Breaking News
అధికారులతో సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్‌

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి జిల్లా స్థాయిలో వ్యవసాయ, ఉద్యానశాఖ అదికారులు సంయుక్తంగా కృషి చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. శనివారం కలెక్టర్‌ చాంబరులో వ్యవసాయ, ఉద్యానశాఖల మార్కెటింగ్‌ అధికారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

ఇరుశాఖల ఆద్వర్యంలో వివిధ రకాల నేలలు, పంటల వివరాలు, సాగుతో రూపొందించిన సమాచారాన్ని సర్వేచేసి రాష్ట్రానికి పంపించాలని ఆదేశించారు. పంటలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించాలని నేల పరీక్షను ప్రింట్‌ చేయాలని చెప్పారు. ఖరీఫ్‌, రబీ, వేసవి కాలాల్లో ఏఏ పంటలు పండుతున్నాయి, వ్యవసాయ పరికరాల వివరాలను రైతుల ద్వారా సర్వే చేయాలన్నారు.

క్రాఫ్‌ లోన్‌పై బ్యాంకులు, రైతు సమన్వయ సమితి సభ్యులు ఏఇవోల ద్వారా సమీక్షించి చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇతర పంటల వివరాలు, విత్తనోత్పత్తి తదితరాలపై వివరాలు సేకరించాలని ఆదేశించారు. సమావేశంలో డిఎవో నాగేందర్‌, డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి, ఆయా శాఖల అదికారులు పాల్గొన్నారు.

Check Also

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

రెంజల్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రానికి చెందిన నరేష్‌ అనారోగ్యానికి గురి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *