కామారెడ్డి, ఫిబ్రవరి 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 22న ఓటరు తుది జాబితా వెలువడుతున్నందున ఓటరు నమోదు క్లెయిమ్స్‌ను వెంటనే నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఆర్డీవోలను ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆర్డీవోలు, తహసీల్దార్లతో ఓటరు నమోదు స్పెషల్ సమ్మరి రివిజన్, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనపై సమీక్షించారు.
ఈనెల 4వ తేదీ వరకు వచ్చిన ఫిర్యాదులను క్లియర్ చేయాలని, డుప్లికేట్ ఓటరు నమోదులు లేకుండా చూసుకోవాలని సూచించారు. అన్ని దరఖాస్తులను పరిశీలించి వాటిని పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ చెరువులు, కుంటలు, అటవీభూములు, శిఖం బూములు తదితర 18 రకాల భూములను మార్కింగ్ చేసి వెంటనే పూర్తి చేసుకోవాలని, ఫౌతి, ముటేషన్, రిజిష్టర్డ్ డాక్యుమెంట్ పూర్తిచేసుకోవాలని ఆదేశించారు.
6 వేల 801 కొత్త పాసుపుస్తకాలు వచ్చాయని, వాటిని రెండ్రోజుల్లో పంపిణీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ వరప్రసాద్, శ్రీనివాస్, నిఖిల్, సిబ్బంది ఉన్నారు.

Latest posts by Nizamabad News (see all)
- ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే మహిళలకు రక్షణ లేదు - December 10, 2019
- స్త్రీ నిధి రుణాలు సక్రమంగా మంజూరయ్యేలా చూడాలి - December 10, 2019
- భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోండి - December 10, 2019