Breaking News
పరీక్షకు హాజరైన అభ్యర్థులు

యోగాతో ఆరోగ్యం

నిజామాబాద్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధానమంత్రి పిఎంకెవివై కేంద్ర ప్రభుత్వ ఆద్వర్యంలో నిర్వహించబడుతున్న యోగభౌతిక ఆర్‌పిఎల్‌-4 పరీక్ష స్థానిక ఆర్యసమాజములో పతంజలి యోగసమితి నిజామాబాద్‌ వారు శనివారం నిర్వహించారు. పతంజలి రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు మంజుశ్రీనాయర్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

పరీక్షకు హాజరైన 50 మంది అభ్యర్థులకు యోగ ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని వివరిస్తు ప్రతి ఒక్కరు తమ తమ స్థానాల్లో ఉచిత యోగ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. యోగాతో చక్కటి ఆరోగ్యం చేకూరుతుందన్నారు.

ప్రధానమంత్రి కౌసల్య వికాస యోజన ఆర్‌పిఎల్‌-4 పరీక్షను పతంజలి యోగ్‌పీఠ్‌ ద్వారా అసిస్టెంట్‌ యోగా టీచర్‌ సర్టిఫికెట్‌ కలిగినవారు 50 మంది అభ్యర్థులు రాశారు. ఉత్తీర్ణులైన వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి యోగా టీచర్‌ దృవపత్రం ఇవ్వబడుతుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఆచార్య నరేంద్ర, గంగాధర్‌, గంజి సాయన్న, బుచ్చన్న, ఆచార్య వేదమిత్ర, డాక్టర్‌ రాకేశ్‌, యోగ ప్రచారక్‌ ప్రవీణ్‌, సునీతి, కౌసల్య, నర్మద, వీణ, యమున తదితరులు పాల్గొన్నారు.

Check Also

22న రాష్ట్రస్థాయి గణిత పరీక్ష

కామారెడ్డి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణిత ప్రతిభ పరీక్షల పోస్టర్‌ను కామారెడ్డి జిల్లా జాయింట్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *