Breaking News

Daily Archives: February 8, 2019

బెట్టింగ్‌ నిర్వాహకుల అరెస్ట్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరం సంజీవయ్య కాలనీలో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముగ్గురు యువకులను ఆధువులోకి తీసుకున్నట్లు మూడవ టౌన్‌ ఎస్‌ఐ కృష్ణ తెలిపారు. శుక్రవారం టాస్క్‌ ఫోర్స్‌, మూడవ టౌన్‌ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వాహకులు ఆనంద్‌, విక్రమ్‌, సంజీవ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుండి 2 లక్షల 5 వేల నగదు, 5 సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏస్‌ఐ కష్ణ తెలిపారు. వీరితో పాటు ...

Read More »

మెస్‌ చార్జీలు విడుదల చేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంక్షేమ వసతి గృహాల్లో మెస్‌ చార్జీలు విడుదల చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు నరేశ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. కామారెడ్డిలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వసతి గృహాల విద్యార్థులకు సంబంధించిన మెస్‌ చార్జీ బకాయిలను ఇంతవరకు విడుదల చేయకపోవడం గర్హణీయమన్నారు. వార్డెన్లు అప్పులు చేసి నెట్టుకొస్తున్నారని పేర్కొన్నారు. వసతిగృహాల్లో ఖాళీగా ఉన్న వార్డెన్‌ పోస్టులను భర్తీచేయాలని డిమాండ్‌ చేశారు. మిగతా పోస్టులను సైతం భర్తీచేయాలని, వసతి గృహాల్లో అన్ని వసతులు ...

Read More »

స్ట్రాంగ్‌రూంకు సీల్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించనున్న బ్యాలెట్‌ యూనిట్‌, కంట్రోల్‌ యూనిట్‌, వీవీప్యాట్‌ ఫస్ట్‌లెవల్‌ చెకప్‌ను పూర్తిస్థాయిలో వెరిఫికేషన్‌ చేసి సర్టిఫై చేసినట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఏఎంసి గోదాములో ఉంచిన బ్యాలెట్‌ యూనిట్‌, కంట్రోల్‌ యూనిట్‌, వీవీప్యాట్‌ లలో మాక్‌పోల్‌లో నమోదైన ఓట్లను లెక్కించి ఎఫ్‌ఎల్‌సిని పూర్తిచేసి సీల్‌ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భారత్‌ ఎలక్ట్రానిక్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో యంత్రాల ఎఫ్‌ఎల్‌సిని పూర్తిచేశామన్నారు. మాక్‌పోల్‌లో భాగంగా 853 కంట్రోల్‌ ...

Read More »

నిరుపేదలకు రుణాల ద్వారా చేయూత

కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్థికంగా వెనకబడిన బిసి కులస్తులకు ఉపాధి కల్పన నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం వందశాతం సబ్సిడీతో 50 వేల రూపాయలు అర్హులైన లబ్దిదారులకు అందిస్తుందని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. బిసి సంక్షేమ, కార్పొరేషన్‌ ద్వారా మంజూరైన చెక్కులను శుక్రవారం జిల్లా కలెక్టర్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ లబ్దిదారులకు పంపిణీ చేశారు. నిరుపేదలైన 9 వేల 788 మంది లబ్దిదారులకు రూ. 50 వేల నుంచి రూ. 12 లక్షల వరకు ప్రభుత్వ ...

Read More »

భక్తి శ్రద్దలతో కలశ యాత్ర

కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్కండేయ జయంతిని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం పద్మశాలి సంఘం ఆద్వర్యంలో వైభవంగా కలశ యాత్ర నిర్వహించారు. వేలాది మంది మహిళలు కలశాలు నెత్తినబెట్టుకొని ఊరేగించారు. పట్టణ పద్మశాలి సంఘం నుంచి ప్రారంభమైన యాత్ర ప్రధానవీధుల గుండా మార్కండేయ మందిరం వరకు కొనసాగింది. మహిళలు ఆలయం వద్ద కలశాలను ఉంచి మార్కండేయునికి సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమం, అన్నదాన కార్యక్రమం జరిపారు.

Read More »

ఎంసిపిఐయు మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ

కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంసిపిఐయు ఆలిండియా మహాసభల పోస్టర్లను శుక్రవారం కామారెడ్డిలో ఆవిష్కరించారు. ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్‌ నగరంలో ఎంసిపిఐయు మహాసభలు జరుగుతాయని, పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం తెలిపారు. 18 రాష్ట్రాల్లో పూర్తిస్తాయి నిర్మాణం కలిగి, 22 రాష్ట్రాల్లో ప్రజాసంఘాల నిర్మాణం కలిగి ఎంసిపిఐయు దేశవ్యాప్తంగా విస్తరిస్తుందని పేర్కొన్నారు. కారల్‌మార్క్స్‌, లెనిన్‌, స్టాలిన్‌ ఆశయాలతో మార్క్సిస్టు పార్టీ మూల సిద్దాంతం, ఆచరణ ధ్యేయంగా దేశంలో కుల, వర్గ ...

Read More »

గ్రామాభివృద్దికి కృషి చేస్తా

రెంజల్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోర్గాం గ్రామ పంచాయతీ అభివృద్దికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించి గ్రామాభివృద్దికి కృషి చేస్తానని సర్పంచ్‌ వాణి అన్నారు. బోర్గాం గ్రామ పంచాయతీలో శుక్రవారం సర్పంచ్‌, వార్డు సభ్యులకు సన్మానసభ ఏర్పాటు చేశారు. ఎంపిడివో చంద్రశేఖర్‌, రెంజల్‌ విండో ఛైర్మన్‌ మోహినోద్దీన్‌ పాలకవర్గాన్ని పూలమాలలు, శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కార్యదర్శి శ్రీకాంత్‌, గ్రామస్తులు సాయిరెడ్డి, రాజు, నాగన్న, పోశెట్టి, ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్‌, వార్డు సభ్యులతో ఎంపిడివో చంద్రశేఖర్‌

Read More »

ఎంపిడివోను సస్పెండ్‌ చేయాలి

నందిపేట్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ ఎంపీడీవో నాగవర్ధన్‌ ఇష్టానుసారంగ సభలు నిర్వహిస్తూ ఎంపీపీ హక్కులను కాలరాస్తున్నారని ఆరోపిస్తూ దళిత సంఘాల నాయకులు శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం ముందు బైఠాయించారు. ఎంపిడిఓను సస్పెండ్‌ చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. గురువారం ఎంపీడీవో అధ్యక్షతన నూతనంగా ఎన్నికైన సర్పంచుల సమావేశం ఏర్పాటు చేసిన విషయాన్ని ఎంపీపీ అంకంపల్లి యమునకు తెలపక పోవడం శోచనీయమన్నారు. దళిత సంఘాల నాయకులు యమునకు మద్దతుగా ధర్నా నిర్వహించి ఎంపిడిఓను సస్పెండ్‌ చేయాలని నినాదాలు చేశారు. ...

Read More »

ఉత్సవ కమిటీ ఛైర్మన్‌గా సూర్యప్రకాశ్‌రెడ్డి

బోధన్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌లోని చక్రేశ్వర శివాలయ మహాశివరాత్రి ఉత్సవ కమిటీ ఛైర్మన్‌గా సూర్యప్రకాశ్‌రెడ్డిని నియమించారు. ఈ మేరకు బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ ఒకప్రకటనలో వెల్లడించారు. సభ్యులుగా ఎం.శ్రీనివాస్‌, అశోక్‌రావు, సుశీల, ఎస్‌.గణేశ్‌, జి.దేవిదాస్‌, రవి లను నియమించారు. వీరు మహాశివరాత్రి పండగ ఏర్పాట్లను సమీక్షిస్తారు.

Read More »

స్పీకర్‌ పోచారంను పరామర్శించిన సురేశ్‌రెడ్డి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని తెరాస నాయకులు, మాజీ స్పీకర్‌ కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి శుక్రవారం పరామర్శించారు. పోచారం తల్లి పాపవ్వ చిత్రపటానికి నివాళులు అర్పించారు. పోచారం కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన వెంట చెన్నమనేని రమేశ్‌ తదితరులున్నారు.

Read More »

ఈనెల 11,12 తేదీల్లో న్యాయవాదుల నిరసన

నిజామాబాద్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ వ్యాప్తంగా న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరి 11,12 తేదీల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులు ఎం.రాజేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన న్యాయవాదుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా కొన్ని ప్రధాన డిమాండ్లతో ప్రధానమంత్రి కార్యాలయానికి వినతి పత్రం సమర్పించడం జరిగిందని తెలిపారు. ప్రతి న్యాయవాదికి, వారి కుటుంబానికి రక్షణ కల్పించే విధంగా 20 ...

Read More »

18 న గ్రామ పంచాయతీ కార్మికుల ధర్నా

నిజామాబాద్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయితీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తు ఫిబ్రవరి 18న మండల కేంద్రాలలో చేపడుతున్న ధర్నాలను జయప్రదం చేయాలని గ్రామ పంచాయతీ జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. శుక్రవారం జిల్లా కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికులు జిల్లా కమిటీ సమావేశం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్‌ మాట్లాడుతూ కొత్త పాలక వర్గాలు కార్మికుల సమస్యలపై దష్టి పెట్టాలని సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా ఆందోళన చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఫిబ్రవరి 11, 12 న ...

Read More »

నిరాహార దీక్షలు జయప్రదం చేయండి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 11, 12, 13 తేదీలలో జరిగే మున్సిపల్‌ నిరాహార దీక్షలు, ధర్నాలను జయప్రదం చేయాలని సిఐటియు ఉపాధ్యక్షులు మల్యాల గోవర్ధన్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ సిఐటియు సమావేశం జిల్లా కేంద్రంలోని డిఆర్‌సి పాయింట్‌ వద్ద భూపతి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల గోవర్ధన్‌ మాట్లాడారు. మున్సిపల్‌ కార్మికులకు జీవో 14 ప్రకారం వేతనాలు ...

Read More »

ఉద్యోగుల నిబద్ధత వల్లే జిల్లాకు గుర్తింపు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాకు చెందిన ఉద్యోగులు నిబద్దతతో పని చేయడం మూలంగ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల అమలులో జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ మైదానంలో 32వ జిల్లాస్థాయి టీ ఎన్జీవో ఉద్యోగుల క్రీడలు జిల్లా కలెక్టర్‌, బేవరేజ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవిప్రసాద్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో పథకాల అమలు, ఫలితాలు చేరవేయడంలో ముందంజలో ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం ...

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

కమ్మర్‌పల్లి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కమ్మర్‌పల్లి మండలానికి చెందిన పలువురు అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోగా పెద్దమొత్తంలో ఖర్చు అయ్యింది కాగా బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌ రెడ్డికి విన్నవించుకోగా ముఖ్యమంత్రి సహాయనిది నుండి ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయడం జరిగింది. ఈ మొత్తాన్ని శుక్రవారం లబ్దిదారులకు అందజేశారు. కొత్తపల్లి ఆశన్న రూ. 21 వేల 500, పాలేపు చిన్నగంగారాం రూ. 25 వేలు, కాప మంజుల రూ. 2 లక్షల 50 వేలు, చింత కళావతి రూ. ...

Read More »

మామ చనిపోయిన దుఃఖంలో

నందిపేట్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేటకు చెందిన అన్నపూర్ణ రైస్‌మిల్‌ యజమాని బంధం దయానంద్‌ గత వారం రోజుల నుండి శ్వాసకోస వ్యాధితో బాధ పడుతున్నాడు. కాగా హైదరాబాద్‌ లోని ప్రైవేట్‌ అసుపత్రిలో చికిత్స పొందుతు గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. విషయం తెలిసుకున్న బంధుమిత్రులు చేరుకున్న తరువాత కోడలు సాయంత్రం 7 గంటల సమయంలో అకస్మాత్తుగా కూలబడి కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే మతి చెందడంతో వచ్చిన బంధువులు, కుటుంభ సభ్యలు దుఃఖం నుండి తెరుకోలేకపోయారు. మామ ...

Read More »