Breaking News

సాహిత్యం వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతుంది

నిజామాబాద్‌, ఫిబ్రవరి 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాహిత్యం వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. సోమవారం మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఆద్వర్యంలో ఈనెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు జరుగు జిల్లాస్థాయి లిటరసీ కల్చరల్‌ కార్నివాల్‌- 2019 సమ్మేళనంను దాస్‌నగర్‌ వద్దగల అర్బన్‌ పాఠశాలలో జిల్లా కలెక్టర్‌ లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సమ్మేళనంలో ఉమ్మడి జిల్లాల్లోని బాలికల గురుకుల పాఠశాలల విద్యార్థినిలు పాల్గొననున్నారు. ఇంతకుముందు జిల్లాస్థాయి క్రీడలు, ఇపుడు లిటరసీ కల్చరల్‌ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థులు ఆయా రంగాల పట్ల అవగాహన, ఆసక్తి పెంపొందించుకునే అవకాశం కలుగుతుందన్నారు. విద్యార్థులు ఏ రంగాన్నైనా ఎంచుకున్నా సమాజ సేవ చేయాలనే సంకల్పం ఉండాలని, తమ అభిరుచి ప్రకారం ఎంచుకున్న రంగంలో ఆరితేరుతు తోటివారికి సహాయం చేయాలనే మనస్తత్వం అలవరుచుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

ఎన్ని బాషలు నేర్చుకున్నా మాతృభాషను మరువద్దని కలెక్టర్‌ తెలిపారు. మూడురోజుల పాటు జరిగే సమ్మేళనంలో వ్యాస, వక్తృత్వ డిబేట్‌, మ్యూజిక్‌, డ్యాన్స్‌, క్విజ్‌, ఆర్ట్‌, మోనోయాక్షన్‌, ఫ్యాన్సీ డ్రెస్‌ పోటీలు నిర్వహించబడతాయని, లిటరరీ కల్చర్‌ కార్నివల్‌ వేడుకలు బాలురకు బీర్కూర్‌లో నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో మాక్లూర్‌ మండల తహసీల్దార్‌, ఎంపిడివో, పాఠశాల ప్రిన్సిపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రత్యేక అవసరాలు గల పిల్ల‌ల‌కు పరికరాల‌ పంపిణీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాల‌ విద్యాశాఖ సంచాల‌కులు తెలంగాణ హైదరాబాద్‌ వారి ఆదేశానుసారం ...

Comment on the article