Breaking News

Monthly Archives: February 2019

ఎలక్ట్రానిక్‌ బైకులకు పెరుగుతున్న ఆదరణ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎలక్ట్రానిక్‌ బైక్‌లకు యువతలో మంచి ఆదరణ లభిస్తోందని వెర్సటైల్‌ ఎండి మురళి ప్రసాద్‌ రెడ్డి అన్నారు. గురువారం డిచ్‌పల్లి మండల కేంద్రంలో వరసటైల్స్‌ ఎలక్ట్రానిక్‌ బైక్‌ షోరూంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలుష్యం పెరిగిపోతున్న ఈ రోజుల్లో కాలుష్యం రహిత ద్విచక్ర వాహనాలు కొత్తగా మార్కెట్లోకి వచ్చాయని, వాహనాలు పలువురుని ఆకట్టుకుంటున్నాయన్నారు. తెలంగాణ జిల్లాలోనే నిజామాబాద్‌ జిల్లాలో మొట్ట మొదటిసారిగా బైకులను వర్సటైల్‌ ఎలక్ట్రానిక్‌ కంపెనీ డిచ్‌పల్లి మండల కేంద్రంలో ...

Read More »

ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ సబ్‌ డివిజన్‌ రైతాంగం గత 20 రోజులకుపైగా తాము పండించిన ఎర్ర జొన్న క్వింటాలుకు రూ. 3500 ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, పసుపు క్వింటాలుకు రూ.15 వేలు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ దశలవారీ ఆందోళనలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో గత్యంతరం లేక రైతులు తమ గోడును ముఖ్యమంత్రికి తెలియజేయటానికి ఆర్మూర్‌ నుండి హైదరాబాద్‌కు పాదయాత్రగా వెళ్లాలని నిర్ణయించి బయలుదేరగా ప్రభుత్వం రైతులను అడుగడుగునా అడ్డగిస్తూ ...

Read More »

విద్యుత్‌ సౌకర్యం కల్పించాలి…

ఆర్మూర్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని యానంగుట్ట ప్రాంతంలో గత సంవత్సరం కాలానికి పైగా 350 కుటుంబాలు నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నప్పటికీ వారికి అక్కడ కనీస సౌకర్యాలు కల్పించటానికి అధికారులు, ప్రభుత్వం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో ఆర్మూర్‌ పట్టణం యానంగుట్ట వద్దఉన్న సుందరయ్యకాలనీ పేదలు గురువారం విద్యుత్‌ ఎస్‌ఈ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అధికారులను ఘేెరావ్‌ చేయటం జరిగింది. విద్యుత్‌ సౌకర్యం కల్పించి తమ ప్రాణాలు కాపాడాలని పెద్ద ఎత్తున ...

Read More »

దివ్యంగులకు ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం జిల్లాలో ఫిబ్రవరి 27 నుండి మార్చి 5 వరకు వారం రోజులపాటు అన్ని రకాల దివ్యాంగుల కొరకు ఓటరు నమోదు ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఆపై వయసు గలవారు, ఇప్పటివరకు ఓటరుగా నమోదు చేసుకొని వారు, ఓటర్‌ జాబితాలో పేరు లేని వారు, సదరన్‌ సర్టిఫికెట్‌ లేనివారు కూడా పోలింగ్‌ బూతు వద్ద ...

Read More »

సైనిక కుటుంబాలకు రిటైర్డ్‌ ఉద్యోగుల విరాళం

కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పుల్వామాలో భారత సైనికులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిలో అసువులు బాసిన సైనిక కుటుంబాలకు కామారెడ్డి జిల్లా ప్రబుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం బాసటగా నిలిచింది. గురువారం జాతీయ భద్రత నిధికి రూ.25 వేలు విరాళంగా ప్రకటించి వీటిని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణకు అందజేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు నిట్టు విఠల్‌రావు, ప్రధాన కార్యదర్శి విశ్వనాథం, కోశాధికారి గంగాగౌడ్‌, రాష్ట్ర కార్యదర్శి మల్లేశం, ప్రతినిధులు శ్యాంరావు, మురళి, గౌతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More »

కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మికుల కనీస వేతనాలు అమలు చేయాలని ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్‌ డిమాండ్‌ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కార్మికుల జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూసుఫ్‌ మాట్లాడారు. కాంట్రాక్టులు శానిటేషన్‌ ఉద్యోగులకు జీవో 68 ప్రకారం, కాంట్రాక్టు సెక్యురిటి సిబ్బందికి జీవో 43 ప్రకారం కనీస వేతనాలు, ఇఎస్‌ఐ, పిఎఫ్‌ లాంటివి వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు వారాంతపు సెలవులు ఇవ్వాలని, కనీస ...

Read More »

లేబర్‌ కార్యాలయం ఎదుట ధర్నా

కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పింఛన్‌ పథకంలో కార్మికులకు వయసు నిబంధన ఎత్తివేయాలని డిమాండ్‌చేస్తు గురువారం లేబర్‌ కార్యాలయం ఎదుట ఐక్య బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు గంగాధర్‌, ఏసిఐటియు జిల్లా కార్యదర్శి రాజలింగంలు మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రధాన మంత్రి శ్రమయోగి మన్‌ ధన్‌ పింఛన్‌ యోజన పేరుతో ప్రకటించిన పింఛన్‌ స్కీములో నిర్మాణ రంగ కార్మికులపై వయసు నిబందన 40 సంవత్సరాల వయసు కుదించడాన్ని ...

Read More »

గ్రామాల అభివృద్దితోనే దేశ ప్రగతి

కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాలు అభివృద్ది చెందితేనే దేశం ప్రగతి పథంలో పయనిస్తుందని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో నిర్వహిస్తున్న సర్పంచ్‌ల శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. గ్రామాలను సంపూర్ణంగా అభివృద్ది పథంలో తేవడానికి సర్పంచ్‌లు క్రమశిక్షణ, అంకితభావం, ప్రజాసమస్యలపై అవగాహనతో పనిచేయాలని సూచించారు. ప్రాధాన్యత క్రమంలో గ్రామాల్లో మార్పులు తేవాలని చెప్పారు. మొక్కల సంరక్షణ బాధ్యత చేపట్టాలని, పారిశుద్య నిర్వహణ సక్రమంగా చేయాలని పేర్కొన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి ...

Read More »

ఓటరు ఎలక్టోరల్‌ సిద్దం చేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న మునిసిపల్‌, ఎంపిటిసి, జడ్పిటిసి స్థానాలకు ఓటరు ఎలక్టోరల్‌ను సిద్దం చేసేందుకు మునిసిపల్‌ కమీషనర్‌లు, ఎంపిడివోలు చర్యలు తీసుకోవాలని కమీషనర్‌ నాగిరెడ్డి వీడియో కాన్ఫరెన్సు ద్వారా సూచించారు. గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు. రాబోయే మునిసిపల్‌, ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలకు వార్డుల వారిగా, గ్రామాల వారిగా ఎలక్టోరల్‌ సిద్దం చేయాలని, మార్చి 16న పబ్లికేషన్‌, 27న ఫైనల్‌ పబ్లికేషన్‌ చేపట్టాలని ఆదేశించారు. ఎలక్టోరల్‌ అనంతరం ప్రతి 600 మంది ఓటర్లకు ...

Read More »

కేంద్రం దృష్టికి పసుపు రైతుల ఆందోళన

నిజామాబాద్‌ ప్రతినిధి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌, నీతిఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌లకు వినతి సానుకూలంగా స్పందించిన నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ పసపు రైతులకు బీజేపీ పాలిత రాష్ట్రాలలాగానే బోనస్‌ ఇవ్వాలని ధర్మపురి అర్వింద్‌ డిమాండ్‌ నిజామాబాద్‌లో జరుగుతున్న పసుపురైతుల ఆందోళనలను కేంద్రం దష్టికి తీసుకెళ్లారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అర్వింద్‌. బీజేపీ నాయకులు వెంకట్‌, వినయ్‌రెడ్డి, బస్వలక్ష్మీనర్సయ్య, పార్లమెంట్‌ సెగ్మెంట్‌ ...

