Breaking News

Daily Archives: February 19, 2019

విద్యార్థులకు నులి పురుగులు నివారణ మాత్రలు

రెంజల్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ నులి నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్భంగా మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు పాఠశాల విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ క్రిస్టీనా మాట్లాడుతూ రెంజల్‌ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లోని పాఠశాల విద్యార్థులకు మాత్రలు వేయడం జరిగిందని, విద్యార్థులందరూ వేసుకోవాలని సూచించారు. దూపల్లి, సాటాపూర్‌ గ్రామాల్లో సర్పంచ్‌లు సాయరెడ్డి, వికార్‌ పాషా లు విద్యార్థులకు ...

Read More »

ఘనంగా శివాజీ జయంతి వేడుకలు

రెంజల్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి హిందూ ధర్మాన్ని పరిరక్షించి ఇతర మతాలను గౌరవించిన ఘనత ఒక్క చత్రపతి శివాజీకి దక్కుతుందని హైందవ యూత్‌ సభ్యులు అన్నారు. మంగళవారం మండలంలోని తాడ్‌ బిలోలి, బొర్గం, నీలా, కందకుర్తి, రెంజల్‌, దూపల్లి, కళ్యాపూర్‌, సాటా పూర్‌ గ్రామాల్లో శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పూజ కార్యక్రమాలు నిర్వహించి జై శివాజీ అంటూ పలు వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ తెలంగాణ శంకర్‌, ...

Read More »

హమాలీ యూనియన్‌ రాష్ట్ర సభలు విజయవంతం చేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ స్టేట్‌ సివిల్‌ సప్లయ్‌ హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రథమ మహాసభలను విజయవంతం చేయాలని మంగళవారం అందుకు సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రదాన కార్యదర్శి దశరథ్‌, హమాలీసంఘం నాయకులు మాట్లాడారు. హైదరాబాద్‌లోని షాలీమార్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఈనెల 21న రాష్ట్ర ప్రథమ మహాసభలు జరుగుతాయన్నారు. కార్మికుల హక్కులు, చట్టాలు, పెండింగ్‌ సమస్యల పరిష్కారంపై సభలో చర్చిస్తారని పేర్కొన్నారు. భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. సభలకు కార్మికులు ...

Read More »

రక్తదానంతో నిండు జీవితాన్ని నిలిపినట్లే

కామారెడ్డి, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రక్తదానంతో నిండు జీవితాన్ని నిలిపినట్లేనని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని తాడ్వాయి మండలం ఎండ్రియాల్‌ గ్రామంలో ఇండియన్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా శాఖ నేతృత్వంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 70 మంది గ్రామస్తులు రక్తదానం చేశారు. ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. మనిషికి మరో జన్మ ఇవ్వడమంటే రక్తదానం చేయడమేనని, ఇంతటి పుణ్యకార్యంలో ...

Read More »

ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

కామారెడ్డి, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంతోపాటు జిల్లాలోని ఆయా గ్రామాల్లో మంగళవారం ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శివాజీ విగ్రహానికి, చిత్రపటాలకు పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శివాజీ పౌరుషాన్ని, యుద్ద పటిమను ప్రశంసించారు. యువతకు శివాజీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More »

ప్రజలకు ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాలపై అవగాహన

కామారెడ్డి, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఓటు వేసే విధానంపై ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాల పనితీరుపై ప్రజల అవగాహన కోసం బుధవారం నుంచి నియోజకవర్గానికి రెండు మోబైల్‌ బృందాల చొప్పున గ్రామాల్లో పర్యటిస్తాయని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం స్థానిక ఏఎంసి గోదాములో యంత్రాల స్ట్రాంగ్‌ రూంలను ఆయా రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో తెరిచారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాలకు గాను ఒక్కో నియోజకవర్గానికి నాలుగు ఈవిఎం, నాలుగు వీవీప్యాట్‌ యంత్రాల ...

Read More »

ఆరోగ్యంగా ఉంటేనే చదువులో రాణించగలం

కామారెడ్డి, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్యంగా ఉన్నపుడే శారీరకంగా, మానసికంగా బలంగా ఉంటామని, చదువులో రాణించగలమని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. మంగళవారం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి మండలం గర్గుల్‌ పాఠశాలలో విద్యార్థులకు కలెక్టర్‌ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమను తాము పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలన్నారు. జిల్లాలోని 2 లక్షల 50 వేల 490 మంది 1-19 సంవత్సరాల విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ...

Read More »

ఆర్టీవో కానిస్టేబుల్‌ ఆత్మహత్య యత్నం

కామారెడ్డి, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఆర్‌టిఓ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పడుగుల సుదాకర్‌ మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. గమనించిన సిబ్బంది అతన్ని చికిత్స కోసం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విదుల్లో ఉండగానే ఆత్మహత్యకు సుధాకర్‌ ఎందుకు పాల్పడ్డాడనేది పోలీసులు విచారణ చేస్తున్నారు. అధికారుల వేధింపులా, కుటుంబ కలహాలా ఆత్మహత్యకు కారణమనే కోణంలో కేసు విచారణ జరుపుతున్నారు.

Read More »

జర్నలిస్టుల కుటుంబాలకు చెక్కుల పంపిణి

నిజామాబాద్‌ ప్రతినిధి, ఫిబ్రవరి 19 జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి ఇచ్చే ఆర్థిక సహాయానికి ఎంపికైన లబ్ధిదారులకు రేపు చెక్కుల పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ ఆధ్వర్యంలో తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ (టియుడబ్లుజే హెచ్‌-143) ఆధ్వర్యంలో జర్నలిస్టుల కుటుంబాలకు చెక్కులను మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ సర్‌, ఆందోల్‌ ఎమ్మెల్యే, జర్నలిస్ట్‌ ఉద్యమ నేత చంటి క్రాంతి కిరణ్‌ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. సంక్షేమ నిధి ఆర్థిక సహాయం కోసం వచ్చిన ...

Read More »

పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించిన ఏసిపి

రెంజల్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రెంజల్‌ పోలీస్‌ స్టేషన్‌ను మంగళవారం బోధన్‌ ఏసిపి రఘు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్‌ స్టేషన్‌లోని పలు రికార్డులను పరిశీలించి సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట రూరల్‌ సిఐ షకీర్‌ ఆలీ, ఎస్సై శంకర్‌ సిబ్బంది ఉన్నారు.

Read More »

జిల్లాస్థాయికి ఎంపికైన విద్యార్థులు

ఆర్మూర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండల స్థాయి భౌతికశాస్రం టాలెంట్‌ టెస్టులో విద్యార్థులు జిల్లాస్థాయికి ఎంపికయ్యారు. ఆర్మూర్‌ మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పిప్రిగ్రామం జడ్పిహెచ్‌ఎస్‌ భౌతికశాస్రం టాలెంట్‌ టెస్ట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల స్థాయి టాలెంట్‌ టెస్ట్‌ కార్యక్రమాలకు స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జిహెచ్‌ఎం లక్ష్మి నరహరి అధ్యక్షతన వహించారు. కార్యక్రమంలో టాలెంట్‌ టెస్ట్‌ నిర్వాహణకు తోడ్పడిన వారు ఎఫ్‌పిఎస్‌టి, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.రఘునాథ్‌, ఉపాధ్యక్షులు జగదీశ్వర్‌, ఆర్మూర్‌ డివిజినల్‌ అధ్యక్షులు శ్రీనివాస్‌, ...

Read More »

గ్రామస్తుల విరాళం

ఆర్మూర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పుల్వామా అమరవీరుల సహాయార్థం సుబిర్యాల గ్రామస్తులు తమ విరాళాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావుకు అందజేశారు. ఉగ్రదాడిలో అసువులు బాసిన అమరవీరుల కుటుంబాల సహాయార్థం ఆర్మూర్‌ మండలం సుబ్బిర్యాల గ్రామానికి చెందిన ప్రజలు 31 వేల 300 రూపాయలు విరాళానికి సంబంధించిన చెక్కును జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు కు అందచేశారు. జిల్లా కలెక్టర్‌ను చాంబరులో కలిసి చెక్కు అందించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటు రాంరెడ్డి, సాయిరెడ్డి, ముత్యంరెడ్డి, మోహన్‌రెడ్డి, అశ్విన్‌రెడ్డి, ...

Read More »

ఘనంగా శివాజీ జయంతి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతి వేడుకలు పురస్కరించుకొని మంగళవారం బిజెవైఎం నగర అధ్యక్షుడు రోషన్‌లాల్‌బోరా ఆధ్వర్యంలో శివాజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రోషన్‌ మాట్లాడుతూ హిందూ సమాజంకోసం శివాజీ చేసిన సేవలు ఎనలేనివని, యువత శివాజీని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని పేర్కొన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి చైతన్య కులకర్ణి, నరేశ్‌, సాయి, ప్రతాప్‌, మహేశ్‌, సంజీవ్‌, కార్యకర్తలు పాల్గొన్నారు. నిజామాబాద్‌ బార్‌ ...

Read More »

పేకాటరాయుళ్ల అరెస్టు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని ఖలీల్‌వాడిలో ఓ సిటీ స్కానింగ్‌ సెంటర్‌ పై అంతస్తులో మంగళవారం పేకాట ఆడుతున్న పదిమందిని అదుపులోకి తీసుకున్నట్టు టాస్క్‌ఫోర్సు సిఐ జగదీశ్‌ తెలిపారు. వారి వద్దనుంచి లక్ష 2 వేల 226 నగదు, పది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. సమగ్ర విచారణ కొరకు కేసును ఒకటో టౌన్‌కు బదిలీ చేసినట్టు సిఐ పేర్కొన్నారు. దాడిలో ఎస్‌ఐ సంతోష్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నట్టు తెలిపారు.

Read More »

మంత్రికి మానస గణేశ్‌ అభినందనలు

ఆర్మూర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు ప్రశాంత్‌ రెడ్డికి హైదరాబాద్‌లోని ఆయన స్వగ హంలో రజక సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మానస గణేష్‌ పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. శాలువాతో ఘనంగా సన్మానించారు. రాజ్‌ భవన్‌లో ప్రశాంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తుంటే చూడడం అదష్టంగా భావిస్తున్నామన్నారు. ప్రశాంత్‌ రెడ్డికి మంత్రి పదవి రావడం ప్రతిభకు దక్కిన పట్టంగా విధేయతకు దక్కిన గౌరవంగా, సమర్ధతకు దక్కిన గుర్తింపుగా ...

Read More »

నులిపురుగు మాత్రల పట్ల అపోహలు వద్దు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో 19 సంవత్సరాల లోపు పిల్లలకు పంపిణీ చేసే నులి పురుగు నివారణ మందుల పట్ల ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. మంగళవారం పోచమ్మగల్లి, పూలాంగ్‌ ప్రాథమిక పాఠశాలలో నులి పురుగుల మందుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలను ఆరోగ్యవంతంగా ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నులి పురుగు మందులను పిల్లలకు వేయడం ...

Read More »

గ్రామ స్వరాజ్యంలో సర్పంచ్‌లదే కీలకపాత్ర

నిజామాబాద్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ స్వరాజ్యం ఏర్పాటులో సర్పంచ్‌లదే కీలకపాత్ర అని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. నూతనంగా ఎంపికైన వార్డు మెంబర్లు, ఉపసర్పంచ్‌ సమిష్టి కషితో సర్పంచులు గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్‌ సూచించారు. సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి, డిచ్‌పల్లి మండలాలలో నూతనంగా ఎంపిక కాబడిన సర్పంచులకు ఐదు రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమాన్ని డిచ్‌పల్లిలోని సాంకేతిక శిక్షణ అభివద్ధి కేంద్రంలో మంగళవారం జిల్లా కలెక్టర్‌ ప్రారంభించి మాట్లాడారు. పంచాయతీ రాజ్‌ చట్టం ...

Read More »

ఘనంగా చత్రపతి శివాజీ జయంతి

ఎడపల్లి, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలం తానాకాలన్‌ గ్రామంలో చత్రపతి శివాజీ యూత్‌ ఆధ్వర్యంలో ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా తానాకలాన్‌ గ్రామసర్పంచ్‌ భాస్కర్‌రెడ్డి చత్రపతి శివాజీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి అనంతరం మాట్లాడారు. చత్రపతి శివాజీ మహారాజు నేటితరం యువతకు ఆదర్శమని అన్నారు. చత్రపతి శివాజీ మహారాజ్‌లోగల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని గ్రామస్తులకు సూచించారు. ముఖ్యంగా యువత ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, ...

Read More »

శ్రీరాంసాగర్‌తో సిరులు

నిజామాబాద్‌ ప్రతినిధి, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాకతీయ కాల్వ మరమ్మతులపై సర్కారు దష్టి రూ.వెయ్యి కోట్లతో చురుగ్గా సాగుతున్న పనులు జూన్‌ నుంచి పూర్తి ఆయకట్టుకు నీరందించేలా చర్యలు వచ్చే వానకాలం (ఖరీఫ్‌) సీజన్‌ నుంచి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు సిరులు కురిపించనున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో నిర్ధారిత ఆయకట్టు మొత్తానికి సాగునీరిచ్చేందుకు అధికార యంత్రాంగం శరవేగంగా పనులు చేస్తున్నది. ఐదు దశాబ్దాల చరిత్రలో నాలుగైదు లక్షల ఎకరాల ఆయకట్టుకు మించి సాగునీరివ్వని ఈ ప్రాజెక్టు.. వచ్చే వర్షాకాలం సీజన్‌ ...

Read More »

క్యాలెండర్‌ ఆవిష్కరణ

ఆర్మూర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కమ్మర్‌పల్లి మండలంలో మంగళవారం దేవ గాండ్లతెలికుల సంఘం క్యాలెండర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘ పెద్దలు మాట్లాడుతూ సమాజంలో వెనుకబడిన దేవ గాండ్లతెలికల సంఘం సభ్యులు అన్ని రంగాలలో రాణించాలన్నారు. ఐక్యతతో ఉండి హక్కుల కోసం రిజర్వేషన్లు కోసం పోరాడాలని అన్నారు. వెనుకబడిన గాండ్ల (గుజరాత్‌లో గాంచి) కులంలో జన్మించిన దేశ ప్రధానిగా ఎదిగిన నరేంద్ర మోదీ స్ఫూర్తితో గత పాలకులు గాండ్ల తెలికుల సంక్షేమాన్ని విస్మరించారని అన్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ ...

Read More »