Breaking News
సమావేశంలో మాట్లాడుతున్న రమణారెడ్డి

కామారెడ్డి పట్టణ బంద్‌కు బిజెపి మద్దతు

కామారెడ్డి, ఫిబ్రవరి 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పుల్వామా వద్ద సైనికులపై జరిగిన టెర్రరిస్టు దాడికి నిరసనగా సోమవారం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బంద్‌కు బిజెపి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి రమణారెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలో జరిగిన నియోజకవర్గ స్థాయి బిజెపి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

సోమవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు వ్యాపార సంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్టు తెలిపారు. ఎండనక, వాననక 24 గంటలు దేశ సరిహద్దుల్లో శ్రమిస్తు ఇంతటి స్వేచ్చాయుతమైన ప్రజాజీవితానికి కారకులైన 44 మంది జవాన్లను టెర్రరిస్టులు మావనబాంబుతో హతమార్చడం గర్హణీయమన్నారు. వారి ఆత్మకు శాంతికలగాలని, వారి కుటుంబ సభ్యులకు దేశ ప్రజలు అండగా ఉంటారని పేర్కొన్నారు. ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు అన్ని రంగాల వారు సోమవారం రోడ్లమీదకు వచ్చి స్వచ్చందంగా నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మోడి ప్రభుత్వం దాడికి ప్రతిదాడి తప్పకుండా చేస్తుందని, ఇప్పటికే ప్రతీకార దాడులు ఆరంభమయ్యాయని పేర్కొన్నారు. టెర్రరిజాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తామని అన్నారు.

కార్యక్రమంలో నాయకులు తేలు శ్రీనివాస్‌, కుంట లక్ష్మారెడ్డి, నరేందర్‌ రెడ్డి, శ్రీనివాస్‌, రమేశ్‌, విపుల్‌, ప్రవీణ్‌, మోహన్‌రెడ్డి, సంపత్‌, వెంకట్‌రెడ్డి, సురేశ్‌, అంజల్‌రెడ్డి, భూపాల్‌, సిద్దు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

లాక్‌డౌన్ ప‌రిశీలించిన ఎస్‌పి శ్వేత‌

కామారెడ్డి, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కరోనా విజృంభణ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ...

Comment on the article