Breaking News
EVM machines checking

ఈవిఎం యంత్రాల ఎఫ్‌ఎల్‌సి పూర్తి

కామారెడ్డి, ఫిబ్రవరి 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాల ఫస్ట్‌లెవల్‌ చెకింగ్‌ (ఎఫ్‌ఎల్‌సి) కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్‌ గోదాములో జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ వివిద రాజకీయ పార్టీల సమక్షంలో నిర్వహించారు. ఎన్నికల సిబ్బంది ఫస్ట్‌ లెవల్‌ చెకింగ్‌ కార్యక్రమాన్ని రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో నిర్వహించి వాటిని స్ట్రాంగ్‌ రూంలో బద్రపరిచారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 786 పోలింగ్‌ స్టేషన్లకు సంబంధించి వీవీప్యాట్‌, ఈవిఎం యంత్రాల ఎఫ్‌ఎల్‌సి పూర్తయిందని తెలిపారు. వాటిని భద్రపరిచామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, ఏఎస్‌పి జ్యేష్టాది అన్యోన్య, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ ఆర్డీవోలు రాజేంద్రకుమార్‌, దేవేందర్‌రెడ్డి, రాజేశ్వర్‌, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Check Also

కరోనా నుండి ప్రపంచాన్ని రక్షించమని ప్రార్థన

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతదేశ యావత్‌ ముస్లిం ప్రజానీకానికి రెండు చేతులెత్తి దండం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *