Breaking News

Daily Archives: February 16, 2019

ఐక్యరాజ్యసమితి సమ్మిట్‌లో ప్రసంగించనున్న ఎంపి కవిత

నిజామాబాద్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవితకు మరో అరుదైన గౌరవం లభించింది. యునైటెడ్‌ నేషన్స్‌ గ్లోబల్‌ కాంపాక్ట్‌ స్థానిక సంస్థ, గ్లోబల్‌ నెట్‌ వర్క్‌ ఇండియా మార్చి 1వ తేదీన న్యూడిల్లీలో నిర్వహిస్తున్న లింగ సమానత్వ సమ్మిట్‌ (జిఇఎస్‌ 2019) లో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం అందింది. ఎంపి కవిత ఆలోచనలు, లింగ సమానత్వం కోసం చేస్తున్న ప్రయత్నాలు, ఎస్‌డిజి లక్ష్యాల సాధన కోసం చేస్తున్న ప్రయత్నాలను గుర్తించి సమ్మిట్‌కు ఆమెను ఎంపిక చేశారు. సమ్మిట్‌ ...

Read More »

అమర జవాన్లకు నివాళి

నిజామాబాద్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత రెండ్రోజుల క్రితం కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ శనివారం సాయంత్రం ఆర్యసమాజము, రాధాకృష్ణ పాఠశాల సంయుక్తంగా విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భారత జవాన్లకు మద్దతుగా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీ ఆర్యసమాజం నుంచి గోల్‌హనుమాన్‌, జెండాగల్లి, మార్కండేయ మందిరం మీదుగా కొనసాగింది. విద్యార్థులు జాతీయ జెండాలు చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్‌, ఆచార్య వేదమిత్ర, సునీత, యోగా సిద్దిరాములు, ప్రవీణ్‌, ...

Read More »

అమరవీరులకు ఘననివాళి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జమ్ము కాశ్మీర్‌ లో జరిగిన ఉగ్రవాద ఘటనలో అమరవీరులకు నిజామాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ ఘననివాళి అర్పించింది. ఉగ్రదాడికి నిరసనగా నిజామాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రెస్‌ క్లబ్‌ నుంచి ఎల్లమ్మగుట్టచౌరస్తా వరకు ర్యాలీ జరిగింది. అమర జవానుల ఆత్మ శాంతి కలగాలని ప్రెస్‌క్లబ్‌ సభ్యులు ర్యాలీలో పాల్గొని అమర జవానులకు నివాళులు అర్పించారు. కొవ్వొత్తుల ర్యాలీలో నిజామాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు పులగం దేవిదాస్‌, ప్రధాన కార్యదర్శి ...

Read More »

130 కోట్ల ప్రజలు దోపిడీకి గురవుతున్నారు…

నిజామాబాద్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మందుల కొనుగోలుతో 130 కోట్ల ప్రజలు దోపిడీకి గురవుతున్నారని, మందుల ధరల దాడులను అరికట్టేలా ప్రభుత్వం డ్రగ్‌ పాలసీని రూపొందించాలని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ వ్యవస్థాపక అధ్యక్షులు పి.ఆర్‌.సోమాని వెల్లడించారు. ఈ మేరకు శనివారం నగరంలోని స్థానిక హోటల్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మందుల తయారీ దారులు తయారీకి అయిన ఖర్చు కంటే 3000% శాతం వరకు రిటైల్‌ రంగ వ్యాపారులు ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. ...

Read More »

భారత జవాన్లకు అశ్రునివాళి

రెంజల్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాశ్మీర్‌లో సిఆర్పీఫ్‌ జవాన్లఫై జరిగిన దాడికి నిరసనగా శనివారం మండలంలోని తాడ్‌ బిలోలి, నీలా, కళ్యాపూర్‌, కందకుర్తి గ్రామల్లోని యువకులు జాతీయ పతాకం, కొవ్వొత్తులతో గ్రామాల్లోని ప్రధాన వీధులగుండా ర్యాలీ నిర్వహించారు. పాకిస్థాన్‌ ప్రధానమంత్రి, ఉగ్రవాది మసూద్‌ అజహర్‌ల దిష్టి బొమ్మలను, పాకిస్థాన్‌ జెండాను దగ్ధం చేశారు. అమర జవాన్లకు నివాళులు అర్పించి మౌనం పాటించారు. అమర జవాన్ల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. నేరుగా పోరాడే ధైర్యం లేకనే దొంగచాటుగా ఇలాంటి దాడులకు ...

Read More »

17న అవయవదాన మహాసంకల్పం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉద్యమ రథసారథి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదినం సంధర్భంగా ఫిబ్రవరి 17 నాడు 31 జిల్లాలలో తెలంగాణ జాగతి, టీ న్యూస్‌, నమస్తే తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో అవయవదాన మహా సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సంవత్సరం పాటూ జరిగే ఈ మహా సంకల్ప కార్యక్రమాన్ని 17న ఆదివారం హైదరాబాద్‌లో జాగతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత, టీ న్యూస్‌ ఎండీ, రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్‌ ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌, ...

Read More »

ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. శనివారం కార్మిక శాఖ ఉప కమిషనర్‌ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి శ్రమయోగి మన్‌ ధన్‌ పింఛన్‌ పథకం అవగాహన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. నిరుపేదలు సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. పథకాన్ని గ్రామస్థాయి వరకు తీసుకొని పోయి అసంఘటిత కార్మికులకు ప్రయోజనం కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ...

Read More »

క్యాలెండర్‌ ఆవిష్కరణ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల శనివారం క్యాంప్‌ కార్యాలయంలో దుబ్బ శ్రీ వీరశైవ సంఘం క్యాలెండర్‌ ఆవిష్కరించారు. అనంతరం గాజుల్‌పేట్‌ నాయి బ్రాహ్మణ సంఘం క్యాలెండర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కుల సంఘాలకు క్యాలెండర్‌ ఉండడం మంచిదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కులవత్తులను ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో వీరశైవ, నాయిబ్రాహ్మణ కుల సంఘ ప్రతినిధులు, తెరాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More »

ఉగ్రవాద దిష్టిబొమ్మ దగ్దం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జమ్మూ కాశ్మీర్‌ లోని పుల్వామా జిల్లాలో దేశ రక్షణ కోసం కషి చేసే సైనికులపై ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో దాడి చేసి 49 మంది జవానులు వీరమరణం పొందటానికి కారణమైన ఉగ్రవాదుల దుశ్చర్యను నిరసిస్తూ శనివారం ఉదయం నిజామాబాదు బస్టాండ్‌ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఉగ్రవాదుల చర్యను నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్‌ బాబు మాట్లాడుతూ ఉగ్రవాదులు దొంగచాటుగా ...

Read More »

గ్రామ పంచాయతీల పరిశీలన

రెంజల్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాలపై క్షేత్రస్థాయి పరిశీలన కొరకు ఢిల్లీ నుండి వచ్చిన డాక్టర్‌ దివ్య, సమద్ధి ప్రత్యేక బందం శనివారం మండలంలోని బాగేపల్లి బోర్గాం గ్రామాల్లో పర్యటించి గ్రామీణ అభివద్ధి, పంచాయతీ రాజ్‌ పథకాల అమలుపై పర్యవేక్షణ నిర్వహించారు. గ్రామ పంచాయతీల తీరు, గ్రామాల్లో పర్యటించి పెన్షన్లు, ఉపాధి హామీ, మరుగుదొడ్లు నిర్మాణం వంటి పనులపై గ్రామాల్లో విచారణ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గ్రామాల్లో అమలు విధానంపై ...

Read More »

హాసకొత్తూర్‌లో సాంఘిక బహిష్కరణ

కమ్మర్‌పల్లి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కమ్మర్‌పల్లి మండలంలోని హాసకొత్తూర్‌ గ్రామంలో ఎస్‌సి మాదిగ సంఘం సభ్యులపై గ్రామ కమిటీ సాంఘిక బహిష్కరణ విధించింది. ఈ విషయం పై కమ్మర్పల్లి ఎస్‌ఐ మురళి తెలిపిన ప్రకారం … హాసకొత్తూర్‌ గ్రామంలో ఎస్‌సి మాదిగ సంఘం నుండి ఇటీవలే 20 మంది సభ్యులు విడిపోయి మరో సంఘంగా ఏర్పడ్డారు. అయితే గ్రామంలో ప్రతి సంఘం నుంచి గ్రామకమిటీలోకి సభ్యున్నీ పంపడం వీలుకాదని చెప్పి ప్రాధేయపడ్డామని బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ...

Read More »

మద్దతు ధర కల్పించాలి

రెంజల్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పసుపు, ఎర్ర జొన్న పంటలకు మద్దతు ధర ఇవ్వాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతుంటే ప్రభుత్వం రైతులను మాత్రం అరెస్టులు చేస్తూ అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గపు చర్యఅని సిపిఐ ఎంఎల్‌ నాయకులు నాసిర్‌ రాజేశ్వర్‌ అన్నారు. గత కొన్ని రోజులుగా రైతులు మామిడి పల్లి చౌరస్తాలో రైతు మద్దతు ధర కల్పించాలని దీక్షకు దిగడంతో రైతులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలించడం సరికాదన్నారు. కమ్మర్‌పల్లి, మోర్తాడ్‌ రైతులను ముందస్తుగా అరెస్టు ...

Read More »

త్రివేణి సంగమంలో పాపవ్వ అస్తికలు నిమజ్జనం

రెంజల్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తల్లి ఇటీవలే స్వర్గస్తులైన విషయం తెలిసిందే. కాగా పాపవ్వ అస్థికలను శనివారం మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమంలో కలిపారు. పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సోదరుడు శంభురెడ్డి సమక్షంలో అస్థికలను గోదావరిలో నిమజ్జనం చేశారు.

Read More »

నేరుగా పోరాడే ధైర్యం పాకిస్థానీలకు లేదు

రెంజల్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాకిస్తాన్‌ కు భారతదేశంపై నేరుగా పోరాడే ధైర్యం లేక దొంగచాటుగా ఇలాంటి దాడులకు పాల్పడుతుందని పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరముందని బిజెపి మండల అధ్యక్షుడు మేక సంతోష్‌ అన్నారు. శనివారం సాటాపూర్‌ చౌరస్తాలో రెంజల్‌ మండల బిజెపి శాఖ ఆధ్వర్యంలో పాకిస్థాన్‌ జెండాను తగలబెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడి పిరికిపందల చర్య అని. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల ఆత్మ శాంతించాలన్నారు. ...

Read More »

రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

ఆర్మూర్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని మానస హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి బేస్‌బాల్‌ పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల కరస్పాండెంట్‌ మానస గణేష్‌ తెలిపారు. గత నెలలో నిర్వహించిన బేస్‌బాల్‌ పోటీలలో మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగిందన్నారు. అండర్‌ – 16 బాలికల విభాగంలో రుచిత, శ్రీనిధి, బాలుర విభాగంలో సాయిరాం, రాకేష్‌, సాయిచరణ్‌, ప్రవీణ్‌ ఎంపికయ్యారని, ఆదివారం జగిత్యాలలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారని మానస గణేశ్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో ...

Read More »

రైతాంగ పోరాటాలను తీవ్రతరం చేస్తాం

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతాంగ ఉద్యమనేత, మండల నాయకుడు, అమరుడు, కామ్రేడ్‌ బుడ్డల సత్యం సంస్మరణ సభ శనివారం కోరటపల్లి గ్రామంలో అఖిలభారత రైతుకూలి సంఘం నిజామాబాద్‌ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆకుల పాపయ్య మాట్లాడారు. కామ్రేడ్‌ సత్యం రైతు కూలీ సంఘం ఉద్యమంలో అనేక పోరాటాలు నిర్వహించారని, భూమి పోరాటాల్లో ఆయన పాత్ర కీలకమైందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల ఫలితమే నేడు ...

Read More »

వీర జవాన్‌లకు నివాళి

బీర్కూర్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కిష్టపూర్‌ గ్రామంలో విద్యార్థులు శనివారం వీరజవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు. పుల్వామాలో మన వీర జవాన్లపై ఉగ్రదాడిని ఖండిస్తూ పాఠశాల విద్యార్థులు జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించి నివాళులు అర్పించారు. వీర జవాన్‌ అమర్‌ రహే అంటూ నినాదాలు చేస్తు ర్యాలీ నిర్వహించారు. జవాన్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నినదించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పుల్లెన్‌ బాబూరావు, మాజీ సర్పంచ్‌ గంగొండ, ...

Read More »

జాతీయ రహదారుల దిగ్బంధం, వంటావార్పు

ఆర్మూర్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎర్ర జొన్నలు 3 వేల 500 రూపాయలు, పసుపు పంటను 15 వేల రూపాయలకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు రెండు దఫాలుగా ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం కానీ అధికారులు గాని స్పష్టమైన హామీలు ఇవ్వకపోవడంతో శనివారం రైతులు జాతీయ రహదారుల దిగ్బంధం, వంటావార్పు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌ జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్ల సిఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది శుక్రవారమే ...

Read More »

మంత్రులు ఎవరు..? 19 తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు నిర్ణయం

స్పెషల్‌ కరస్పాండెంట్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 19న తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి తన నిర్ణయాన్ని తెలిపారు సిఎం. 19న మాఘశుద్ధ పౌర్ణమి మంచి ముహూర్తం కావడంతో ఆ రోజు ఉదయం పదకొండున్నర గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండనుంది. నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలుజారీచేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతమున్న సిఎం ...

Read More »