Read More »

ముగిసిన ఐకెపి ప్రతినిధుల శిక్షణ

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 26 నుండి గురువారం వరకు మూడురోజుల పాటు ఐ.కె.పి (గ్రామీణ పేదరిక నిర్మలన సంస్థ) నిజాంసాగర్‌లో గ్రామ సంఘాల ప్రతినిధులకు, గ్రామ సంఘాల సహాయకులకు సంస్థాగత నిర్మాణం, బ్యాంకు లింకేజీ ఋణాలపై అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో బాగంగా గురువారం రెండు క్లస్టర్‌ పరిధిలో (మగ్దూం పూర్‌ ,మొహ్మద్‌ నగర్‌ ) లోని గ్రామసంఘాల ప్రతినిదులకు సంస్థాగత నిర్మాణం, బ్యాంకు ఋణాల తీసుకోవటంపై సమావేశంలో ఆర్థిక అక్షరాస్యత (ప్రతి లావాదేవీలుపై ...

Read More »

వీడియో జర్నలిస్టులకు ఆహ్వానం

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ నిజామాబాద్‌న్యూస్‌.ఇన్‌ సంస్థలో పనిచేయటానికి ఉత్సాహవంతులైన వీడియో జర్నలిస్టులు కావలెను. ఇంటర్వ్యూలు, ప్రెస్‌మీట్‌లు, ఇతరత్రా కార్యక్రమాలు వీడియోలో చిత్రీకరించేందుకు చక్కటి వాక్చాతుర్యం, వాగ్దాటి కలిగిన జర్నలిస్టులు కావలెను. నిజామాబాద్‌ పట్టణం కేంద్రంగా ఉంటూ జిల్లాలో ఇతర ప్రాంతాలకు వెళ్లి వార్త సేకరణ చేయగలగాలి. ఆకర్షణీయ వేతనం ఇవ్వబడును. సొంతంగా వీడియో కెమెరా లేదా హెచ్‌డి ఫోన్‌ కలిగి ఉండవలెను. మరిన్ని వివరాలకు 91 8333088383 నెంబర్‌లో మీ ఇమెయిల్‌, ఫోన్‌ నెంబర్‌ మొదలైన వివరాలు వాట్సాఅప్‌ చేసి సంప్రదించగలరు.

Read More »

రైతుల బైండోవర్‌

ఆర్మూర్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని మిర్దపల్లి గ్రామానికి చెందిన దాదాపు 11మంది రైతులను తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేశారు. గత కొన్ని రోజుల క్రితం రైతు రాస్తారొఖోలో పాల్గొని శాంతి భద్రతలకు విఘాతం కలిగించినందుకుగాను, తిరిగి ఇటువంటి చర్యలకు పాల్పడకుండా వీరిని తహశీల్దార్‌ ఎదుట ఆర్మూర్‌ రెండవ అదనపు న్యాయమూర్తి బైండోవర్‌ చేసినట్లు రాణాప్రతాప్‌ సింగ్‌ తెలిపారు.

Read More »

కాంతి హైస్కూల్‌ లో నేషనల్‌ సైన్స్‌ డే

ఆర్మూర్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని కాంతి హైస్కూల్‌లో గురువారం సి.వి. రామన్‌ పుట్టినరోజు సందర్బంగా నేషనల్‌ సైన్స్‌ డే నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ సర్పంచ్‌ రోటరీ గవర్నర్‌ హన్మంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నేటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలని పేర్కొన్నారు. పర్యావరణం కాపాడటంలో విద్యార్థులు ముందుండాలని విజ్ఞప్తి చేశారు. చాలా తక్కువ ఖర్చుతో కూడిన, పర్యావరణ హితంగా ఉండే వస్తువులను ఉపయోగించి ప్రయోగాలు చేయడం జరిగిందని కాంతి స్కూల్‌ ప్రిన్సిపాల్‌ గంగారెడ్డి తెలిపారు. ...

Read More »

ఆర్మూర్‌ బంద్‌ సక్సెస్‌

ఆర్మూర్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలంలో గురువారం తలపెట్టిన ఆర్మూర్‌ బంద్‌కు స్వచ్ఛందంగా వ్యాపారస్తులు, దుకాణదారులు, ప్రవేటు పాఠశాలలు సంపూర్ణంగా బంద్‌కు సహకరించి తమ మద్దతు తెలిపారు. అయితే రైతులు గత కొంతకాలంగా తమకు పసుపు, ఎర్ర జొన్నల పంటలకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రైతులు చేపట్టిన చలో హైద్రాబాద్‌ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నంచేసి రైతులను అరెస్టు చేసినందుకు గురువారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్‌ ...

