Breaking News

Daily Archives: January 30, 2019

పెద్దమ్మ ఆలయంలో చోరీ

రెంజల్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు అమ్మవారి పుస్తెలతాడు, నగదుతోపాటు మైక్‌సెట్‌ దొంగిలించినట్టు ఎస్‌ఐ రుక్మావార్‌ తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం… మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయంలో రోజువారిగా అమ్మవారికి పూజలు నిర్వహించేందుకు ఉదయం ఆలయ స్వీపర్‌ మహేందర్‌ వెళ్లగా ఆలయ గేటు పగులగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారన్నారు. సంఘటన స్థలానికి చేరుకొని ఆలయాన్ని పరిశీలించారు. ఛైర్మన్‌ అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ పేర్కొన్నారు.

Read More »

ఎంపి కవితను కలిసిన సర్పంచ్‌లు

రెంజల్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో నూతనంగా గెలుపొందిన నీలా సర్పంచ్‌ లలిత, సాటాపూర్‌ సర్పంచ్‌ ఏకార్‌పాషాలు బుధవారం ఎంపి కవితను నిజామాబాద్‌లోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. తమ గ్రామానికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించి గ్రామ అభివృద్దికి తోడ్పడాలని ఎంపిని కోరినట్టు వారు తెలిపారు. వారి వెంట తెరాస మండల ప్రధాన కార్యదర్శి రాఘవేందర్‌, జాగృతి మండల అధ్యక్షుడు నీరడి రమేశ్‌, రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షుడు దత్తు పటేల్‌ ఉన్నారు.

Read More »

బాపూజీకి ఘన నివాళి

రెంజల్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని వివిధ గ్రామాల్లో బుధవారం మహాత్మా గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. వివిద గ్రామాల్లో గాంధీ విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు. మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ అసదుల్లా ఖాన్‌, సిబ్బందిని మహాత్ముని చిత్రపటానికి నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం తహసీల్దార్‌ మాట్లాడుతూ మహాత్ముని బాటలో ప్రతి ఒక్కరు నడవాలని, ప్రపంచానికి శాంతి సందేశాన్నిచ్చిన మహాత్ముడు గాంధీజి అని ఆయనని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.

Read More »

జిల్లాలో 87 శాతం పోలింగ్‌

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా బుధవారం జరిగిన మూడవ విడత పోలింగ్‌లో 87 శాతం నమోదైనట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన బిచ్కుంద, మేనూరు, మద్నూరు, జుక్కల్‌ పోలింగ్‌ స్టేషన్లను సందర్శించి కౌంటింగ్‌ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని 526 గ్రామ పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ పూర్తయిందని, కొత్త పాలకవర్గం ఫిబ్రవరి 2వ తేదీన ఏర్పాటు కానున్నట్టు ప్రభుత్వం గెజిట్‌ ద్వారా ప్రకటించిందని తెలిపారు. ఆరోజున కొత్తగా ...

Read More »

వినియోగదారులకు నాణ్యమైన వస్తువులు విక్రయించాలి

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను విక్రయించాలని కౌన్సిలర్‌ కుంబాల రవియాదవ్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని స్టేషన్‌ రోడ్డులో గృహ అవసరాల దుకాణం ఐఎఫ్‌బి పాయింట్‌ను ఆయన ప్రారంబించారు. ఏసి, వాషింగ్‌మెషిన్‌, మైక్రో వోవెన్స్‌ లాంటి గృహ అవసరాలతోపాటు ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు దుకాణంలో అందుబాటులో ఉంటాయని డీలర్‌ నీలా సంతోష్‌ తెలిపారు. కార్యక్రమంలో అనిల్‌, విఠల్‌ తదితరులున్నారు.

Read More »

వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ఎన్నికల పరిశీలన

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం జరిగిన ఎన్నికలను జిల్లా కార్యాలయంలోని కంట్రోల్‌ సెంటర్‌లో వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలించారు. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు దినకర్‌బాబు, జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకటేశ్‌ గోత్రెలు ఎన్నికల తీరును పరిశీలించారు. మూడవ విడతలో బుధవారం ఏడు మండలాల్లోని 131 గ్రామ సర్పంచ్‌లు, 946 వార్డులకు పోలింగ్‌ జరిగినట్టు వివరించారు.

Read More »

హరితహారాన్ని దిగ్విజయం చేయాలి

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అందరు భాగస్వామ్యం కావాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు, రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటి ఎండి దినకర్‌బాబు అన్నారు. బుధవారం ఉదయం ఆయన ఇందిరాగాంధీ స్టేడియాన్ని పరిశీలించారు. అనంతరం రాశివనంలో కలెక్టర్‌ కార్యాలయం సమీపంలో జిల్లా ఆడిట్‌ కార్యాలయం ఆద్వర్యంలో నిర్వహిస్తున్న మొక్కల పెంపకం క్షేత్రంలో మొక్కలు నాటారు. హరిత ఉద్యమంలో అందరు భాగస్వాములై రాష్ట్రాన్ని పచ్చల తోరణంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ...

Read More »

కాలాన్ని, వనరులను సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు కాలాన్ని, వనరులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు, రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటి మేనేజింగ్‌ డైరెక్టర్‌ దినకర్‌బాబు అన్నారు. మహాత్మాగాంధీ వర్ధంతి, జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా స్పర్శ్‌ కుష్టు నిర్మూలన దినం, పక్షోత్సవం పురస్కరించుకొని బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన మనదేశంలో ఎన్నో పరిశోధనలు జరగాల్సిన అవసరముందన్నారు. విద్యార్థి దశ నుంచే ప్రయోగాలు ...

Read More »

మురికి కాలువల నిర్మాణ పనులు ప్రారంభం

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్‌బి నగర్‌లో బుధవారం మురికి కాలువల నిర్మాణ పనులను మునిసిపల్‌ ఛైర్మన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. మునిసిపల్‌ సాధారణ నిదులు రెండు లక్షలు, నాలుగవ ఆర్థిక సంఘం నిదులు రెండు లక్షల నిధులతో కాలువ పనులు చేపట్టినట్టు తెలిపారు. అన్ని వార్డుల్లో అవసరాల దృష్ట్యా అభివృద్ది పనులు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ రేణుక, ఏ.ఇ. రవి, నాయకులు చంద్రశేఖర్‌, లక్ష్మణ్‌, రాజేందర్‌, శ్రీనివాస్‌, వెంకటి తదితరులు ...

Read More »

మహాసభ ఏర్పాట్లలో ఎంసిపిఐయు శ్రేణులు

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 31న జరగనున్న ఎంసిపిఐయు రెండవ మహాసభలకు సంబంధించి ఏర్పాట్లలో పార్టీ శ్రేణులు నిమగ్నమయ్యారు. పట్టణంలో ఎర్రజెండాలను ఆయా కూడళ్ల వద్ద ఏర్పాటు చేస్తున్నారు. మద్దికాయల ఓంకార్‌ స్థాపించిన జాతీయ పార్టీ మహాసభలు మూడురోజుల పాటు కామారెడ్డిలో నిర్వహిస్తామన్నారు. 31న మధ్యాహ్నం స్థానిక గాంధీ గంజ్‌ నుంచి ర్యాలీగా కొత్త బస్టాండ్‌ వరకు నిర్వహించి అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దీనికి అఖిలభారతీయ కార్యదర్శి ఎం.డి.గౌస్‌తోపాటు ...

Read More »

రానున్న ఎన్నికల్లో ఫెడరల్‌ ఫ్రంట్‌దే హవా

నిజామాబాద్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న ఎన్నికల్లో ఫెడరల్‌ ఫ్రంట్‌దే హవా అని నిజామాబాద్‌ ఎంపి కవిత కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తిలక్‌గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ఆస్క్‌ టు మి కార్యక్రమంలో ఎంపి మాట్లాడారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు రాజకీయ మనుగడ సాగిస్తాయని ఆమె అన్నారు. ఎంపి నిధులను ఏడాదికి 25 కోట్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మోడి ప్రభుత్వానికి పార్లమెంటులో పూర్తి మెజార్టీ ఉన్నప్పటికి మహిళలకు 33 ...

Read More »

ఫిబ్రవరి 4న మల్లెపూల నరేంద్ర స్మారక పోటీలు

నిజామాబాద్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వర్గీయ జర్నలిస్టు మల్లెపూల నరేంద్ర 28వ స్మారక క్రీడా పోటీలను ఫిబ్రవరి 4వ తేదీన నిర్వహిస్తున్నట్టు కమిటీ ఛైర్మన్‌ సాయిలు తెలిపారు. ఈ మేరకు నిజామాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం క్రీడల నిర్వహణ కమిటీ సమావేశం జరిగింది. ఫిబ్రవరి 4న ఉదయం 9 గంటలకు కలెక్టరేట్‌ మైదానంలో పాఠశాల విద్యార్థుల ఖోఖో పోటీలతో స్మారక క్రీడలు నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ప్రారంభిస్తారని తెలిపారు. అదేరోజు జర్నలిస్టులకు కబడ్డి పోటీలు సాయంత్రం జరుగుతాయని అన్నారు. ...

Read More »

వైద్యునిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు

నిజామాబాద్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్‌ శ్రీనివాస్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు 1వ టౌన్‌ ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని ప్రయివేటు ఆసుపత్రిలో బాన్సువాడ మండలం సంగెం గ్రామానికి చెందిన జ్యోతి మృతిచెందింది. ఈ అంశంపై మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టగా మీడియా ప్రతినిదులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో నగరానికి చెందిన పలువురు వైద్యులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సమయంలో మీడియా ప్రతినిధిపై ...

Read More »

భద్రత ఏర్పాట్లు పరిశీలించిన సిపి కార్తికేయ

నిజామాబాద్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీ తుదిదశ ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన బందోబస్తు నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ పరిశీలించారు. ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బందోబస్తు పరిశీలించి పోలీసు అదికారులకు పలు సూచనలు చేశారు. నవీపేట మండలం అభంగపట్నం గ్రామంలో పోలింగ్‌బూత్‌ను, బందోబస్తును సిపి పరిశీలించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ నిజామాబాద్‌ జిల్లాలో తుది దశ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, ...

Read More »

తుది దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం

నిజామాబాద్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం జరిగిన తుదిదశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని ఆయన తెలిపారు. మొత్తంమీద తుదిదశ ఎన్నికల్లో 80 శాతం వరకు పోలింగ్‌ నమోదైనట్టు ఆయన తెలిపారు. బుధవారం ఉదయం పోలింగ్‌ ప్రారంభం కాగానే కలెక్టర్‌ కేంద్రాలను తనికీ చేశారు. వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేసిన 25 పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ పర్యవేక్షించారు. అనంతరం ధర్మారం జడ్పిహెచ్‌ఎస్‌లో ...

Read More »

ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపి కవిత

నిజామాబాద్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత బుధవారం తుదిదశ పోలింగ్‌లో భాగంగా తన స్వంత గ్రామమైన నవీపేట మండలం పోతంగల్‌ గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఎంపి కవిత మీడియాతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో 80 శాతం మంది తెరాస పార్టీ కోసం పనిచేసే అభ్యర్థులే గెలిచారని, తెలంగాణ గ్రామాల్లో ఆర్తిక వ్యవస్థను పరిపుష్టం చేసి, అభివృద్ది చేయాలనేదే ముఖ్యమంత్రి కెసిఆర్‌ కల అని ఆమె అన్నారు. కొత్తగా గెలిచిన వారు ...

Read More »