Breaking News

క్రికెట్‌ టోర్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

నిజామాబాద్‌, ఫిబ్రవరి 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వి6, వెలుగు క్రికెట్‌ టోర్నిని అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్త సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నేటి బిజీ లైఫ్‌లో క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ప్రతి ఒక్కరు క్రీడల్లో తప్పకుండా తరచుగా పాల్గొనాలని, తద్వారా శారీరక రుగ్మతలు దూరమవుతాయని అన్నారు.

వి6 వెలుగు ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని, దీని ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించిన వారమవుతామని అన్నారు. నిజామాబాద్‌ నగరానికి చెందిన యెండల సౌందర్య దేశ విదేశాల్లో హాకీలో పాల్గొని తన ప్రతిభ చాటిందని, అదేవిధంగా మాలావత్‌ పూర్ణ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి తన సత్తా చాటిందని, యువత మేల్కొని అన్ని రంగాల్లో విజేతలుగా నిలవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

కార్యక్రమంలో నుడా ఛైర్మన్‌ చేమకూర ప్రభాకర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ శ్రీధర్‌గుప్త, వెలుగు పత్రిక స్టాఫ్‌ రిపోర్టర్‌ శ్రీనివాస్‌, వి6 స్టాఫ్‌ రిపోర్టర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

హైదరాబాద్‌ మినహా కరోనా కేసుల్లో నిజామాబాద్‌ జిల్లా తెలంగాణలో నెంబర్‌ వన్‌…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ప్రత్యేకం : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం అందరికీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *