Breaking News
విలేకరులతో మాట్లాడుతున్న గణపతి సచ్చిదానంద స్వామిజీ

శుక్రవారం ఉత్తర తిరుపతి క్షేత్రం ప్రతిష్టాపన కుంభాభిషేకం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉత్తర తిరుపతి క్షేత్రం ప్రతిష్టాపన, కుంభాభిషేకం ఉంటుందని ప్రజలందరూ హాజరై స్వామివారి కపకు పాత్రులు కాగలరని శ్రీ అవధూత దత్త పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలిపారు. ఈ మేరకు గురువారం నగర శివారులోని గుపన్‌పల్లి గంగస్తాన్‌ ఫేస్‌ -2 లో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మానవులు తమ జీవన కాలంలో మూడు కుంభాభిషేకం చూస్తే జీవితం ధన్యం అవుతుందని, అలాంటిది ఏకకాలంలో భక్తుల కోసం ఒకే క్షేత్రంలో 5 దేవాలయాల కుంభాభిషేకం చూసి తరించే గొప్పఅదష్టం ఇందూర్‌ ప్రజల పుణ్య ఫలమని అన్నారు.

ప్రతిష్టాపనకు ముస్తాబైన ఆలయ గోపురం

ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, అత్యంత మహిమాన్వితమైన మరకత శ్రీ చక్రసమేత లక్ష్మీదేవి, మరకత శ్రీగణపతి, మరకత శ్రీఆంజనేయ స్వామి, శ్రీదత్తాత్రేయ స్వామి, శ్రీసదాశివ స్వామి వార్ల దేవాలయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. జగత్‌ కల్యాణానికి ఆ జగత్తు అంతా జగన్నాథులై ఏడు ఖండాలు సంచరించి తమ పీఠ శాఖలు నెలకోల్పడం జరిగిందన్నారు. గతంలో తాను 1997 సంవత్సరంలో ఇందూరు వచ్చానని అనఘాస్టమీ వ్రతం జరిపించడం సంవత్సరంలో రెండోసారి ఇందూరు వచ్చినప్పుడు ఈ క్షేత్రాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. తిరిగి 2007 సంవత్సరంలో దాదాపు మూడు ఎకరాల విస్తీర్ణం ఉన్న భూమిపూజ నిర్వహించి ఎక్కడాలేని విధంగా అత్యంత మహిమాన్వితమైన ఆలయ నిర్మాణానికి పూనుకోవడం జరిగిందన్నారు.

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అపూర్వ రీతిలో గులాబి రంగు ధోల్పూర్‌ రాతితో నిర్మాణం జరిగిందన్నారు. ఢిల్లీ అహ్మదాబాద్‌లోని విశిష్ట అక్షరధామ్‌ ఆలయ ఆర్కిటెక్చర్‌ విపుల్‌ త్రివేది చే ఆలయ నిర్మాణం జరిగిందన్నారు. ఉత్తర తిరుపతి క్షేత్రంగా నామకరణం చేయడం జరిగిందన్నారు. ఈ ప్రతిష్ట వారం రోజుల్లో ప్రతినిత్యం భక్తులకు అన్నదానం వైద్య సేవ దివ్య నామసంకీర్తన లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వేల సంఖ్యలో హాజరు కానున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మంచినీటి వసతి కల్పించడం జరిగిందన్నారు. భక్తులు క్యూలో వచ్చి దర్శనం చేసుకోవాలని కోరారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యక్రమాలు ఉంటాయని, మధ్యాహ్నం ఒంటిగంట నుండి అన్నప్రసాద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సమావేశంలో దత్త పీఠా ఉత్తరాధిపతి శ్రీ శ్రీ విజయ్‌ ఆనంద తీర్థ స్వామీజీ, సంపత్‌, గిరి తదితరులు పాల్గొన్నారు.

Check Also

28, 29 తేదీల్లో సూపర్ స్పైడర్స్ కు వ్యాక్సినేషన్

నిజామాబాద్‌, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రేషన్ షాప్ డీలర్లు, ఎల్‌పిజి డిస్ట్రిబ్యూటర్లు, పెట్రోల్ బంకులు, ...

Comment on the article