Breaking News
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు నాయకులు

సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసతిగృహ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

అనేక సంవత్సరాల నుంచి సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో కార్మికులు ఉద్యోగులుగా పనిచేస్తున్నారని, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల బతుకులు ఘోరంగా ఉన్నాయని ఆరోపించారు. వారితో ప్రభుత్వం వెట్టిచాకిరి చేయిస్తోందని, రోజుకు పదిగంటల పని చేయించుకుంటు శ్రమదోపిడి చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను పర్మనెంట్‌ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించి ఏజెన్సీలను రద్దుచేయాలని, కార్మికులకు పిఎప్‌, ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సుదీర్‌, పద్మ, శకుంతల, సునంద తదితరులు పాల్గొన్నారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *