Breaking News
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు

దేవతా మూర్తుల విగ్రహ ప్రతిష్టాపన

రెంజల్‌, మార్చ్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కూనేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో ఆదివారం గణపతి, ఉమామహేశ్వర, సాయిబాబా దేవతమూర్తుల విగ్రహాలను వేదమంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవంగా ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదపండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతిష్ఠాపన చేశారు.

గత మూడు రోజుల నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. గ్రామాభివద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సోమవారం శివరాత్రి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు కరణ్‌ రెడ్డి, సాయిలు, లింగం, గంగారెడ్డి, లింగారెడ్డి, అరవింద్‌, వినోద్‌, అభిలాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లా ప్రజల‌కు మహాశివరాత్రి శుభాకాంక్షలు

నిజామాబాద్‌, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర రోడ్లు-భవనాలు, గ ృహనిర్మాణ, ...

Comment on the article