Breaking News

మాక్లూర్‌ మండలం అటవీ ప్రాంతంలో జోరుగా పేకాట

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలంలోని అటవీ ప్రాంతంలో జోరుగా పేకాట కొనసాగుతుంది. మండలంలోని అటవీ ప్రాంతాలైన సింగంపల్లి తాండా, లొద్దిచెరువు, పంజాగుట్ట, కెనాల్‌కట్ట, చిన్నాపూర్‌ గండి తదితర ప్రాంతాల్లో రోజు మాక్లూర్‌ మండలానికి చెందినవారితోపాటు సింగంపల్లి తాండా, దుర్గానగర్‌ తాండాలకు చెందిన యువకులు గుంపులు గుంపులుగా పేకాట ఆడుతూ ఆర్థికంగా నష్టపోతున్నారు.

జనసంచారం ఉండకపోవడంతో ఇక్కడ పేకాట విషయంలో పలుమార్లు వివాదాలు ఏర్పడి గొడవలు పడ్డ సందర్భాలున్నాయని తాండావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు, ఫారెస్టు అదికారులు గస్తీ ముమ్మరం చేసి అటవీ ప్రాంతంలో జరుగుతున్న చట్టవ్యతిరేక కార్యక్రమాన్ని నిర్మూలించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Check Also

చిన్నాపూర్‌లో సుభాష్‌చంద్రబోస్‌ విగ్రహ ఆవిష్కరణ

  మాక్లూర్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ స్వాతంత్య్రం కోసం, బ్రిటీష్‌వారిని ఈ దేశం ...

Comment on the article