Breaking News

ఇందూరు తిరుమల క్షేత్రానికి ఉచిత బస్సు

నిజామాబాద్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విశేష ఏకాంత సేవలో పాల్గొనె భక్తుల సౌకర్యార్థం నిజామాబాద్‌ నగరం నుండి ఇందూరు తిరుమల క్షేత్రం నర్సింగ్‌పల్లికి ఉచిత బస్సు ఏర్పాటు చెయ్యడం జరిగిందని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు.

విశేష ఏకాంత సేవలో పాల్గొనే భక్తులకు ప్రతి శనివారం సాయంత్రం 6:30. గంటలకు వినాయకుల బావి దగ్గర, త్రిమూర్తి ఎంటర్‌ప్రైజెస్‌ ఎదురుగా ప్రెసిడెన్సీ పాఠశాలకు చెందిన బస్సు ఉంటుందన్నారు. భక్తులను తీసుకుని 7 గంటలకు వినాయక్‌ నగర్‌ నుండి నర్సింగ్‌పల్లికి బయల్దేరును. విశేష ఏకాంత సేవ అనంతరం ఇదే బస్సు భక్తులను తీసుకుని ఉచితంగా నిజామాబాద్‌ నగరంలోని బస్టాండ్‌ వరకు వదిలి వెళ్ళును. సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా భక్తులకు మనవి.

ఇంకా ఏదేని సందేహాలు ఉంటే ఈ నంబరు 8977711111 కు ఫోన్‌ చేయగలరని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

Check Also

ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల ప్రణాళికలో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *