Breaking News

రోడ్డు ప్రమాదంలో సాప్ట్‌వేర్‌ ఉద్యోగుల మృతి

కామారెడ్డి, ఫిబ్రవరి 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలం మేనూరు గ్రామ సమీపంలో సోమవారం పెట్రోల్‌ పంప్‌ వద్ద లారీ కారును ఢీకొన్న సంఘటనలో ఇద్దరు సాప్ట్‌వేర్‌ ఉద్యోగులు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్న గచ్చిబౌలికి చెందిన లక్ష్మినారాయణ (32), బీహార్‌కు చెందిన రాజన్‌ (26), విజయ్‌కుమార్‌, కోమల్‌సింగ్‌లు కారులో షిర్డీ వెళ్ళి హైదరాబాద్‌ తిరిగి వస్తున్నారు. మద్నూర్‌ సమీపంలో వీరి కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ప్రమాదంలో లక్ష్మినారాయణ, రాజన్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. విజయ్‌, కోమల్‌కు తీవ్రగాయాలు కాగా వారిని పోలీసులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ తరలించారు. మృత దేహాలను శవ పరీక్ష నిమిత్తం మద్నూర్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ సాజిద్‌ తెలిపారు.

Check Also

ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల ప్రణాళికలో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *