Breaking News
విలేరుల సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు

మెస్‌ చార్జీలు విడుదల చేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంక్షేమ వసతి గృహాల్లో మెస్‌ చార్జీలు విడుదల చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు నరేశ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. కామారెడ్డిలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వసతి గృహాల విద్యార్థులకు సంబంధించిన మెస్‌ చార్జీ బకాయిలను ఇంతవరకు విడుదల చేయకపోవడం గర్హణీయమన్నారు.

వార్డెన్లు అప్పులు చేసి నెట్టుకొస్తున్నారని పేర్కొన్నారు. వసతిగృహాల్లో ఖాళీగా ఉన్న వార్డెన్‌ పోస్టులను భర్తీచేయాలని డిమాండ్‌ చేశారు. మిగతా పోస్టులను సైతం భర్తీచేయాలని, వసతి గృహాల్లో అన్ని వసతులు కల్పించాలని, లేనిపక్షంలో ఆందోళన తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సాయికిరణ్‌, నర్సింలు, భానుప్రకాశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మోకాళ్లపై కూర్చొని నిరసన

కామారెడ్డి, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు గత రెండు నెలల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *