Breaking News

Daily Archives: February 17, 2019

ఎంఆర్‌పిఎస్‌ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు లింగం మృతి

కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత నాయకుడు, ఎంఆర్‌పిఎస్‌ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు బోకె లింగం అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందారు. లింగం కామారెడ్డి మునిసిపల్‌ కార్యాలయంలో విద్యుత్‌ సెక్షన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం కామారెడ్డి దళితవాడలోని ఆయన ఇంటి వద్ద నాయకులు అంత్యక్రియల్లో పాల్గొని నివాళులు అర్పించారు. మృతుని కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు వేముల బలరాం, లక్ష్మణ్‌, శంకర్‌, సాయిలు, బాగయ్య, బాలమణి, సత్తయ్య, శివయ్య, మల్లయ్య, ...

Read More »

డిసిసి అధ్యక్షునికి సన్మానం

కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కాంగ్రెస్‌ జిల్లా అద్యక్షునిగా ఎన్నికైన మాజీ మునిసిపల్‌ ఛైర్మన్‌ కైలాష్‌ శ్రీనివాస్‌రావును ఆదివారం వినాయక్‌నగర్‌ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. కైలాష్‌ శ్రీనివాస్‌రావు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని అభిలషించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు గజవాడ శంకరయ్య, కంకణాల ఆంజనేయులు, రామ్మోహన్‌, రవి, తులసీదాస్‌, సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఘనంగా సేవాలాల్‌ జయంతి వేడుకలు

కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా గిరిజనాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పిట్లం బంజారా భవన్‌లో సంత్‌ సేవాలాల్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గిరిజనుల ఆరాధ్య దైవం సంత్‌సేవాలాల్‌ చూపిన ఆదర్శ బాటలో నడవాలని సూచించారు. గిరిజనుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, తాండాలను గ్రామ పంచాయతీలుగా చేసి గిరిజనుల అభివృద్దికి దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గిరిజన నాయకులు పాల్గొన్నారు.

Read More »

నర్సరీలను పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడలోని నర్సరీలను ఆదివారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పరిశీలించారు. నర్సరీల్లో మొక్కల పెంపకం తీరుపై ఆరా తీశారు. ఏయే నర్సరీలకు ఎంత లక్ష్యాన్ని నిర్దేశించారు, ఎన్ని మొక్కలు పెంచుతున్నారనే అంశాలపై సమీక్షించారు. హరితహారాన్ని విజయవంతం చేయాలని, నర్సరీలకు ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట అధికారులు ఉన్నారు.

Read More »

కామారెడ్డి పట్టణ బంద్‌కు బిజెపి మద్దతు

కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పుల్వామా వద్ద సైనికులపై జరిగిన టెర్రరిస్టు దాడికి నిరసనగా సోమవారం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బంద్‌కు బిజెపి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి రమణారెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలో జరిగిన నియోజకవర్గ స్థాయి బిజెపి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు వ్యాపార సంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్టు తెలిపారు. ఎండనక, వాననక 24 గంటలు ...

Read More »

18న అమర జవాన్లకు అక్షరాంజలి

నిజామాబాద్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరిదా రచయితల సంఘం, తెలంగాణ రచయితల సంఘం, నిజామాబాద్‌ సంయుక్త నిర్వహణలో 18న పుల్వామా అమర జవాన్లకు అక్షరాంజలి కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు అధ్యక్ష, కార్యదర్శులు ఘనపురం దేవేందర్‌, కాసర్ల నరేశ్‌రావు, నరాల సుధాకర్‌, గుత్ప ప్రసాద్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 18వ తేదీ సోమవారం సాయంత్రం 5.30 గంటలకు, స్థానిక కేర్‌డిగ్రీ కళాశాలలో కార్యక్రమం ఉంటుందని, కవులు, కవయిత్రులు, సాహిత్య ప్రియులు, సైనికుల పట్ల ఆర్ద్రత కలిగిన సహదయులందరు పాల్గొని ...

Read More »

అర్హుల జాబితా సిద్దం చేస్తున్న వ్యవసాయాధికారులు

నందిపేట్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌నిధి పథకంలో బాగంగా ఆదివారం చింరాజ్‌పల్లి, మల్లారం, బాద్గుణ, సిర్పూర్‌, అన్నారం, నూత్‌పల్లి, గంగసముందర్‌ గ్రామాలలో కిసాన్‌ సమ్మాన్‌ నిధి అర్హుల జాబితాను గ్రామపంచాయితి సిబ్బంది, రైతుల సమక్షంలో మండల వ్యవసాయ అధికారులు తెలియపరచి అభ్యర్థనలు స్వీకరించారు. ప్రభుత్వ ఉద్యోగులు, రేషన్‌ కార్డ్‌ లేనివారిని అనర్హులుగా తెలియపరిచి వారిని జాబితా నుండీ తొలగించడం జరిగిందని నందిపేట్‌ మండల వ్యవసాయ అధికారి సాయికష్ణ తెలిపారు.

Read More »

బిసి విద్యార్థి సంఘం క్యాలెండర్‌ ఆవిష్కరణ

ఆర్మూర్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిసి విద్యార్థి సంఘం అధ్యక్షుడు ప్రశాంత్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో శనివారం బిసి విద్యార్థి సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఆర్మూర్‌ పట్టణంలో ఆర్మూర్‌ డివిజన్‌కు సంబంధించిన క్యాలెండర్‌ను తెరాస నాయకులు, ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి, వైస్‌ ఛైర్మన్‌ లింగాగౌడ్‌ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ బిసిలకు అండగా నిలబడిన ఏకైక ప్రభుత్వం టిఆర్‌ఎస్‌ ప్రభుత్వమని స్పష్టం చేశారు. బిసి విద్యార్థుల కోసం 119 బిసి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి మరో ...

Read More »