Breaking News

Daily Archives: February 1, 2019

ఓటరు హెల్ప్‌లైన్‌ ద్వారా ప్రతి వ్యక్తి సేవలు పొందవచ్చు

కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు హెల్ప్‌లైన్‌ 1950 ద్వారా ప్రతి వ్యక్తి సేవలు పొందవచ్చని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం జనహిత భవనంలో ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాతో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. గడచిన అసెంబ్లీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా మరువలేని పాత్ర పోషించిందని, ప్రతి సమాచారాన్ని ప్రజలకు చేరవేసిందని మీడియాను అభినందించారు. ఓటరు హెల్ప్‌లైన్‌ ల్యాండ్‌లైన్‌ నెంబర్‌ 1950, ఫోన్‌నెంబరు 084681950 నెంబర్ల ద్వారా నాలుగురకాల సేవలు పొందొచ్చని పేర్కొన్నారు. వీటిని ...

Read More »

రేషన్‌ దుకాణాల ద్వారా అంగన్‌వాడిలకు బియ్యం సరఫరా

కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇకనుంచి చౌకదరల దుకాణాల ద్వారా అంగన్‌వాడి కేంద్రాలకు బియ్యం సరఫరా చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం స్థానిక పార్శిరాములు ఫంక్షన్‌ హాల్‌ వద్ద చౌకధరల దుకాణం నుంచి అంగన్‌వాడి కేంద్రాలకు బియ్యం సరఫరాను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిబ్రవరి 1 నుంచి కార్యక్రమం కొనసాగుతుందన్నారు. బియ్యంతోపాటు కందిపప్పు, నూనె, బాలామృతం, మురుకులు సైతం సిడిపివో గోదాముల నుంచి అంగన్‌వాడి కేంద్రాలకు సరఫరా చేస్తామని పేర్కొన్నారు. గుడ్లు, ...

Read More »

మున్నూరు కాపు నూతన సర్పంచ్‌లకు సన్మానం

కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో కొత్తగా ఎన్నుకోబడ్డ సర్పంచ్‌లను శుక్రవారం కామారెడ్డిలో మున్నూరు కాపు సంఘం ఆద్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ మున్నూరు కాపు మహాసభ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మామిండ్ల అంజయ్య, గౌరవ అధ్యక్షుడు ఆంజనేయులు, గడ్డి అన్నారం మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పురుషోత్తం రావు, కుల సంఘ ప్రతినిదులు పాల్గొన్నారు.

Read More »

మోడి ప్రభుత్వాన్ని అడ్డుకునేందుకు వామపక్షాల ఐక్యత పోరాటం

కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వదేశీ నినాదంతో అధికారాన్ని చేపట్టి విదేశీ సంస్థల అడుగులకు మడుగులొత్తుతున్న మోడి ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు వామపక్షాల ఐక్యతతో కూడిన ఖచ్చితమైన పోరాటాలు నిర్వహించి తీరాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంగా ఎంసిపిఐయు తెలంగాణ రాష్ట్ర రెండవ మహాసభలు శుక్రవారం రెండోరోజు కొనసాగాయి. ఈ సందర్భంగా సమావేశానికి అధ్యక్షత వహించిన పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి సంగతి సాంబయ్య, సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ జాతీయ నాయకుడు ...

Read More »

ఐస్‌క్రీంలు తిని విద్యార్థులకు అస్వస్థత

కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గంజ్‌ పాఠశాలకు చెందిన 6వ తరగతి విద్యార్థులు శుక్రవారం ఐస్‌క్రీం తిని అస్వస్థతకు గురయ్యారు. స్థానిక రాజీవ్‌పార్కుకు దగ్గర్లోని అయ్యప్ప ఆలయం వద్ద గల ఓ ఐస్‌క్రీం దుకాణంలో ఐస్‌క్రీం తిన్న ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురికాగా వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఐస్‌క్రీం షాంపుల్స్‌ సేకరించి అధికారులు వాటిపై విచారణ చేస్తున్నట్టు సమాచారం.

