Breaking News

Daily Archives: February 26, 2019

కష్టపడి పనిచేస్తే పదవులు వాటంతట అవే వస్తాయి

కోరుట్ల, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కోరుట్లలోని పి.బి.గార్డెన్‌లో మంగళవారం ఆత్మీయ సన్మానం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో వార్‌ వన్‌ సైడే.. ఎంఐఎంతో కలుపుకుని మొత్తం 17 పార్లమెంట్‌ స్థానాలను గెలుస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వాన్ని ప్రజలు బలపరుస్తూ ఉన్నారని తెలిపారు. జగిత్యాల జిల్లా ఏర్పడ్డప్పుడు జిల్లా కు పెద్దన్నగా కొప్పుల ఈశ్వర్‌ ఉంటారని ఆనాడు చెప్పిన ...

Read More »

‘ఉజ్వల జ్యోతి’ మహిళల జీవితాల్లో వెలుగులు నింపింది

కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ మహిళ మోర్చా కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌ మండలం రామేశ్వరపల్లి గ్రామంలో కమలజ్యోతి సంకల్ప కార్యక్రమం రెడ్డి సంక్షేమ సంఘ భవనంలో మంగళవారం నిర్వహించటం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహిళ మోర్చా జాతీయ అధ్యక్షురాలు విజయ రహత్కర్‌, అతిధిగా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు విజయ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళ మోర్చా జాతీయ అధ్యక్షురాలు విజయ రహత్కర్‌ మాట్లాడుతూ గతంలో 70 ఏళ్ళు పాలించిన ...

Read More »

కస్తూర్బా పాఠశాల తనిఖీ

రెంజల్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం ప్రార్థన సమయంలో పాల్గొని ఉపాధ్యాయుల హాజరు పట్టిక పరిశీలించారు. అనంతరం పలు రకాల రికార్డులను పరిశీలించారు. పదవ తరగతి పరీక్షలో 100 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ మమత, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.

Read More »

ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

ఆర్మూర్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ బాలికల కళాశాలలో రేపటి నుండి జరుగబోయే ఇంటర్‌ పరీక్షలు వచ్చే నెల మార్చి13 వ తేదీ వరకు జరుగుతాయని ప్రిన్సిపాల్‌ అక్బర్‌ బేగం అన్నారు. ఆర్మూర్‌ ప్రభుత్వ జూనియర్‌ బాలికల కళాశాలలో 372మంది విద్యార్థులు ఉండగా, వారు అందరూ పలు కాలేజీ సెంటర్లలో పరీక్షలకు హాజరు కానున్నారు. ఆర్మూర్‌ ప్రభుత్వ కళాశాలలో 316 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా డిఐఇవో ...

Read More »