Breaking News

Daily Archives: February 27, 2019

ఎర్రజొన్న రైతులు ఆందోళన చెందవద్దు…

నిజామాబాద్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్లు, భవనాలు, రవాణా, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డికి ఆత్మీయ సన్మానం ఘనంగా జరిగింది. బుధవారం నిజామాబాద్‌లోని శ్రావ్యగార్డెన్‌లో జరిగిన కార్యక్రమానికి నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దుఃఖం దాచుకోవాలంటారు అలాగే సంతోషాన్ని పంచుకోవాలంటారు…కేసీఆర్‌కు జిల్లా ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. స్పీకర్‌, శాసన సభ వ్యవహారాలు మన జిల్లాకే వచ్చాయని, శాసన వ్యవస్థలను మనవాళ్ళే చూస్తుండటం మనకు గర్వ కారణం అన్నారు కవిత. ...

Read More »

గురుకుల పాఠశాల తనిఖీ

బీర్కూర్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండల కేంద్రంలోని బీసీ బాలుర గురుకుల పాఠశాలను తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి బుధవారం అకస్మీకంగా తనిఖీ చేశారు. కోటగిరి మండలంలోని గ్రామాలలో పలు కార్యక్రమాలలో పాల్గోని వస్తున్న స్పీకర్‌ బీర్కూర్‌ మండల కేంద్రంలోని బీసి బాలుర రెసిడెన్షియల్‌స్కూల్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, మెన ప్రకారం ఆహారం అందుతుందా అంటూ విద్యార్థులను వివరాలు అడిగారు. మెను ప్రకారమే అందుతున్నాయని విద్యార్థులు తెలపడంతో స్పీకర్‌ ...

Read More »

అమరవీరుల సంస్మరణ సభ కరపత్రాల ఆవిష్కరణ

కామరెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి గార్డెన్‌లో భజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించనున్న అమరవీరుల సంస్మరణ సభ కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా బిజెవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి, విహెచ్‌పి జిల్లా కార్యదర్శి రవి, పట్టణ అధ్యక్షుడు బాపురెడ్డి, భజరంగ్‌ దళ్‌ జిల్లా సంయోజక్‌ మహేశ్‌లు మాట్లాడారు. పుల్వామాలో ఉగ్రవాద దాడిలో చనిపోయిన వీరసైనికులను స్మరించుకుంటూ అమరవీరుల సంస్మరణ సభను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ యువతలో దేశభక్తిని ...

Read More »

ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ఆజాద్‌ వర్దంతి

కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం ఏఐఎస్‌ఎఫ్‌ ఆద్వర్యంలో చంద్రశేఖర్‌ ఆజాద్‌ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ ముదాం ప్రవీణ్‌ మాట్లాడుతూ 1906లో జన్మించిన ఆజాద్‌, భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ లాంటి దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ఒకరుగా నిలిచారని అన్నారు. చిన్న వయసులోనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని దేశం కోసం ప్రాణాలు అర్పించారని ప్రశంసించారు. అలాంటి వారు ఆదర్శప్రాయులని కొనియాడారు.

Read More »

జహీరాబాద్‌ ఎంపి అభ్యర్థిగా షబ్బీర్‌ అలీ

కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ పార్లమెంటు అభ్యర్థిగా షబ్బీర్‌ అలీ పేరును నిర్ణయిస్తు జిల్లా కాంగ్రెస్‌ కమిటీ తీర్మానం చేసింది. పార్టీ జిల్లా అద్యక్షుడు కైలాష్‌ శ్రీనివాస్‌రావు అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసినట్టు జిల్లా అధ్యక్షుడు తెలిపారు. జహీరాబాద్‌ పరిధిలోగల ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఈ మేరకు తీర్మానం చేసి అధిష్టానానికి పంపినట్టు తెలిపారు. షబ్బీర్‌ అలీతోపాటు మరో ఐదుగురు పేర్లను అదిష్టానానికి పంపినట్టు తెలిపారు. నిజామాబాద్‌ ఎంపిగా షబ్బీర్‌ ...

Read More »

ఇంటర్‌ పరీక్షల్లో నిమిషం నిబంధన ఎత్తివేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్‌ పరీక్షల్లో నిమిషం నిబందన విధించడం సరికాదని, దాన్ని ఎత్తివేయాలని టిఎన్‌ఎస్‌ఎప్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు, ఎన్‌ఎస్‌యుఐ జిల్లా నాయకుడు పృథ్వీరాజ్‌ పేర్కొన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి నిబందన తొలగించాలని డిమాండ్‌ చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ నిబందన వల్ల విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాన్ని తొలగించాలని డిమాండ్‌ ...

Read More »

పెండింగ్‌ సమస్యలు వెంటనే పూర్తిచేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టాదారు పాసుపుస్తకాలు, ఇతర పెండింగ్‌ సమస్యలను, గ్రామ రెవెన్యూ, మండల రెవెన్యూ ఆర్డీవోలు వెంటనే పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. వివిధ మండలాల వారిగా వచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కారాలపై మాట్లాడారు. ఫిర్యాదులను రిజిష్టర్‌లో నమోదు చేసుకొని వాటిని పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ వరకు కొత్త ఓటర్ల నమోదు కొనసాగుతుందని, పాత ఓటర్ల ...

Read More »

వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న వేసవిలో ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారులతో ఆయన సమీక్షించారు. మిషన్‌భగీరథ మండల ఏ.ఇలు, డి.ఇలు నీటి ఎద్దడిపై ప్రణాళిక రూపొందించాలన్నారు. మార్చి 15 నాటికి ఓహెచ్‌ఎస్‌ఆర్‌ నిర్మాణాలు, రిపేరు పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్తితిలో లీకేజీ సమస్య తలెత్తకూడదని చెప్పారు. ఇంటింటికి నల్లాలను, ప్లాట్‌ఫాం పనులను మార్చినాటికి పూర్తిచేయాలని పేర్కొన్నారు. సింగూరు జలాశయం ...

Read More »

మలేషియాలో పడరాని కష్టాలుపడి ఎట్టకేలకు స్వగ్రామం చేరిన బాదితుడు

నిజామాబాద్‌ ప్రతినిధి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జరిమానాతో పాటు, విమాన చార్జీలు చెల్లించి స్వదేశం చేర్చిన ఎంపీ కల్వకుంట్ల కవిత బాదితుడు నరేష్‌ను బుధవారం పరామర్శించిన జాగతి నాయకులు ఎంపీ కవితకు జీవితాంతం రుణపడి ఉంటామన్న బాదితుడి కుటుంబ సభ్యులు పొట్టకూటి కోసం మలేషియా వెళ్లి పడరాని కష్టాలు అనుభవించిన ఆ యువకుడు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నాడు. ఎంపీ కల్వకుంట్ల కవిత సహాయంతో ఆ యువకుడికి విముక్తి లభించింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్‌ కు చెందిన ...

Read More »

పరీక్ష కేంద్రం తనిఖీ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఈనెల 27వ తేదీ నుండి మార్చి 18వ తేదీ వరకు జరుగు ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో భాగంగా బుధవారం మొదటి సంవత్సరం పరీక్షలలో మొత్తం 20వేల 211 మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. బుధవారం ఉదయం నగరంలోని కోటగల్లి ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో జరుగు ఇంటర్మీడియట్‌ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 44 పరీక్ష కేంద్రాలను ...

Read More »

పాసుపుస్తకాల పంపిణీ

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో నూతనంగా మంజూరైన పట్టాదారు పాస్‌పుస్తకాలను తహసిల్దార్‌ కార్యాలయంలో బుధవారం తహసిల్దార్‌ అసదుల్లా ఖాన్‌, ఎంపీపీ మోబిన్‌ఖాన్‌ లు అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ మండలానికి నూతనంగా 309 పట్టాపాసు పుస్తకాలు మంజూరవడంతో వాటిని లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని తహసిల్దార్‌ తెలిపారు.

Read More »

మంత్రిని కలిసిన తెలంగాణ శంకర్‌

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు, రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని బుధవారం తెలంగాణ శంకర్‌ నిజామాబాద్‌ లో కలిశారు. అభినందనలు తెలిపి పూలమాలతో ఘనంగా సన్మానించారు. మంత్రిపదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా నిజామాబాద్‌కు విచ్చేసిన వేముల ప్రశాంత్‌రెడ్డికి టిఆర్‌ఎస్‌ నాయకులు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఆయన వెంట జాగతి జిల్లా అధ్యక్షుడు అవంతి కుమార్‌ ఉన్నారు.

Read More »

ఉజ్వల్‌ యోజనతో మహిళలకు లబ్ది

బీర్కూర్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంకోల్‌ గ్రామంలో ప్రధానమంత్రి ఉజ్వల్‌ యోజన పథకం ద్వారా ఉచితంగా నాలుగు గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేశామని బీజేవైఎం జిల్లా కార్యదర్శి హనుమాండ్లు యాదవ్‌ తెలిపారు. లబ్ధి పొందినవారు నాగమణి, సుంకరి సవిత, సుంకరి స్వప్న, ఉప్పరి పోశవ్వ మహిళలు ప్రధానమంత్రికి రుణపడి ఉంటామని అన్నారు. గత 50 సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం ఈవిధంగా మహిళల అభివృద్దికి కృషి చేయలేదని, ప్రధానమంత్రి ఆలోచన విధానాన్ని మహిళలందరూ అభినందిస్తున్నామన్నారు. ఉజ్వల యోజన పథకం ...

Read More »

28న బంద్‌…

ఆర్మూర్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి మార చంద్రమోహన్‌ మాట్లాడారు. రైతులు గత కొన్ని రోజులుగా పసుపు, ఎర్రజొన్నల మద్దతు ధర కోసం తమ సమస్యలను పరిష్కరించేందుకు మామిడిపల్లి చౌరస్తా వద్ద, జాతీయ రహదారిపై రాస్తారోకోలు, వంటా వార్పూ చేసి తమ నిరసన వ్యక్తం చేశారని అన్నారు. కాగా మంగళవారం ఉదయం నుండి రైతులు ఆందోళన బాట పట్టి చలో హైదరాబాద్‌ కార్యక్రమం నిర్వహించారన్నారు. ...

Read More »

ఓటరు నమోదుపై బిఎల్‌ఓలకు శిక్షణ

ఆర్మూర్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఆర్మూర్‌ పట్టణంలోని స్థానిక బాలాజీ కల్యాణ మండపంలో బుధవారం బిఎల్‌ఓలకు అవగాహన కల్పించారు. బిఎల్‌ఓలు గ్రామాలకు వెళ్లి ఎన్నికల పాఠశాలను ప్రారంభించాలని, మార్చ్‌ 14 వరకు ఈచునావ్‌ పాఠశాలలో పందొమ్మిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగిన వారికి ఈవియమ్‌లు వివిఫ్యాట్‌ యంత్రాల గురించి ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. ఓటర్లు తప్పకుండ చునవ్‌ పాఠశాలకు రావాలని తమలోని అపోహలు తొలగించుకోవాలని చెప్పాలన్నారు. శిక్షణ ...

Read More »

ఆజాద్‌ దేశభక్తి యువతకు స్ఫూర్తి

ఆర్మూర్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో బుధవారం న్యూ డెమోక్రసి పార్టీ కార్యాలయంలో చంద్రశేఖర్‌ ఆజాద్‌ 88వ వర్ధంతి కార్యక్రమాన్ని పిడిఎస్‌యు, పివైఎల్‌ ఆద్యర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పి వై ఎల్‌ రాష్ట్ర నాయకులు సుమన్‌ మాట్లాడుతూ భారత స్వాతంత్య్రం లో చంద్రశేఖర్‌ ఆజాద్‌ త్యాగం, ధైర్యం,సాహసం అకుంఠిత దేశభక్తి తరతరాలకు స్పూర్తి దాయకమని వారు కొనియాడారు. వలస పాలకుల నుండి దేశాన్ని విముక్తి చేసే క్రమంలో శత్రువు చేతికి చిక్కి ప్రాణాలు కోల్పోకూడదని ...

Read More »

పాడి పశువులకు ఆరోగ్య శిబిరం

ఆర్మూర్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం ఆర్మూర్‌ మండలం ఇస్సాపల్లి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాడి పశువులకు ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది. శిబిరంలో గ్రామ సర్పంచ్‌, ఎంపీటీసీ పాల్గొన్నారు. శిబిరంలో జిల్లా పశువైద్యశాల పశువైద్యాధికారి డాక్టర్‌ రాకేష్‌ పాల్గొని సుమారు 50 పశువులకు వివిధ చికిత్సలు చేశారు. గర్భకోశ వ్యాధులకు కూడా చికిత్సలు అందించారు. పశువులకు చూడి నిర్ధారణ పరీక్షలు చేసి పాడి పశువుల పెంపకం లో రైతులకు ఉన్న అపోహలను కొంతవరకు నివత్తి ...

Read More »

నేషనల్‌ యూత్‌ పార్లమెంట్‌ 2019

బీర్కూర్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత ప్రభుత్వం యువత రాజకీయ రంగంలోకి రావాలనే గొప్ప ఉద్దేశ్యంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేషనల్‌ యూత్‌ పార్లమెంట్‌ 2019 కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహిస్తుండగా ప్రతి జిల్లాలో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నుంచి బుధవారం జాతీయ స్థాయిలో పాల్గొన్న యువకులతో స్వయంగా దేశ ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు. యువ రాజకీయ నాయకులు తయారై వారి కొత్త కొత్త ఆలోచనలతో దేశ భవిష్యత్తు మార్చాలనే ఆలోచనతో యూత్‌ పార్లమెంట్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. అందులో ...

Read More »