Breaking News

18న అమర జవాన్లకు అక్షరాంజలి

నిజామాబాద్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరిదా రచయితల సంఘం, తెలంగాణ రచయితల సంఘం, నిజామాబాద్‌ సంయుక్త నిర్వహణలో 18న పుల్వామా అమర జవాన్లకు అక్షరాంజలి కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు అధ్యక్ష, కార్యదర్శులు ఘనపురం దేవేందర్‌, కాసర్ల నరేశ్‌రావు, నరాల సుధాకర్‌, గుత్ప ప్రసాద్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

18వ తేదీ సోమవారం సాయంత్రం 5.30 గంటలకు, స్థానిక కేర్‌డిగ్రీ కళాశాలలో కార్యక్రమం ఉంటుందని, కవులు, కవయిత్రులు, సాహిత్య ప్రియులు, సైనికుల పట్ల ఆర్ద్రత కలిగిన సహదయులందరు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. అతిథులుగా నిజామాబాద్‌ ఆకాశవాణి ఎఫ్‌.ఎం. కేంద్రం సంచాలకులు సూర్య ప్రకాశ్‌, నిజామాబాద్‌, తెలంగాణ గ్రామీణ బ్యాంకు, రీజినల్‌ మేనేజర్‌ పి.ఆర్‌.వి. రామచందర్‌ రావు విచ్చేస్తున్నట్టు తెలిపారు.

Check Also

28, 29 తేదీల్లో సూపర్ స్పైడర్స్ కు వ్యాక్సినేషన్

నిజామాబాద్‌, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రేషన్ షాప్ డీలర్లు, ఎల్‌పిజి డిస్ట్రిబ్యూటర్లు, పెట్రోల్ బంకులు, ...

Comment on the article