Breaking News

Daily Archives: February 10, 2019

రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేయాల్సిన అవసరముంది

జగిత్యాల, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేయాల్సిన అవసరముంది భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అరవింద్‌ అన్నారు. వసంత పంచమి సందర్బంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని చాణక్య మోడల్‌ స్కూల్‌ లో నిర్వహించిన గాయత్రీ యజ్ఞంలో పాల్గొని మాట్లాడారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో నిజామాబాద్‌ బీజేపి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలువనున్నానని ఆశాభావం వ్యక్తం చేసారు. రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో మీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాని పరిస్థితిలో ...

Read More »

కొమిరెడ్డి రాములును పరామర్శించిన అర్వింద్‌

జగిత్యాల, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మపురి అర్వింద్‌ ఆదివారం మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే, సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది కొమిరెడ్డి రాములును పరమర్శించారు. గత నెలలో కొమిరెడ్డి రాములు మాతమూర్తి స్వర్గస్తులైనారు. ఆదివారం కొమిరెడ్డి రాములు కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో కొమిరెడ్డి విజయ్‌, కొమిరెడ్డి అజాద్‌, కొమిరెడ్డి అభిమానులు, స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Read More »

రోడ్డు భద్రతపై అవగాహన

నిజామాబాద్‌, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ఈనెల 11వ తేదీన భీంగల్‌లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా రవాణా అధికారి డి.వి.రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భీమ్‌గల్‌ పట్టణంలో కళాశాల, పాఠశాలల విద్యార్థులచే ర్యాలీ, వాహన చోదకులకు అవగాహన సమావేశం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Read More »

విద్యార్థులకు నోటుపుస్తకాల పంపిణీ

ఆర్మూర్‌, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి ఆదివారం వసంత పంచమి సందర్భంగా రామందిర్‌ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కౌన్సిలర్‌ పండిత్‌ ప్రేమ్‌ ఆధ్వర్యంలో నిర్యాహించిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు అక్షరాబ్యాసం చేయించారు. సరస్వతి మాత విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వెంట పలువురు తెరాస నాయకులు, తదితరులు ఉన్నారు.

Read More »

ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసంతపంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారంఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్‌ డివిజన్‌ కేంద్రంలోని సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌ గౌడ్‌, నియోజకవర్గ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Read More »

అంగన్వాడీ కేంద్రానికి తాళం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలంలోని ఊట్‌పల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం శనివారం తాళంతో దర్శనమిచ్చింది. వివరాల్లోకి వెళితే ఊట్‌పల్లి గ్రామంలోని అంగన్వాడీ టీచర్‌ శనివారం ఎవరి అనుమతి లేకుండా విధులకు డుమ్మా కొట్టిందని గ్రామస్తులు బోధన్‌ సీడీపీఓకు సమాచారం ఇచ్చారు. అయినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1న సెలవు ఇచ్చి, ఫిబ్రవరి 9 రెండో శనివారం నాడు వర్కింగ్‌ డే పెట్టడం జరిగింది. అంగన్వాడీ టీచర్‌ ఫిబ్రవరి ...

Read More »

ఫలించిన ఎంపి కవిత కృషి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) నుంచి పూర్తిస్థాయి అనుమతులు వచ్చాయి. ఈ మేరకు ఎంసీఐ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతులు రావడంలో నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత కషి ఎంతో ఉంది. నిజామాబాద్‌లోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలతో పాటు అనుబంధ జిల్లాకేంద్ర ప్రభుత్వ దవాఖానలో కోట్లాది రూపాయలతో మౌలిక వసతులు కల్పించడంతో పాటు అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి తెచ్చారు. దీంతో పాటు ...

Read More »

కామారెడ్డి డిసిసి అధ్యక్షునిగా కైలాస్‌ శ్రీనివాస్‌రావు

కామారెడ్డి, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులను ప్రకటించడం జరిగింది. కామారెడ్డి జిల్లాకు మొట్టమొదటి కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షునిగా కామారెడ్డి పట్టణానికి చెందిన కైలాస్‌ శ్రీనివాస్‌ రావును అధిష్టానం ప్రకటించింది. మాజీ శాసనమండలి ప్రతిపక్షనేత ఎమ్మెల్సీ మహమ్మద్‌ అలీ షబ్బీర్‌కు సన్నిహితుడైన కైలాస్‌ శ్రీనివాసరావు పదవి వరించింది. గతంలో కామారెడ్డి పట్టణ మున్సిపల్‌ చైర్మన్‌గా, కామారెడ్డి పట్టణ అధ్యక్షునిగా, ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తగా ఉన్న శ్రీనివాసరావు అంచెలంచెలుగా ఎదిగి కాంగ్రెస్‌ ...

Read More »

ఆదివారం వసంత పంచమి వేడుకలు

కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలోని బ్రహ్మజ్ఞాన ఆశ్రమంలో ఆదివారం వసంత పంచమి పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ ప్రతినిధులు తెలిపారు. వసంత పంచమి, ఆశ్రమ 14వ వార్షికోత్సవం పురస్కరించుకొని ధ్వజారోహణం, గోపూజ, గణపతి, నవగ్రహ పూజ, కృష్ణ భగవానునికి అభిషేకం, అన్నప్రసాద వితరణ నిర్వహిస్తామన్నారు. భక్తులు ఆలయ అభివృద్ది నిమిత్తం విరాళాలు ఇవ్వవచ్చని బోనగిరి శివకుమార్‌ కోరారు.

Read More »