Breaking News

Daily Archives: February 4, 2019

సర్పంచ్‌లకు సన్మానం

రెంజల్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి మోబిన్‌ఖాన్‌, ఎంపిడివో చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో నూతనంగా నియమితులైన 17 గ్రామాల సర్పంచ్‌లను ఘనంగా సన్మానించారు. సోమవారం మోబిన్‌ఖాన్‌ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం అనంతరం సర్పంచ్‌లను సన్మానించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, వివిద గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

Read More »

తూతూమంత్రంగా మండల సర్వసభ్య సమావేశం

రెంజల్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో సోమవారం ఎంపిపి మోబిన్‌ఖాన్‌ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్యసమావేశం తూతూమంత్రంగా సాగింది. ప్రధాన శాఖల అంశాలను పరిగణలోకి తీసుకుని మిగతా శాఖలను కొనసాగించకుండానే సమావేశం ముగించారు. వ్యవసాయశాఖ, ట్రాన్స్‌కో, ఆర్‌డబ్ల్యుఎస్‌, ఆర్‌అండ్‌బి, రెవెన్యూశాఖల అధికారుల పనితీరుపై గౌరవ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించే అధికారులు కార్యాలయానికే పరిమితమవడంతో గ్రామాల్లో పాలన కుంటుపడుతుందని సభ్యులు అధికారులను నిలదీశారు. గ్రామాల్లో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని ...

Read More »

చలానాల విధింపు

కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో సోమవారం ఆర్‌టిఎ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ద్విచక్ర వాహనదారులకు చలానాలు విధించారు. హెల్మెట్‌ ధరించని వారిని ఆపి కేసు నమోదు చేశారు. అనంతరం వారికి హెల్మెట్‌పై అవగాహన కల్పించారు. హెల్మెట్‌ ధరించినవారికి గులాబిపువ్వు ఇచ్చి శాలువా కప్పారు. సరైన దృవపత్రాలులేని, ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించని వారికి చలానాలు విధించినట్టు ఆర్టీఓ శ్రీనివాస్‌ తెలిపారు.

Read More »

10టివి పేరుతో చేసిన వసూళ్లను తిరిగి చెల్లించాలి

కామరెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఎం పార్టీ కార్మిక సంఘాల నుంచి 10టివి పేరుతో వసూలు చేసిన సొమ్మును తిరిగి చెల్లించాలని ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి రాజలింగం డిమాండ్‌ చేశారు. కామారెడ్డిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బి.వి.రాఘవులు రాష్ట్ర కార్యదర్శిగా సిపిఎం పార్టీ ప్రజల గొంతుక కావాలని అభ్యుదయ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ పెట్టి ఉమ్మడి రాష్ట్రంలోని కార్మిక వర్గం నుంచి 70 కోట్లతో 10 టివి ఛానెల్‌ను, రూ. ...

Read More »

హరితహారం లక్ష్యాన్ని పూర్తిచేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం లక్ష్యాన్ని శాఖలవారిగా పూర్తిచేయాలని, మిషన్‌ భగీరథను మార్చి చివరినాటికి పూర్తిచేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. సోమవారం జనహితలో నిర్వహించిన కన్వర్జెన్సీ సమావేశంలో ఆయన మాట్లాడారు. హరితహారంలో జిల్లాకు ఈయేడు 2 కోట్ల 88 లక్షల లక్ష్యం ఉందన్నారు. గ్రామాభివృద్దిశాఖ, అటవీశాఖలు తమ లక్ష్యాలను పూర్తిచేయాలని ఆదేశించారు. మిషన్‌ భగీరథ ద్వారా మార్చినాటికి బల్క్‌ వాటర్‌ 834 ఆవాసాల్లో పూర్తి చేయాలని పేర్కొన్నారు. అనంతరం వివిద శాఖలపై సమీక్షించారు. సమావేశంలో ...

Read More »

ప్రజావాణిలో 33 ఫిర్యాదులు

కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 33 ఫిర్యాదులు అందినట్టు అధికారులు తెలిపారు. రెవెన్యూశాఖ 15, వ్యవసాయ 1, మునిసిపల్‌ 2, డిపివో 3, గిరిజన 2, హోంశాఖ 1, సిఎంవో 1, ఎస్సీ కార్పొరేషన్‌ 1, ఎంప్లాయిమెంట్‌-2, వైద్య-2, ఎండోమెంట్‌-1, బిసి వెల్పేర్‌-1, ఎల్‌ఎప్‌వోడి బ్యాంకు-1 సంబందించి మొత్తం 33 పిర్యాదులు అందాయని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని పరిష్కరించాలని అధికారులను ...

Read More »

మహిళ కాన్పునకు మధ్యలో అంతరం పాటించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళ కాన్పు కాన్పునకు మధ్యలో మూడు నుంచి నాలుగు సంవత్సరాల అంతరాన్ని పాటించాలని ఇందుకోసం ప్రభుత్వం మహిళలకు అంతర ఇంజక్షన్‌ను ప్రతి మూడునెలలకు తీసుకునేందుకు జిల్లాలో మొట్టమొదటిసారిగా, రాష్ట్రంలో రెండో జిల్లాగా ప్రవేశపెట్టిందని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సోమవారం అంతర ఇంజక్షన్‌ ప్రారంభానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ఫ్యామిలీ ప్లానింగ్‌ కో ఆర్డినేటర్‌ రమ, పద్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ...

Read More »

ఫోన్‌ ఇన్‌ ద్వారా నేరుగా సమస్యల పరిష్కారం

కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాసమస్యలను నేరుగా స్వీకరించే ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం ద్వారా జిల్లాకలెక్టర్‌ సత్యనారాయణ నేరుగా పరిష్కరణలు సూచించారు. సోమవారం నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా కలెక్టర్‌ దృష్టికి తేవడం ద్వారా కలెక్టర్‌ వాటిని వెంటనే పరిష్కరించారు. పెద్దకొడప్‌గల్‌కు చెందిన జగదీశ్‌ శివాయి జమీందార్‌ ద్వారా పొందిన భూమి హక్కులపై కోరగా వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. షెట్పల్లి గ్రామానికి చెందిన విద్యాసాగర్‌ తన అసైన్‌మెంట్‌ ల్యాండ్‌పై పివోటి ద్వారా కాసు, ...

Read More »

మండల ప్రాదేశిక ఎన్నికల్లో రిజర్వేషన్‌ కల్పించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల ప్రాదేశిక ఎన్నికల్లో రిజర్వేషన్‌ కల్పించాలని కులాస్‌పూర్‌ గ్రామానికి చెందిన మాల, మాదిగ ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌ను కోరారు. సోమవారం ప్రజావాణిలో ఈ అంశంపై కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసిన అనంతరం వారు మాట్లాడారు. కులాస్‌పూర్‌ గ్రామంలో మాల, మాదిగలకు చెందిన సుమారు 400 మంది ఓటర్లున్నారని, 50 సంవత్సరాల నుంచి తమకులాలకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కలగలేదని విన్నవించినప్పటికి జిల్లా యంత్రాంగం పట్టించుకోలేదని వారు వాపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ...

Read More »

వెల్‌నెస్‌ సెంటర్‌ ప్రారంభం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో సోమవారం శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, జర్నలిస్టులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వెల్‌నెస్‌ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్‌ మాట్లాడుతూ నిజామాబాద్‌ నగరంలో సెంటర్‌ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని, సేవలను ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు, అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్త, ...

Read More »

క్రికెట్‌ టోర్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

నిజామాబాద్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వి6, వెలుగు క్రికెట్‌ టోర్నిని అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్త సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నేటి బిజీ లైఫ్‌లో క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ప్రతి ఒక్కరు క్రీడల్లో తప్పకుండా తరచుగా పాల్గొనాలని, తద్వారా శారీరక రుగ్మతలు దూరమవుతాయని అన్నారు. వి6 వెలుగు ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని, దీని ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించిన వారమవుతామని అన్నారు. నిజామాబాద్‌ నగరానికి చెందిన యెండల సౌందర్య దేశ ...

Read More »

4 నుంచి ‘అంతర’ ప్రారంభం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 4వ తేదీ నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో అంతర కార్యక్రమం ప్రారంభిస్తున్నట్టు డాక్టర్‌ రమాపద్మ తెలిపారు. అంతర కార్యక్రమంలో సూదిమందు ఇవ్వడం జరుగుతుందని ఇది తీసుకున్న మహిళలకు మూడునెలల వరకు గర్భదారణ జరగదని ఈ సూదిమందును ప్రతి మూడునెలలకోసారి తీసుకోవచ్చని ఇది ఒకరకమైనటువంటి తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్దతి అని ఆమె తెలిపారు. కార్యక్రమంలో డిఎంఅండ్‌హెచ్‌వో సుదర్శన్‌, డిప్యూటి డిఎంఅండ్‌హెచ్‌వో తుకారాం రాథోడ్‌, విద్య, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాములు, డాక్టర్‌ నాగరాజు, ...

Read More »

రోడ్డు భద్రతా వారోత్సవాల గోడప్రతుల ఆవిష్కరణ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు భద్రత వారోత్సవాలు 2019 గోడప్రతులను జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు సోమవారం తన చాంబరులో విడుదల చేశారు. ఈనెల 4వ తేదీ నుంచి 14 వరకు నిర్వహించే రోడ్డు భద్రతా వారోత్సవాలకు సంబంధించి పోస్టర్‌ను వాహనాలకు అతికించే స్టిక్కర్లను ప్రజలకు పంపిణీ చేసే కరపత్రాలను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారోత్సవాలను 4వ తేదీ నుంచి 10 వరకు నిర్వహించాల్సి ఉండగా, వీటిని ఈనెల 14 వరకు పొడిగించడం జరిగిందని, ...

Read More »

సాహిత్యం వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతుంది

నిజామాబాద్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాహిత్యం వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. సోమవారం మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఆద్వర్యంలో ఈనెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు జరుగు జిల్లాస్థాయి లిటరసీ కల్చరల్‌ కార్నివాల్‌- 2019 సమ్మేళనంను దాస్‌నగర్‌ వద్దగల అర్బన్‌ పాఠశాలలో జిల్లా కలెక్టర్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సమ్మేళనంలో ఉమ్మడి జిల్లాల్లోని బాలికల గురుకుల పాఠశాలల విద్యార్థినిలు పాల్గొననున్నారు. ఇంతకుముందు జిల్లాస్థాయి క్రీడలు, ఇపుడు లిటరసీ కల్చరల్‌ ...

Read More »

ఎంపి కవితకు కేరళ అసెంబ్లీ ఆహ్వానం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలోని విశ్వవిద్యాలయాల విద్యార్థులతో కేరళ అసెంబ్లీ నిర్వహిస్తున్న సదస్సులో ప్రసంగించాల్సిందిగా నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవితను కేరళ అసెంబ్లీ స్పీకర్‌ రామకృష్ణన్‌ ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన ఎంపి కవితకు ఆహ్వానిస్తు లేఖ పంపారు. కేరళ అసెంబ్లీ డైమండ్‌ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఈనెల 23 నుంచి 25 వరకు నిర్వహిస్తున్న సదస్సుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. 23న మధ్యాహ్నం తిరువనంతపురం కేరళ అసెంబ్లీ కాంప్లెక్సులో జరిగే సదస్సులో ప్రసంగించాల్సిందిగా ...

Read More »

క్రీడలతో మానసిక ఉల్లాసం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని నిజామాబాద్‌ అడిషనల్‌ డిసిపి లా అండ్‌ ఆడర్‌ శ్రీధర్‌రెడ్డి అన్నారు. జర్నలిస్టు స్వర్గీయ మల్లెపూల నరేంద్ర 28వ స్మారక క్రీడాపోటీలు సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ మైదానంలో ప్రారంభమయ్యాయి. నరేంద్ర మెమోరియల్‌ స్పోర్ట్స్‌ కమిటీ ఆద్వర్యంలో గ్రామీణ క్రీడ అయిన ఖోఖో పోటీలను అదనపు డిసిపి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం జర్నలిస్టు నరేంద్ర చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా క్రీడా పతాకాన్ని ఎగురవేసి ...

Read More »