్‌ చేశారు. మంగళవారం కామారెడ్డిలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రేషన్‌ షాపుల ద్వారా అంగన్‌వాడి కేంద్రాలకు తెచ్చే రవాణా చార్జి భారమవుతోందని, ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అక్టోబరులో అంగన్‌వాడి టీచర్లకు 1500, మినీ అంగన్‌వాడి టీచర్లకు 1250, ఆయాలకు 750 వేతనాలు పెంచారని, వీటిని వెంటనే పెంచి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ...

Read More »

ఓటరు హెల్ప్‌లైన్‌ కేంద్రం తనిఖీ

కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత భవనంలోని ఓటరు హెల్ప్‌లైన్‌, జిల్లా కాంటాక్టు కేంద్రాన్ని మంగళవారం జిల్లాకలెక్టర్‌ సత్యనారాయణ తనిఖీ చేశారు. హెల్ప్‌లైన్‌ కాల్‌ రికార్డు విని సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటుకు సంబంధించిన వివరాలు, ఎన్నికలకు సంబంధించిన సమాచారం, ఫిర్యాదులు, సలహాల కోసం 084681950 నెంబరులో సంప్రదించాలని తెలిపారు. ఆయన వెంట ఎన్నికల సిబ్బంది సూపరింటెండెంట్‌ సాయి భుజంగరావు, నిఖిల్‌, హరీష తదితరులు పాల్గొన్నారు.

Read More »

పకడ్బందీగా మూడవ విడత ఎన్నికల నిర్వహణ

కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో జరగనున్న మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించనున్నట్టు కామరెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. బుధవారం జరగనున్న మూడవ విడత పోలింగ్‌ సందర్బంగా బాన్సువాడ, బీర్కూర్‌ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్‌, రిసిప్షన్‌ కేంద్రాలను మంగళవారం జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకుడు దినకర్‌బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. పరిశీలకుల వెంట ఉన్న జిల్లా కలెక్టర్‌ ఎన్నికల ఏర్పాట్ల గురించి వివరించారు. 131 ...

Read More »

30న ‘ఆస్క్‌ ఎంపీ కవిత’

నిజామాబాద్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందూరు మరో అరుదైన కార్యక్రమానికి వేదిక కానుంది. ప్రపంచంతో నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ వేదిక ద్వారా మాట్లాడనున్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న రచ్చబండ ద్వారా ట్విట్టర్‌లో తన అభిప్రాయాలు పంచుకోవడంతోపాటు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రపంచంలో ఎక్కడినుంచైనా, ఎవరైనా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నారు. అదే సమయంలో ముఖాముఖి ద్వారా ప్రజలతో తన మనోగతాన్ని పంచుకోనున్నారు. వారు అడిగిన సందేహాలకు సమాధానాలు ఇవ్వనున్నారు. ట్విట్టర్‌ సంస్థ ప్రత్యేకంగా ...

Read More »