Breaking News

నేడు రథసప్తమి

సమస్త జీవరాశికీ సూర్యుడే ఆధారం. అందుకే సూర్యుడిని వేదాలు త్రిమూర్తి స్వరూపంగా పేర్కొన్నాయి. మూడు సంధ్యల్లోనూ ఆదిత్యుడిని ఆరాధించేందుకు సంధ్యా వందన నియమాన్ని ఏర్పాటు చేశాయి. భూమ్మీద మొదట దర్శనమిచ్చిన దైవంగా హైందవులు భాస్కరుడిని పూజిస్తారు… ఆ దివాకరుడు పుట్టిన రోజైన మాఘ శుద్ధ సప్తమినే రథ సప్తమిగా పేర్కొంటారు. ‘ఆరోగ్యం భాస్కరాధిచ్ఛేత్‌’ అంటే ఆరోగ్యాన్ని భాస్కరుడు ప్రసాదిస్తాడని అర్థం. అందుకే రథసప్తమినే ఆరోగ్య సప్తమి అనికూడా అంటారు. ఈ రోజు చేసిన సూర్యుడి ఆరాధనా, దానధర్మాల వల్ల ఈ జన్మలోనేకాదు గడిచిన జన్మల్లోనూ తెలిసీతెలియక చేసిన పాపాలన్నీ పరిహారమవుతాయని ప్రతీతి.

ఇలా చేయాలి…

సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి జిల్లేడాకులు వేసిన నీటితో స్నానం చేయాలి. స్నానం మధ్యలో తలమీద ఏడు జిల్లేడాకులూ రేగు పండ్లూ పెట్టుకుంటారు. జిల్లేడుకు సంస్క తంలో అర్క అని పేరు. సూర్యుడి సహస్ర నామాల్లో అర్క ఒకటి. అలాగే రేగుపండు సూర్యనారాయణుడికి ప్రీతికరమైందని చెబుతారు. అందుకే రథసప్తమినాడు ఆ రెండూ తలమీద పెట్టుకుని స్నానంచేసి, ఆదిత్య హ దయాన్ని పారాయణ చేయడం వల్ల కోటి రెట్లు పుణ్యం లభిస్తుందన్నది పెద్దల మాట.

ప్రతక్ష భగవానుడు పరమాన్న ప్రియుడు. అందుకే రథసప్తమినాడు సూర్యుడికి కొత్తబియ్యంతో క్షీరాన్నాన్ని వండుతారు.

చిక్కుడాకుల్లో దాన్ని పెట్టి దివాకరుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. చిక్కుడు కాయలతో రథాన్ని చేసి, అందులో ఎర్రచందనాన్ని కలిపి తయారుచేసిన అక్షతలను ఉంచి సూర్యభగవానుడిని ఆవాహన చేస్తారు. అనంతరం పూలూ పండ్లూ పత్రి మొదలైనవాటితో ఆయన్ను అర్చిస్తారు. సూర్యుడికి ప్రీతికరమైన రంగు ఎరుపు. అందుకే సూర్యజయంతి రోజు ఎర్రటి వస్త్రం, గోధుమలు, బంగారం, ఎర్రటి పువ్వులూ యథాశక్తిగా దానమివ్వాలి

పురాణాల్లో…

శ్రీ రాముడూ, శ్రీక ష్ణుడూ మొదలైనవారు సూర్యోపాసన చేశారని మన పురాణాలు పేర్కొంటున్నాయి. రామాయణంలో… శ్రీరాముడు రావణాసురుడిని సంహరించడానికి ముందు ఆదిత్యుణ్నే స్తుతించాడు. ఆ సందర్భంలో అగస్త్యముని శ్రీరాముడికి ఉపదేశించిన మంత్రమే ఆదిత్య హ దయం. అమూల్యమైన బీజాక్షరాలను తనలో పొదువుకున్న ఆదిత్య హ దయం ఎల్లవేళలా జయాన్నే కలిగిస్తుందని ప్రతీతి.

బాల్యంలో సూర్యుడికి అభిముఖంగా నిలబడి, అతడి గమనానికి ఏమాత్రం అడ్డురాకుండా వెనక్కివెనక్కి నడుస్తూ హనుమ విద్యాభాసాన్ని పూర్తిచేయడం విశేషం.

సూర్యుడి నుంచే ధర్మరాజు అక్షయపాత్రను పొందాడని తెలుపుతోంది మహాభారతం. శ్రీక ష్ణుడి కుమారుడైన సాంబుడికి కుష్ఠువ్యాధి సోకినప్పుడు సూర్యారాధనతోనే విముక్తి పొందాడు. భవిష్యోత్తర పురాణం ప్రకారం…మహాభారత సంగ్రామానికి సంసిద్ధులవుతున్న సమయంలో శ్రీక ష్ణుడు ధర్మరాజుతో సూర్యవ్రతాన్ని చేయించాడు.

సూర్యుడంటే ప్రక తి, ప్రక తంటే సూర్యుడు… అనేంతలా ప్రక తిలో మమేకమై, తిరిగి ఆ ప్రక తికే ప్రాణాధారమయ్యాడు సూర్యభగవానుడు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *