Breaking News
EVM machines checking

బ్యాలెట్‌ కంట్రోల్‌ యూనిట్‌లను పరిశీలించిన జిల్లా కలెక్టర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు శనివారం నగరంలోని ఎఫ్‌ఎల్‌సి కేంద్రంలో బ్యాలెట్‌ కంట్రోల్‌ యూనిట్‌లను పరిశీలించారు. మొదటి దశ పరిశీలనలో భాగంగా బ్యాలెట్‌ కంట్రోల్‌, వీవీప్యాట్‌లను బిహెచ్‌ఇఎల్‌, ఇసిఎల్‌ కంపెనీలకు చెందిన ఇంజనీర్ల సమక్షంలో పరిశీలించారు. ముందుగా బ్యాలెట్‌ కంట్రోల్‌ యూనిట్లను పరిశీలించిన తర్వాత వీవీప్యాట్‌లు పరిశీలించాలని అధికారులను కలెక్టర్‌ సూచించారు.

బాగా పనిచేసే వాటికి స్టిక్కర్లు వేయాలని, పనిచేయని వాటిని ఇంజనీర్లు తిరిగి మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈవిఎంలను చెకింగ్‌ చేసిన సిబ్బంది సేవలు వినియోగించుకోవాలని, కొత్త వారికి ముందుగా శిక్షణ ఇచ్చి పలు సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ అన్నారు.

కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, పరిపాలన అధికారి శ్రీధర్‌ తదితరులున్నారు.

Check Also

ఎక్సైజ్‌ సిబ్బందికి రాష్ట్రస్థాయి పురస్కారాలు

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎక్సైజ్‌ సిబ్బంది రాష్ట్ర స్థాయి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *