Breaking News
Municipal Parks Inspection

ప్రజలకు ఉపయోగపడేలా పార్కుల రూపకల్పన

కామారెడ్డి, జనవరి 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో నాలుగు పార్కులను ప్రజలకు ఉపయోగపడేలా రెండు కోట్ల రూపాయలతో తీర్చిదిద్దుతున్నట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. గురువారం స్థానిక హౌజింగ్‌ బోర్డులోని మునిసిపల్‌ పార్కు నిర్మాణ పనులను పరిశీలించారు.

పార్కులో కొన్ని మార్పులను సూచించారు. ఆయన మాట్లాడుతూ టియుఎస్‌ఐడిసి నిధులతో పట్టణంలోని హౌజింగ్‌బోర్డు, మునిసిపల్‌ పార్కు, లిమ్రా ఫంక్షన్‌ హాల్‌ వద్ద, రామారెడ్డి వద్ద నాలుగు పార్కులను ప్రజల అవసరాలకు అనుగుణంగా సుందరంగా తీర్చిదిద్దుతున్నట్టు పేర్కొన్నారు. ప్రజలు సైతం పార్కుల్లో తమకు ఎలాంటి వసతులు అవసరమో అధికారుల దృష్టికి తేవాలని చెప్పారు. చెట్లు, పచ్చనిగడ్డితో పార్కులను ముస్తాబు చేస్తామని చెప్పారు.

ఆయన వెంట మునిసిపల్‌ ఛైర్మన్‌ పిప్పిరి సుష్మ, కమీషనర్‌ రామాంజనేయులు రెడ్డి, వార్డు కౌన్సిలర్‌ రేణుక, పబ్లిక్‌ హెల్త్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ తిరుపతికుమార్‌, డిప్యూటి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ వశిష్ట, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి శైలజ, మునిసిపల్‌ ఇంజనీర్‌ వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article