Read More »

ఎర్రజొన్న రైతులు ఆందోళన చెందవద్దు…

నిజామాబాద్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్లు, భవనాలు, రవాణా, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డికి ఆత్మీయ సన్మానం ఘనంగా జరిగింది. బుధవారం నిజామాబాద్‌లోని శ్రావ్యగార్డెన్‌లో జరిగిన కార్యక్రమానికి నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దుఃఖం దాచుకోవాలంటారు అలాగే సంతోషాన్ని పంచుకోవాలంటారు…కేసీఆర్‌కు జిల్లా ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. స్పీకర్‌, శాసన సభ వ్యవహారాలు మన జిల్లాకే వచ్చాయని, శాసన వ్యవస్థలను మనవాళ్ళే చూస్తుండటం మనకు గర్వ కారణం అన్నారు కవిత. ...

Read More »

గురుకుల పాఠశాల తనిఖీ

బీర్కూర్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండల కేంద్రంలోని బీసీ బాలుర గురుకుల పాఠశాలను తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి బుధవారం అకస్మీకంగా తనిఖీ చేశారు. కోటగిరి మండలంలోని గ్రామాలలో పలు కార్యక్రమాలలో పాల్గోని వస్తున్న స్పీకర్‌ బీర్కూర్‌ మండల కేంద్రంలోని బీసి బాలుర రెసిడెన్షియల్‌స్కూల్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, మెన ప్రకారం ఆహారం అందుతుందా అంటూ విద్యార్థులను వివరాలు అడిగారు. మెను ప్రకారమే అందుతున్నాయని విద్యార్థులు తెలపడంతో స్పీకర్‌ ...

Read More »

అమరవీరుల సంస్మరణ సభ కరపత్రాల ఆవిష్కరణ

కామరెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి గార్డెన్‌లో భజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించనున్న అమరవీరుల సంస్మరణ సభ కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా బిజెవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి, విహెచ్‌పి జిల్లా కార్యదర్శి రవి, పట్టణ అధ్యక్షుడు బాపురెడ్డి, భజరంగ్‌ దళ్‌ జిల్లా సంయోజక్‌ మహేశ్‌లు మాట్లాడారు. పుల్వామాలో ఉగ్రవాద దాడిలో చనిపోయిన వీరసైనికులను స్మరించుకుంటూ అమరవీరుల సంస్మరణ సభను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ యువతలో దేశభక్తిని ...

Read More »

ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ఆజాద్‌ వర్దంతి

కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం ఏఐఎస్‌ఎఫ్‌ ఆద్వర్యంలో చంద్రశేఖర్‌ ఆజాద్‌ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ ముదాం ప్రవీణ్‌ మాట్లాడుతూ 1906లో జన్మించిన ఆజాద్‌, భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ లాంటి దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ఒకరుగా నిలిచారని అన్నారు. చిన్న వయసులోనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని దేశం కోసం ప్రాణాలు అర్పించారని ప్రశంసించారు. అలాంటి వారు ఆదర్శప్రాయులని కొనియాడారు.

Read More »

జహీరాబాద్‌ ఎంపి అభ్యర్థిగా షబ్బీర్‌ అలీ

కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ పార్లమెంటు అభ్యర్థిగా షబ్బీర్‌ అలీ పేరును నిర్ణయిస్తు జిల్లా కాంగ్రెస్‌ కమిటీ తీర్మానం చేసింది. పార్టీ జిల్లా అద్యక్షుడు కైలాష్‌ శ్రీనివాస్‌రావు అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసినట్టు జిల్లా అధ్యక్షుడు తెలిపారు. జహీరాబాద్‌ పరిధిలోగల ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఈ మేరకు తీర్మానం చేసి అధిష్టానానికి పంపినట్టు తెలిపారు. షబ్బీర్‌ అలీతోపాటు మరో ఐదుగురు పేర్లను అదిష్టానానికి పంపినట్టు తెలిపారు. నిజామాబాద్‌ ఎంపిగా షబ్బీర్‌ ...

Read More »