Read More »

ఈవిఎం యంత్రాల ఎఫ్‌ఎల్‌సి పూర్తి

కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాల ఫస్ట్‌లెవల్‌ చెకింగ్‌ (ఎఫ్‌ఎల్‌సి) కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్‌ గోదాములో జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ వివిద రాజకీయ పార్టీల సమక్షంలో నిర్వహించారు. ఎన్నికల సిబ్బంది ఫస్ట్‌ లెవల్‌ చెకింగ్‌ కార్యక్రమాన్ని రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో నిర్వహించి వాటిని స్ట్రాంగ్‌ రూంలో బద్రపరిచారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 786 పోలింగ్‌ స్టేషన్లకు సంబంధించి వీవీప్యాట్‌, ఈవిఎం యంత్రాల ఎఫ్‌ఎల్‌సి ...

Read More »

4న మండల సర్వసభ్య సమావేశం

రెంజల్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 4వ తేదీన రెంజల్‌ మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్టు ఎంపిడివో చంద్రశేఖర్‌ తెలిపారు. ఎంపిపి మోబిన్‌ఖాన్‌ అద్యక్షతన సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. సమావేశంలో మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు, నూతన సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు. సమావేశానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హాజరుకావాలని ఎంపిడివో సూచించారు.

Read More »

అంగన్‌వాడిలకు రేషన్‌ అందజేసిన ఎంపిపి

రెంజల్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అంగన్‌వాడిలకు రేషన్‌ బియ్యాన్ని అందించే నూతన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ విధానాన్ని శుక్రవారం ఎంపిపి మోబిన్‌ఖాన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడి కేంద్రాల్లో విద్యార్థులకు, పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు వారికి అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండేందుకు కార్యక్రమం ప్రారంభించినట్టు ఎంపిపి తెలిపారు. రేషన్‌ షాపులోనే బియ్యాన్ని తీసుకెళ్లి విద్యార్థులకు వంట చేసి అందించేలా ప్రభుత్వం చేపట్టడం హర్షణీయమన్నారు. నిరుపేద పిల్లలకు ...

Read More »

ఫిబ్రవరి 7న కలెక్టరేట్‌ ముందు ధర్నా

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 7వ తేదీన జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నట్టు సిఐటియు నాయకురాలు నూర్జహాన్‌ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని అందుకు నిరసనగా ధర్నా నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు. ధర్నాను జయప్రదం చేయాలని జిల్లాలోని ఆశ వర్కర్లు హాజరుకావాలని పిలుపునిచ్చారు. 7న రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపడుతున్నట్టు వివరించారు. అదేవిధంగా ఆశ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ...

Read More »

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని తిరుమల థియేటర్‌ సమీపంలో జనవరి 18న రాత్రి సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్టు ఎస్‌ఐ అశోక్‌రెడ్డి తెలిపారు. స్థానికులు గమనించి అతన్ని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని, చికిత్స పొందుతూ జనవరి 29న మృతి చెందినట్టు తెలిపారు. కేసు నమోదు చేశామని, మృతుని వివరాలు ఎవరికైనా తెలిస్తే 9440795417, 08462-234750 నెంబర్లకు సమాచారం అందించాలన్నారు.

Read More »

ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల దుకాణాల మూసివేత

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోగల మందుల దుకాణాన్ని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాములు ఆధేశాల మేరకు సిబ్బంది రెండు మెడికల్‌ దుకాణాలను మూసివేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గత కొన్ని సంవత్సరాలుగా రెండు జనరిక్‌ మందుల దుకాణాలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. టెండరు గడువు ముగిసినప్పటికి వారు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. 2016లో కోర్టు స్టే ఆడర్‌ ముగిసినా పలుమార్లు వారికి నోటీసులు అందించినా స్పందించకపోవడంతో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ జోక్యం చేసుకొని మందుల దుకాణాలను ...

Read More »

నగరంలో ‘పండుగ చేసుకో’ టీం సందడి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలో దుబ్బ ప్రాంతంలోగల మహేశ్వరి భవనంలో శుక్రవారం ఈటివి వారు నిర్వహించే పండగ చేస్కో కార్యక్రమం టీం సందడి చేసింది. కార్యక్రమానికి వర్ధమాన నటి హరితేజ ముఖ్య అతిథిగా హాజరై యాంకర్‌గా వ్యవహరించారు. వివిద పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి, విజేతలకు బహుమతులు అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన కెఎల్‌ఎం ఫ్యాషన్స్‌ స్పాన్సర్‌ చేశారు. నగరానికి చెందిన ఆర్యవైశ్య బ్లడ్‌గ్రూప్‌ వారు భవనం, వివిధ సదుపాయాలు కల్పించారు. కార్యక్రమంలో బ్లడ్‌గ్రూప్‌ ప్రతినిదులు కార్తీక్‌, శివ, ...

Read More »

మాక్లూర్‌ మండలం అటవీ ప్రాంతంలో జోరుగా పేకాట

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలంలోని అటవీ ప్రాంతంలో జోరుగా పేకాట కొనసాగుతుంది. మండలంలోని అటవీ ప్రాంతాలైన సింగంపల్లి తాండా, లొద్దిచెరువు, పంజాగుట్ట, కెనాల్‌కట్ట, చిన్నాపూర్‌ గండి తదితర ప్రాంతాల్లో రోజు మాక్లూర్‌ మండలానికి చెందినవారితోపాటు సింగంపల్లి తాండా, దుర్గానగర్‌ తాండాలకు చెందిన యువకులు గుంపులు గుంపులుగా పేకాట ఆడుతూ ఆర్థికంగా నష్టపోతున్నారు. జనసంచారం ఉండకపోవడంతో ఇక్కడ పేకాట విషయంలో పలుమార్లు వివాదాలు ఏర్పడి గొడవలు పడ్డ సందర్భాలున్నాయని తాండావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ...

Read More »

ఘనంగా విశ్వవికాస్‌ పాఠశాల వార్షికోత్సవం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని విశ్వవికాస్‌ పాఠశాల వార్షికోత్సవం గురువారం సాయంత్రం ఘనంగా జరిగింది. రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో విశ్వవికాస్‌ 17వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్‌ఛాన్స్‌లర్‌ సాంబయ్య హాజరై మాట్లాడారు. విద్యార్థులకు చక్కని విద్యనందిస్తే భవిష్యత్తు బాగుంటుందని, అలా విశ్వవికాస్‌ చక్కని విద్యనందిస్తు విద్యార్థులకు మంచి భవిష్యత్తు నందిస్తుందని అభినందించారు. చిన్నారులకు విద్యతోపాటు క్రమశిక్షణ అలవడాలని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్‌ అప్పారావు మాట్లాడుతూ విశ్వవికాస్‌ విద్యార్థులు ...

Read More »

మాడల్‌ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

నందిపేట్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని పలుగుట్ట సమీపంలోని స్థానిక మోడల్‌ పాఠశాలలో 2019- 20 విద్యా సంవత్సరానికి గాను 6 తరగతిలో ప్రవేశాల కోసం మరియు 7వ తరగతి నుంచి 10 తరగతి వరకు గల ఖాళీల భర్తీ కోసం ఆన్‌లైన్‌ ద్వార దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్‌ పెరోజ్‌ హైదర్‌ శుక్రవారం మీడియాతో తెలిపారు. దరఖాస్తు స్వీకరణ జనవరి 28 నుంచి ప్రారంభమయ్యాయని అన్నారు. ఫిబ్రవరి 28 వరకు 6వ తరగతి ప్రవేశం కోసం ఆన్‌లైన్‌ ...

Read More »